తళుకున్న మెరిసే టయోటా ఇన్నోవా క్రిస్టా.. బాడీ కిట్‌తో బంగారంలా కనిపిస్తుంది!
భారతీయ టయోటా కిర్లోస్కర్ మోటార్స్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న ఫార్చ్యూనర్, ఇన్నోవా, అర్బన్ క్రూయిజర్ టైజర్ వంటి వాటికి మంచి డిమాండ్ ఉంది. మార్కెట్‌లో లభించే ఇతర ఎంపీవీలతో పోల్చితే టయోటా ఇన్నోవా ప్రజాదరణను కలిగి ఉన్నాయి. ఈ ఎంపీవీ ఆకర్షణీయమైన ఫీచర్లతో బడ్జెట్ ధరకు విక్రయించడం ద్వారా పాపులారిటీని పొందింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఇన్నోవా మోస్ట్ వాంటెడ్ ఎంపీవీగా ఉంది. దీనికి ప్రత్యామ్నాయ కారు లేదని చెప్పాలి. ఈ టయోటా ఇన్నోవా కార్లు మంచి ఫర్ఫామెన్స్ కూడా అందిస్తాయి. దీనికి సంబంధించిన ఓ కీలక అప్‌డేట్ మీకోసం..
టయోటా ఇన్నోవా క్రిస్టా ఇప్పుడు సరికొత్త బాడీ కిట్ 'తషాన్'తో వస్తుంది. ఈ బాడీ కిట్ ఆడిషన్ ద్వారా సేల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రగ్డ్ బాడీ కిట్ ఇన్నోవా క్రిస్టా పూర్తి రూపాన్ని మార్చేస్తుంది. ఇప్పుడున్న రెగ్యూలర్ ఇన్నోవాలతో పోల్చితే ఇది సరికొత్తగా కనిపిస్తుంది. క్రిస్టా ఫ్రంట్ గ్రిల్, షార్ప్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, స్పోర్టీ డైమాండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి.

ఈ మొత్తం కిట్‌లో వచ్చే బాడీ స్టైలింగ్ ఈ ఎంపీవీ విజిబిలిటీని మరింత పెంచుతుంది. ఈ తషాన్ ఎడిషన్ బాడీకిట్ ఎంపీవీపై లైన్స్, ఇతర పగుళ్ల నుంచి మంచి సేఫ్టీని అందిస్తుంది. దీనితో పాటు వెనుక భాగంలో బ్రాండ్ రగ్డ్ కిట్‌లో స్పోర్టీ రియర్ స్పాయిలర్, సిల్వర్ ఫినిషింగ్‌పై బంపర్ లోగోను కలిగి ఉంది. మఫ్లర్ కట్టర్, రూఫ్ స్పాయిలర్ గార్నిష్‌తో వస్తుంది.
ఈ కొత్త యాక్ససరీస్‌తో ఇంటీరియర్ కూడా అందంగా కనిపిస్తుంది. దీనిలోని డ్యాష్ బోర్డ్‌లో వుడ్ ప్యానెల్, 3డి ఫ్లోర్ మ్యాట్స్, స్కఫ్ ప్లేట్ హైలైట్‌గా ఉన్నాయి. వీటితో పాటు రెగ్యూలర్‌గా ఇన్నోవా క్రిస్టాకి వచ్చే పలు రకాల యాక్ససరీలు సైతం వస్తాయి. వెనుక భాగంలో కెమెరా, వెల్‌కమ్ డోర్ ల్యాంప్, లెగ్‌రూమ్ ల్యాంప్, డిజిటల్ వీడియో రికార్డర్, వైర్‌లెస్ ఛార్జర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కలవు.

ఇవే కాకుండా ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్, ఫాగ్ ల్యాంప్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక ఈ కార్లు లక్షల కిలోమీటర్లు నడిచినా కానీ ఇంజిన్ మంచి కండిషన్‌లో ఉంటుంది. ఇదే దీనికి ప్లస్ పాయింట్ అని చెప్తూ ఉంటారు. ఈ టయోటా ఇన్నోవా ఓ మంచి ఫ్యామిలీ కారుగా కూడా ఉంది. సేల్స్ స్థిరంగా కొనసాగడానికి ఇదే కారణం.
ఈ ఎంపీవీ భారత్‌లో అమ్ముడవుతున్న జపనీస్ ఆటోమొబైల్ సంస్థకు చెందిన కార్లలో ఐదవ స్థానంలో ఉంది. టయోటా మొత్తం అమ్మకాల్లో క్రిస్టా వాటా 12.5 శాతంగా ఉంది. ప్రస్తుతం ఈ టయోటా ఇన్నోవా క్రిస్టా కేవలం డీజిల్ వెర్షన్‌లో మాత్రమే అమ్ముడవుతోంది. టయోటా ఇన్నోవా క్రిస్టా ల్యాడర్ ఫ్రేమ్ ఛాసిస్, శక్తివంతమైన, డీజిల్ ఇంజిన్, అద్భుతమైన రైడింగ్ కంఫర్ట్, నమ్మదగిన పనితీరుతో వస్తుంది.

ఇంటీరియర్ ఫీచర్ల పరంగా ఇన్నోవా క్రిస్టాలో ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, స్టార్ట్ / స్టాప్ బటన్, TFT MIDతో కాంబినేషన్ మీటర్, యాంబియంట్ లైటింగ్, లెదర్ స్టీరింగ్ వీల్, షిఫ్ట్ లివర్, డోర్ ఇంటీరియర్ గార్నిష్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్ అడ్జస్టబుల్ ఉన్నాయి. ఇందులో లెగ్‌రూమ్, హెడ్ రూమ్ కోసం మంచి స్పేస్ లభిస్తుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








