ఇండియాలో మరో కొత్త ట్రెండ్ స్టార్ట్.. రానున్న రోజుల్లో అన్ని ఇవే కార్లు..! పోటీకి సై అంటున్న టయోటా

ప్రపంచవ్యాప్తంగానే కాకుండా ఇండియాలో కూడా వాహనాల వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. ప్రజల ఆదాయ పరిస్థితుల్లో మార్పులు రావడంతో చాలా మంది సొంత కార్లను కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నారు. అయితే ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ వాహనాల వాడకం క్రమంగా తగ్గిపోతుంది. ఈ ప్లేస్‌లోకి ఇప్పుడు ఈవీ కార్లు, హైబ్రిడ్ కార్లు వచ్చి చేరాయి. దీంతో ఆటోమొబైల్ తయారీదారులు కూడా ఇప్పుడు ఉన్నటువంటి మోడళ్లను ఈవీలలో, హైబ్రిడ్ వేరియంట్లలో తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) ఇండియాలో కొత్త హైబ్రిడ్ కారును విడుదల చేయాలని చూస్తుంది. దీని పేరు 'క్యామ్రీ హైబ్రిడ్‌( camry-hybrid)'. దీనిని కంపెనీ డిసెంబర్ 11, 2024న ఇండియా మార్కెట్లో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో తొమ్మదో జనరేషన్ ఉండగా, ఇప్పుడు దేశీయంగా అందుబాటులోకి వస్తుంది. రానున్న రోజుల్లో అన్ని హైబ్రిడ్ కార్లే వచ్చే అవకాశం ఉంది.

ఇండియాలో ఈ హైబ్రిడ్ కారు లాంచ్ అయిన తర్వాత దీని ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్, పెర్మామెన్స్‌తో దేశీయ వినియోగదారులకు బాగా నచ్చుతుందని ఈ మోడల్ పై టయోటా భారీ అంచనాలు పెట్టుకుంది. దీనికి పోటీగా కొత్త స్కోడా సూపర్బ్ ఉండవచ్చని మార్కెట్ వర్గాల వారు భావిస్తున్నారు. ఈ మోడల్ వచ్చే ఏడాది మార్కెట్లోకి కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని తెలుస్తుంది.

Toyota Camry Hybrid Launch December

కొత్త క్యామ్రీ హైబ్రిడ్‌ ధర ఇండియాలో రూ.46.20 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉండే అవకాశం ఉంది. ఇంజిన్ విషయానికి వస్తే, 2.5-లీటర్ నాలుగు-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్ 6,000 rpm వద్ద 185 bhp పవర్‌ను, 3,200 నుంచి 5,200 rpm వద్ద 21 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ 134 bhp పవర్‌ను 208 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది.

ఈ హైబ్రిడ్ కారు పెర్ఫామెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్‌తో కలిపి ఇది 228 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే 19.6Kmplగా ఉంది. దీని టాప్ స్పీడ్ గంటకు 180 కి.మీ. అంతర్జాతీయ మార్కెట్‌లో సిల్వర్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెరల్ మైకా, ఎమోషనల్ రెడ్ 3 వంటి తొమ్మిది కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇండియాలో మరిన్ని కలర్ వేరియంట్లలో లభించే అవకాశం ఉంది.

Toyota Camry Hybrid Launch Details

క్యామ్రీ హైబ్రిడ్ డిజైన్‌ పూర్తిగా అప్‌డేట్ అయింది. ముందు LED హెడ్‌లైట్‌లు, డేటైమ్ రన్నింగ్ లైట్‌‌లు, C- ఆకారంలో టెయిల్ ల్యాంప్‌ల సెటప్ ఉంటుంది. ఫ్రంట్ గ్రిల్ కూడా చాలా అందంగా కనబడుతుంది. కొత్త డిజైన్ స్టైల్‌లో 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ కారుకు మరింత అందాన్ని చేకూర్చేలా ఉన్నాయి. క్యాబిన్‌ కూడా చాలా విషాలంగా ఉంటుంది.

లోపల అన్ని అధునాతన ఫీచర్లు ఉన్నాయి. 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, మూడు-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌, కంఫర్టబుల్ సీట్లు, ప్రయాణంలో మంచి పాటల అనుభూతి కోసం తొమ్మిది-స్పీకర్ JBL ఆడియో సిస్టమ్‌, ఎక్కువ లగేజీని పెట్టడానికి సరిపడా స్థలం వంటివి క్యామ్రీ హైబ్రిడ్‌లో ఉన్నాయి.

Toyota Camry Hybrid

ఇది 4,920 మి.మీ పొడవు, 1840 మి.మీ వెడల్పు, 1455 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది. వీల్‌బేస్ దాదాపు 2,825 మి.మీ వరకు ఉంది. అన్ని రకాల రోడ్లపై కూడా ఇది రయ్ మంటూ దూసుకుపోతుంది. ప్రయాణికుల భద్రత పరంగా అధునాతన ADAS సేఫ్టీ, ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌లు, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, పాడిల్ షిఫ్టర్‌లు వంటివి ఉన్నాయి. కొత్త టొయోటా క్యామ్రీ మూడు వేరు వేరు డ్రైవ్ మోడ్‌లలో ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, November 19, 2024, 16:10 [IST]
English summary
Toyota camry hybrid ready to launch in india all details check here
Read more on: #toyota #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+