ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్స్(Toyota Motors).. తన టయోటా ఫార్చ్యూనర్ ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల చేసింది. తన Rugged(కఠినమైన) ఏడు-సీట్ల SUV యొక్క కొత్త వెర్షన్‌ను ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్ పేరుతో లాంచ్ చేసింది. మరి ఈ స్పెషల్ ఎడిషన్ ధర, ఫీచర్లు పూర్తి వివరాలు ఈ కథనంలో..
టయోటా ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్.. డీజిల్ 4x2 వేరియంట్‌లపై ఆధారపడి ఉండగా.. ఇందులో ఫీచర్ల పరంగా ఎక్స్‌టీరియర్ పరంగా కొన్ని మార్పులను కలిగి ఉంది. కాగా టయోటా ఫార్చ్యూనర్ భారత్‌లో 2009 లాంచ్ కాగా ఇప్పటివరకూ 2.5 లక్షల కార్లను విక్రయించినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్ డీజిల్-MT మరియు డీజిల్-AT వెర్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.

కాగా టయోటా ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్(Toyota Fortuner Leader Edition) ధరను అధికారికంగా సంస్థ ప్రకటించలేదు. లీడర్ ఎడిషన్ ధరలు స్టాండర్డ్ ఫార్చ్యూనర్ 4x2 వేరియంట్ రూ. 35.93 లక్షల-38.21 లక్షల ధర కంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక ఫీచర్ల పరంగా ఇందులో చాలా అప్‌డేట్లను చూడవచ్చు.
కొత్త టయోటా ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్(Toyota Fortuner Leader Edition Launch)లో డ్యూయల్-టోన్ సీట్ కవర్లు, టైర్ ప్రెజర్ మానిటర్, ఆటో-ఫోల్డింగ్ ORVMలు మరియు వైర్‌లెస్ ఛార్జర్‌ల వంటి వాటిని అందిస్తోంది. ఎక్స్‌టీరియర్ పరంగా, ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్ కొత్త బ్లాక్ అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. ఇందులో మూడు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లు కూడా ఉన్నాయి.
సూపర్ వైట్, ప్లాటినం పెర్ల్ వైట్ మరియు సిల్వర్ మెటాలిక్.. ఈ కలర్స్ అన్నీ కాంట్రాస్టింగ్ బ్లాక్ బిట్స్‌తో వస్తాయి. ఇక కొత్త ఫ్రంట్ మరియు రియర్ బంపర్ 'స్పాయిలర్స్' లీడర్ ఎడిషన్‌ను మరింత ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి. వీటిని టయోటా అధికారిక ఉపకరణాల జాబితాలో భాగమని చెప్పింది. డీలర్ ద్వారా ఇన్‌స్టాల్ చేయబడినట్లు సంస్థ వెల్లడించింది. .
ఇంజిన్ పరంగా టయోటా ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్ 204 hp, 2.8-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 4x2 రూపంలో మాత్రమే కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. ఇది 6-స్పీడ్ ఆటోతో జత చేయబడినప్పుడు.. 500 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేసినప్పుడు 420 Nm టార్క్‌ను అందిస్తుంది.
ఇక భారత మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్(Toyota Fortuner) మోడళ్లకు భారీగా డిమాండ్ ఉన్నప్పటికీ.. పోటీ కూడా గట్టిగానే ఉంది. ఇది MG గ్లోస్టర్‌కు గట్టిపోటీనిస్తోంది. కాగా త్వరలో పాత ప్రత్యర్థి ఫోర్డ్ ఎండీవర్ తిరిగి రానున్న విషయం తెలిసిందే. సంస్థ దీనికి ఈసారి ఎవరెస్ట్ అని పేరు పెట్టే అవకాశం ఉన్నట్లు ఆటో నిపుణులు చెబుతున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








