పండుగకు దుమ్ము రేపుతున్న స్పెషల్ హైబ్రిడ్ కారు ఇదే.. కేవలం రూ.14 లక్షల..
ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ టయోటా పండుగల సీజన్‌లో తన అమ్మకాలను పెంచుకోడానికి కొత్త మోడల్ 'హైరైడర్ ఫెస్టివల్ లిమిటెడ్ ఎడిషన్(Hyryder Festival Edition)'ను లాంచ్ చేసింది. ఈ పత్యేక ఎడిషన్ మిడ్-స్పెక్ G, టాప్-స్పెక్ V ట్రిమ్‌లలో వినియోగదారులకు నచ్చే అన్ని ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. ఈ కారు లోపల, బయట నుంచి చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రత్యేక ఎడిషన్ 13 టయోటా జెన్యూన్ యాక్సెసరీలను కలిగి ఉంది. కస్టమర్ల ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ కారును మైల్డ్ హైబ్రిడ్ వెర్షన్, స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లలో విడుదల చేసింది.
ఇంజిన్, సామర్థ్యం: మైల్డ్-హైబ్రిడ్ మోడల్ 12V సిస్టమ్‌తో 103 హార్స్ పవర్, 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో, 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంది. అదే స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ 92 హర్స్ పవర్‌తో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 80hp ఎలక్ట్రిక్ మోటారుతో కలిపి మొత్తంగా 116 హార్స్ పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

హైరైడర్ ఫెస్టివల్ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను బట్టి ఎక్స్-షోరూమ్ రూ.14.49 లక్షల నుంచి రూ. 20 లక్షల ధరలో అందుబాటులో ఉంది. ముఖ్యంగా కంపెనీ ప్రత్యేకించి రూ. 50,817 వరకు విలువైన కాంప్లిమెంటరీ యాక్సెసరీస్ ప్యాకేజీని సైతం అందిస్తుంది. ధర కూడా మధ్యస్థంగా ఉండటంతో మార్కెట్లో వినియోగదారుల నుంచి ఎక్కువ డిమాండ్ వస్తుందని టయోటా కంపెనీ అధికారులు పేర్కొంటున్నారు.
మైలేజ్ పరంగా చూసినట్లయితే హైబ్రిడ్ మాన్యువల్ 21.12 కిమీ/లీ, ఆటోమేటిక్ వెర్షన్ 20.58 కిమీ/లీ, AWD(ఆల్ వీల్ డ్రైవ్) టెక్నాలజీతో 19.39 కిమీ/లీ వరకు మైలేజ్ వస్తుంది. ఈ ప్రత్యేక ఎడిషన్‌లో కొత్త మడ్ ఫ్లాప్‌లు, డోర్ వైజర్, లోపల ఆల్-వెదర్ 3D ఫ్లోర్ మ్యాట్‌లు, సీట్లకు ముందు విశాలవంతమై ప్లేస్, డాష్ క్యామ్‌ను అందించారు.

ఇవి కాకుండా రెండు వేరియంట్లలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, హెడ్స్-అప్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, టయోటా ఐ-కనెక్ట్ కనెక్ట్ చేయబడిన కార్ టెక్, 360-డిగ్రీల పార్కింగ్ కెమెరా వంటి వాటిని ఈ కారులో పొందవచ్చు. చీకట్లో మెరుగైన వెలుతురు కోసం LED హెడ్‌లైటింగ్‌ను కొత్త డిజైన్‌తో అందించారు.
హైరైడర్ ఫెస్టివల్ లిమిటెడ్ ఎడిషన్‌లో ప్రయాణికుల భద్రత కోసం సీట్‌బెల్ట్, ABS, EBD, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ అసిస్ట్, ISOFIX మౌంట్‌లు వంటివి ఉన్నాయి. దీనిలో 5 మంది సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. మైలేజ్ మాత్రమే కాకుండా, ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ సంఖ్యలో కస్టమర్లు ఈ కారును కొనుగోలు చేస్తున్నారు.

వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా, వారి అవసరాలను తీర్చడానికి అవసరమయ్యే అన్ని ఫీచర్లతో ఈ హైబ్రిడ్ వేరియంట్ కారును మార్కెట్లోకి తీసుకొచ్చారు. దేశంలో ఇప్పటికే పండుగల సీజన్ ప్రారంభం కావడంతో ఇతర కంపెనీలు కొత్త ఉత్పత్తులు లాంచ్ చేస్తుండగా, ఇప్పుడు అదే దారిలో టయోటా కంపెనీ సైతం హైరైడర్ ఫెస్టివల్ లిమిటెడ్ ఎడిషన్‌ను లాంచ్ చేసి తన అమ్మకాలను పెంచుకోవాలని చూస్తుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








