ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్ కలిగిన కార్లు - ధర రూ.10 లక్షల కంటే తక్కువే..
సమశీతోష్ణ స్థితి కలిగిన మనదేశంలో చాలామంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్ కలిగి ఉన్న కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో రూ. 10 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ కార్లను గురించి తెలుసుకుందాం.
మారుతి సుజుకి బ్రెజ్జా
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి కంపెనీకి చెందిన 'బ్రెజ్జా' ప్రారంభం నుంచి మంచి అమ్మకాలను పొందుతోంది. బ్రెజ్జా యొక్క వీఎక్స్ఐ వేరియంట్ ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్ కలిగి ఉంటుంది. ఈ వేరియంట్ ధర రూ.9.70 లక్షలు (ఎక్స్ షోరూమ్). అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన బ్రెజ్జా ప్రారంభ ధరలు రూ.8.34 లక్షల నుంచి రూ.14.14 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి.

నిస్సాన్ మాగ్నైట్
ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న నిస్సాన్ కంపెనీ యొక్క మాగ్నైట్ SUV కూడా తన ఎక్స్ఎల్ వేరియంట్లో ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్ అందిస్తోంది. దీని ధర రూ. 7.04 లక్షలు (ఎక్స్ షోరూమ్). కాగా మాగ్నైట్ ప్రారంభ ధరలు రూ. 6 లక్షల నుంచి రూ. 11.27 లక్షల మధ్య ఉన్నాయి. ఈ కారు మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి అద్భుతమైన పనితీరుని అందిస్తుంది.
రెనాల్ట్ కైగర్
రెనాల్ట్ కంపెనీకి చెందిన అత్యదిక అమ్మకాలు పొందిన కైగర్ ప్రారంభ ధరలు రూ. 6 లక్షల నుంచి రూ. 11.23 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. కంపెనీ కైగర్ యొక్క RXT (O) వేరియంట్లో ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్ అందిస్తుంది. తక్కువ ధరలో మంచి ఫీచర్స్ కలిగిన ఈ కారును ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు.

టాటా పంచ్
దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ యొక్క అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటి పంచ్. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ కలిగిన ఈ కారు ప్రారంభ ధరలు రూ. 6.13 లక్షల నుంచి రూ. 10.20 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. కాగా టాటా పంచ్ క్రియేటివ్ వేరియంట్లో ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్ ఉంటుంది. ఈ కారు పర్ఫామెన్స్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్
హ్యుందాయ్ కంపెనీ యొక్క ఎక్స్‌టర్ మైక్రో SUVలో కంపెనీ కంపెనీ ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్ ఉంటుంది. ఇది ఎస్ఎక్స్ వేరియంట్లో ఉంటుంది. దీని ధర రావు. 8.23 లక్షలు (ఎక్స్ షోరూమ్). కాగా ఈ SUV ప్రారంభ ధరలు రూ. 6.13 లక్షల నుంచి రూ. 10.28 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. ఇది మంచి డిజైన్, ఫీచర్స్ మరియు కలర్ ఆప్షన్స్ పొందుతుంది.

టాటా నెక్సాన్
టాటా మోటార్స్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన మరియు అత్యధిక అమ్మకాలు పొందుతున్న నెక్సాన్ కూడా ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్ పొందుతుంది. ఈ ఫీచర్ టాటా నెక్సాన్ యొక్క ప్యూర్ వేరియంట్లో లభిస్తుంది. దీని ధర రూ. 9.80 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే నెక్సాన్ ధరలు రూ. 8.15 లక్షల నుంచి రూ. 15.80 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉన్నాయి.
మారుతి సుజుకి ఫ్రాంక్స్
మారుతి సుజుకి కంపెనీకి చెందిన ఫ్రాంక్స్ ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్ కలిగిన కార్ల జాబితాలో ఒకటి. కంపెనీ ఈ ఫీచర్ బేస్ మోడల్ నుంచి అందిస్తోంది. ఈ కారు ధరలు రూ. 7.51 లక్షల నుంచి రూ. 13.04 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. అద్భుతమైన డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ కలిగిన ఈ కారు అంతకు మించిన పనితీరుని అందిస్తుంది.


Click it and Unblock the Notifications








