కొత్త కార్లు మళ్లీ పాత మోడల్‌లోకి మారబోతున్నాయా.??.. అదే జరిగితే ఇక టచ్‌స్క్రీన్‌కి గుడ్‌బై చెప్పాల్సిందే.!!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆటో మొబైల్ రంగంలో విస్తృతమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా కారు ఇంటీరియర్‌లో ప్రతిదీ డిజిటల్‌మయమైపోయింది. స్మార్ట్ ఫోన్‌లలో స్వైప్ చేస్తున్న మాదిరిగా డ్యాష్‌బోర్డ్‌ను కూడా టచ్‌స్క్రీన్‌లా మార్చడంతో.. వాహనదారుల పని చాలా సులభమై పోయింది. అయితే దీని వల్ల భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందంటే మీరు నమ్ముతారా.??
కార్లలో ఒకప్పుడు మీరు ఫిజికల్ బటన్‌లనే చూసి ఉంటారు. డ్రైవర్లు డ్యాష్‌బోర్డ్ లేదా, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఏది ఆపరేట్ చేయాలనుకున్నా అందుకు బటన్లు ఉండేవి. అయితే టెక్నాలజీ మారుతున్న కొద్దీ వాటి స్థానంలో టచ్‌స్క్రీన్ సిస్టమ్(Car Touch Screen System) వచ్చింది. కస్టమర్లు కూడా ఎక్కువగా వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు వస్తున్న కార్లలో ఫిజకల్ బటన్లు అరుదుగా కనిపిస్తున్నాయి.

కారు కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్లు ఆధునిక సాంకేతికతను ఇష్టపడుతూ అలాంటి సౌకర్యాలు ఉన్న కార్లనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా కార్ల తయారీదారులు సైతం అత్యాధునిక సాంకేతికతతో కార్లను తయారు చేస్తున్నాయి. కానీ ఈ టచ్‌స్క్రీన్ సిస్టమ్ ద్వారా డ్రైవర్లు ఎక్కువగా పరధ్యానంలో ఉంటున్నారని వెల్లడైంది. వీటికంటే ఫిజికల్ బటన్‌ల ద్వారానే ప్రయాణికులు సురక్షితంగా ఉండొచ్చట.
కార్లలో ప్రయాణికుల భద్రతను పరీక్షించేందుకు గ్లోబల్ ఎన్‌క్యాప్(Global NCAP), యూరో ఎన్‌క్యాప్(EURO NCAP) లాంటి సంస్థలు పనిచేస్తున్నాయి. ఇవి కార్లకు క్రాష్ టెస్ట్‌ను నిర్వహించి వాటికి స్టార్ రేటింగ్, స్కోర్ పాయింట్లను నిర్ణయిస్తాయి. ఈ క్రమంలో భారత్‌లో కూడా కేంద్ర ప్రభుత్వం భారత్ NCAP ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా మన దేశంలో కార్ల తయారీదారులు ఇక్కడే క్రాష్ టెస్ట్ నిర్వహించవచ్చు.

ఈ క్రమంలో EURO NCAP కీలక నిర్ణయం తీసుకుంది. క్రాష్ టెస్ట్ కోసం కీలక ప్రమాణాలను సెట్ చేసింది. టచ్‌స్క్రీన్ నియంత్రణల ద్వారా.. డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పరధ్యానంలో ఉన్నారని ఒక అధ్యయనంలో వెల్లడి కావడంతో.. త్వరలో యూరో ఎన్‌క్యాప్ కొత్త రూల్స్(Physical Buttons IN Cars)ను తీసుకురానుంది.
2026 సంవత్సరంలో, యూరో NCAP తన పరీక్షా విధానంలో కొన్ని మార్పులను తీసుకువచ్చే యోచనలో ఉంది. దీని ప్రకారం, Euro NCAP యొక్క అనుబంధ ఆర్గనైజర్ ARS టెక్నికా, ఆటోమొబైల్స్‌లో భద్రతా లక్షణాలను పరీక్షించే సంస్థగా పని చేస్తుండగా.. ఆ సంస్థ ఇటీవల ఓ సర్వే నిర్వహించి షాకింగ్ విషయాలను వెల్లడించింది.

కస్టమర్ల డిమాండ్ దృష్ట్యా ఆటోమేకర్లు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లను తమ వాహనాల్లో ప్రధానాంశంగా చేసుకుంటున్నారని అధ్యయనం తేల్చి చెప్పింది. అయితే ఇది వాహనదారులకు ఆటంకం కలిగిస్తుందని వెల్లడించింది. తద్వారా 2026లో కార్లకు సేఫ్టీ రేటింగ్ ఇవ్వడంలో ఫిజికల్ బటన్స్ ఉన్న కార్లకు ఎక్కువ రేటింగ్ వచ్చేలా EURO NCAP నిబంధనలు మార్చనున్నట్లు సమాచారం.
టచ్ స్క్రీన్ నియంత్రణలపై ఎక్కువగా ఆధారపడటం ద్వారా డ్రైవర్ల దృష్టి మరల్చే ప్రమాదం ఉందని తెలుస్తోంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు టచ్ స్క్రీన్ సిస్టమ్‌ను ఆపరేట్ చేసేటప్పుడు.. డ్రైవర్ల దృష్టి రోడ్డుపై మరలుతుంది. కొన్ని సెకన్ల పాటు వారు టచ్‌స్క్రీన్‌ను ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. తద్వారా వారి దృష్టి రోడ్డుపై నుంచి మళ్లడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నట్లుగా అధ్యయనంలో వెల్లడైంది.
ఈ అధ్యయనాన్ని దృష్టిలో ఉంచుకుని.. క్రాష్ టెస్ట్ సమయంలో, అన్ని కార్లలో టచ్ కంట్రోల్‌లను, ఫిజికల్ బటన్లను పరిశీలించి, దానికి అనుగుణంగా రేటింగ్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజుల్లో, టచ్ స్క్రీన్ యాక్సెస్ సులభంగా ఉన్నప్పటికీ.. కొన్ని సందర్భాల్లో ఎక్కువ సమయం పడుతుండటంతో డ్రైవర్లు డ్రైవింగ్‌పై దృష్టి సారించలేరు.
అందువల్ల, క్రాష్ టెస్ట్ సమయంలో దీనిని నివారించడానికి నియమాలను రూపొందించాలని Euro NCAP యోచిస్తోంది. కానీ Euro NCAP ప్రభుత్వ సంస్థ కాకపోవడంతో.. అన్ని వాహన తయారీదారులు తప్పనిసరిగా టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లను నివారించాలని గట్టిగా చెప్పలేరు. అయితే యూరో ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌ను సాధించడానికి ఇది కీలకమని తెలుస్తోంది.
కానీ ఫిజకల్ బటన్ సిస్టమ్ అమల్లోకి వస్తే.. మార్కెట్లో చాలా మంది ఆటోమేకర్లు తమ కార్లలో టచ్ స్క్రీన్‌ను మరింత ఫిజికల్ కంట్రోల్ బటన్‌లతో స్క్రీన్‌లతో భర్తీ చేస్తాయని భావించవచ్చు. కార్లు మళ్లీ ఓల్డ్ మోడల్‌కు మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందుకు సంబంధించి త్వరలోనే పూర్తి సమాచారం కూడా వెల్లడి కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








