30 కి.మీ మైలేజీ ఇచ్చే ఆ కారు సేల్స్ 10% తగ్గాయి..అయినా కానీ ఫీచర్లు, డిజైన్‌, సేఫ్టీ అన్నింట్లో ఆల్‌రౌండర్‌!

మార్కెట్‌లో టయోటా కిర్లోస్కర్ మోటార్స్‌కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న ప్రతీ మోడల్‌ ఓ ఢిఫరెంట్‌ స్టైలింగ్‌, డిజైన్‌, ఫీచర్లతో అందుబాటులో ఉంటాయి. ఇందులో గ్లాంజా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కూడా ఒకటి. బడ్జెట్‌ ధరలో టాప్‌ క్లాస్‌ ఫీచర్లతో ఈ మోడల్‌ కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఓ విధంగా ఈ టయోటా గ్లాంజాను మారుతి సుజుకి బాలెనోకి రీబ్యాడ్జ్‌ వెర్షన్‌ అని చెప్పవచ్చు. దీంతో ఈ హ్యాచ్‌బ్యాక్‌కి ఓ రేంజ్‌లో పాపులారిటీ వచ్చింది. ఈ కారుకి సంబంధించిన సేల్స్ వివరాలు ఈ కథనంలో..

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర హ్యాచ్‌బ్యాక్స్‌తో పోలిస్తే ఇది గ్లాంజా ప్రీమియం మోడల్‌గా మార్కెట్‌లో అందుబాటులో ఉంది. గత నెలలో టయోటా గ్లాంజాకి సంబంధించిన సేల్స్ రిపోర్ట్ వెల్లడైంది. తాజాగా వెల్లడైన అమ్మకాల గణాంకాల ప్రకారం టయోటా గ్లాంజా గత నెలలో 4,273 యూనిట్లను మాత్రమే విక్రయించింది. గత ఏడాది అక్టోబర్‌లో కంపెనీ 4,724 యూనిట్లు సేల్‌ అయ్యాయి.

Toyota Glanza October 2024 Sales

ఇక గత ఏడాది అమ్మకాలతో పోలిస్తే 10 శాతం అమ్మకాలు క్షీణించాయి. ఈ టయోటా గ్లాంజా E, S, G, V అనే వేరియంట్స్‌లో లభిస్తుంది. ప్రస్తుతం టయోటా గ్లాంజాా లిమిటెడ్‌ ఎడిషన్‌ కూడా కొనుగులోకి అందుబాటులో ఉంది. ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌లో రూ.17,381 విలువ చేసే యాక్సెసరీస్‌ని అందిస్తుంది. అలాగే దీనిపై రూ. 1 లక్ష వరకు ఇయర్‌ ఎండ్‌ ఆఫర్లను పొందవచ్చు.

ఈ కారు కేఫ్ వైట్, సిల్వర్, గేమింగ్ గ్రే, స్పోర్టిన్ రెడ్, ఇన్‌స్టా బ్లూ వంటి 5 మోనోటోన్ కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఈ కారు కేవలం 5 సీటర్‌ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంటుంది. కావున చిన్న ఫ్యామిలీలు ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా 5 వరకు ప్రయాణించవచ్చు. ఈ కారు ఫ్రంట్ డిజైన్ సరికొత్తగా ఉంటుంది. టయోటా గ్లోబల్ కార్లకు ఏమాత్రం తీసిపోపోదు.

Toyota Glanza Sales

దీని ముందు భాగంలో క్యామ్రీ లాంటి ఫ్రంట్ గ్రిల్, బంపర్, కొత్త క్రోమ్, ఎల్-ఆకారంలో LED DRLs (డేటైమ్ రన్నింగ్ ల్యాంప్) ను కలిగి ఉంటుంది. ఇక దీని వెనుక భాగంలో సవరించిన బంపర్, టెయిల్‌లైట్స్‌ వంటివి ఉన్నాయి. సైడ్‌ ఫ్రొఫైల్‌లో 16 ఇంచెస్‌ వీల్స్‌, బాలెనో మాదిరిగా ఉంటుంది. పైన చెప్పిన విధంగా ఈ కారు స్టైలింగ్ పరంగా ప్రీమియం లుక్‌ని అందిస్తుంది.

దీని ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో మల్టీ ఫంక్షనల్ లెదర్‌తో చుట్టిన ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, అప్డేటెడ్ ఇన్‌స్ట్రూమెంట్ కన్సోల్, సెంటర్ కన్సోల్‌లో కొత్త ఎయిర్ కాన్వెంట్స్‌, వెనుక ఆటోమేటిక్ ఏసీ వంటివి ఉన్నాయి. వీటితో పాటు వాయిస్ కమాండ్స్‌తో ఆపరేట్‌ చేసేలా పెద్ద 9 ఇంచెస్‌ స్మార్ట్ ప్లే ప్రో+ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, నావిగేషన్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Toyota Glanza Latest News

360 డిగ్రీల కెమెరా, హెడ్స్-అప్ డిస్ప్లే, వాయిస్ అసిస్ట్ ద్వారా ఫైండ్ మై కార్ ఫీచర్, రిమోట్ లాక్, అన్‌లాక్‌ ఫంక్షన్స్ వంటి ఫీచర్లతో ఫుల్‌ కార్ టెక్‌ ఫీచర్లతో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఈ టయోటా గ్లాంజాలో 1.2-లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 89 bhp పవర్, 113 nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది.

ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌ ఆప్షన్‌తో కొనుగోలు చేయవచ్చు. ఇక సీఎన్‌జీ మోడ్‌లో దీని ఇంజిన్ 76bhp వద్ద 98.5 nm టార్క్‌ని విడుదల చేస్తుంది. ఇది కేవలం 5 స్పీడ్‌ మ్యానువల్‌ గేర్‌బాక్స్‌ ఆప్షన్‌తో మాత్రమే వస్తుంది. సీఎన్‌జీ మోడ్‌లో కిలో సీఎన్‌జీకి 30.61 కి.మీ మైలేజీని ఇస్తుంది. ఇది ఐడీల్‌ స్టార్ట్‌/ స్టాప్‌ సిస్టమ్‌తో కూడా వస్తుంది.

సేఫ్టీ పరంగా ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), వెహికిల్ స్టెబిలిటీ కంట్రోల్ (VSC), ABS విత్ EBD, రియర్‌ పార్కింగ్‌ సెన్సార్స్‌, హిల్‌ హోల్డ్‌ అసిస్ట్‌, ISOFIX చైల్డ్‌ సీట్‌ యాంకర్స్‌ వంటి హై-ఎండ్ సేఫ్టీ ఫీచర్లతో గ్లాంజా అందుబాటులో ఉంటుంది. ఈ కారు హ్యూందాయ్‌ i20, టాటా ఆల్ట్రోజ్‌ కార్లకు గట్టి పోటీని ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, November 26, 2024, 9:10 [IST]
English summary
Toyota glanza october 2024 sales report check here in telugu
Read more on: #toyota #car sales #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+