ఈ కంపెనీ కార్లకు భారీ డిమాండ్.. షోరూమ్‌లలో విపరీతమైన బుకింగ్స్.. కారు ఇంటికి రావాలంటే వెయిట్ చేయాల్సిందే!
బైకుల వాడకంతో పాటు కార్ల వినియోగం కూడా ప్రస్తుతం భారీగా పెరిగింది. దాదాపు ప్రతి ఇంట్లో చిన్న కారు అయిన కూడా కనిపిస్తుంది. దీంతో తయారీ కంపెనీలు డిమాండ్ మేరకు కొత్త కార్లను వరుసగా విడుదల చేస్తున్నాయి. అయితే కస్టమర్ల నుంచి కొన్ని మోడళ్లకు అధిక డిమాండ్ వస్తుండటంతో కంపెనీలు వాటి డెలివరీ కొంత ఆలస్యం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే దేశంలో ఆటోమొబైల్ విభాగంలో ప్రముఖ కంపెనీ టయోటా(toyota) కిర్లోస్కర్ మోటార్ కూడా తన కస్టమర్లకు వాహనాలను డెలివరీ చేయడానికి కొంత వేయిటింగ్ పీరియడ్‌ను ప్రకటించింది. డిమాండ్ మేరకు ఒక్కో మోడల్‌కు ఒక్కో వెయిటింగ్ పిరియడ్ ఉంది. తాజాగా మంగళవారం, నవంబర్ 1 నుండి అమలులోకి వచ్చిన కొత్త నిబంధన ప్రకారం, అన్ని కార్ల కోసం వెయిటింగ్ పీరియడ్ వివరాలను తన అధికారిక టయోటా వెబ్‌సైట్‌లో వెల్గడించింది. ఆ వివరాలు క్రింది కథనంలో ఇవ్వడం జరిగింది.
టయోటా అర్బన్ క్రూయిజర్ హైడర్‌కు చెందిన హైబ్రిడ్, పెట్రోల్ వేరియంట్‌లు ఆర్డర్ చేసిన 1 నెలలోపు డెలివరీ చేయబడతాయని కంపెనీ తన సైట్‌లో పేర్కొంది. అయితే, CNG పవర్డ్ హైడర్ 1 నుండి 2 నెలల తర్వాత కొనుగోలుదారులకు డెలివరీ అవుతుంది. ఇంకా ఫ్యామిలీ MPV రుమియన్ పెట్రోల్ వేరియంట్‌లు 1 నుండి 2 నెలల బుకింగ్ తర్వాత అలాగే CNG వేరియంట్‌లు 2 నెలల తర్వాత డెలివరీ చేయబడతాయి.

ముఖ్యంగా ఇండియాలో టయోటా కిర్లోస్కర్ నుంచి మంచి ఆదరణ కలిగిన ఇన్నోవా హిక్రాస్ (హైబ్రిడ్) కారును కస్టమర్లకు డెలివరీ చేయడానికి దాదాపు 1 సంవత్సరం పడుతుంది. అయితే గ్లాంజా హ్యాచ్‌బ్యాక్ మాత్రం అతి తక్కువ వెయిటింగ్ పీరియడ్‌ను కలిగి ఉంది. ఈ కారు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్‌లను బుకింగ్ చేసిన ఒక నెల తర్వాత డెలివరీ చేస్తామని కంపెనీ వెబ్‌సైట్‌లో వెల్లడించింది.
ఇంకా, ఫ్లాగ్‌షిప్ SUV 'అర్బన్ క్రూయిజర్ టిస్సర్' వేరియంట్‌లు కూడా 1 నెల తర్వాత కస్టమర్లకు డెలివరీ అవుతాయి. ముఖ్యంగా ఇండియాలో ఎక్కువ డిమాండ్ ఉన్న ఇన్నోవా MPVలు కొంచెం ఎక్కువ వెయిటింగ్ పీరియడ్‌ను కలిగి ఉన్నాయి. వీటిని ఆర్డర్ చేసిన 3 నుండి 4 నెలల తర్వాత కస్టమర్లకు డెలివరీ చేస్తారు. ఇంకా, ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్ వేరియంట్‌లు 6 నెలల తర్వాత ఇంటికి వస్తుంది.

అదే, హైబ్రిడ్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్) వేరియంట్‌లు 11 నెలల తర్వాత కస్టమర్లకు చేరుతాయి. టయోటా ఫార్చ్యూనర్ SUVని ఈ రోజు బుక్ చేసుకుంటే 1 నుండి 2 నెలల తర్వాత కస్టమర్లకు డెలివరీ చేస్తారు. కొత్త ఫార్చ్యూనర్ ధర రూ. 33.43 నుండి రూ. 51.44 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఇది 2.7-లీటర్ పెట్రోల్, 2.8-లీటర్ డీజిల్ ఇంజిన్‌లలో లభిస్తుంది. దీనిలో 7 మంది కూర్చోవచ్చు.
టయోటా వెల్‌ఫైర్ ప్రీమియం కారును బుకింగ్ చేసిన 7 నెలల తర్వాత డెలివరీకి వస్తుంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.1.22 నుంచి రూ.1.32 కోట్లు. ఇది 2.5-లీటర్ హైబ్రిడ్ (పెట్రోల్- ఎలక్ట్రిక్) ఇంజిన్‌లలో లభిస్తుంది. ఇది టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో సహా డజన్ల కొద్దీ ఫీచర్లను కలిగి ఉంది.

మరో మోడల్ టయోటా క్యామ్రీ లగ్జరీ సెడాన్. ఒక నెల వెయిటింగ్ పీరియడ్‌ను కలిగి ఉంది. దీని ధర రూ.46.17 లక్షల (ఎక్స్-షోరూమ్). ఇది 2.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో 16 kmpl మైలేజీని అందిస్తుంది. టయోటా హిలక్స్ ప్రీమియం పికప్ ట్రక్ బుకింగ్ చేసిన 1 నెల తర్వాత కస్టమర్‌లకు డెలివరీకి వస్తుంది. దీని ధర రూ. 30.40 నుంచి రూ. 37.90 లక్షల మధ్య ఉంది.


Click it and Unblock the Notifications








