50000 మంది ఎగబడి మరీ కొనేశారు - అమ్మకాల్లో తగ్గేదేలే అంటున్న హైక్రాస్!

ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా (Toyota) దేశీయ మార్కెట్లో ఎంత ప్రజాదరణ పొందిందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో భాగంగానే కంపెనీ తన 'ఇన్నోవా హైక్రాస్' (Innova Hycross) అమ్మకాల్లో ఇటీవల అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది.

టయోటా కంపెనీ 2022లో తన ఇన్నోవా హైక్రాస్ MPVని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటికి 50000 యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది. అంతే కాకుండా ఇప్పటికి కూడా హైక్రాస్ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. బుకింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. వెయిటింగ్ పీరియడ్ 12 నుంచి 13 నెలలు వరకు ఉంది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క ఈ కారుకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అర్థమైపోతుంది.

Toyota Innova Hycross

2024 ఫిబ్రవరి 1 నాటికి కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ ప్రకారం హైక్రాస్ యొక్క పెట్రోల్ వేరియంట్ కోసం 5 నుంచి 6 నెలలు, హైబ్రిడ్ వేరియంట్ కోసం 12 నుంచి 13 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉన్నట్లు తెలిసింది. అంతే కాకుండా అధిక డిమాండ్ ఉన్న కారణంగా హైక్రాస్ యొక్క జెడ్ఎక్స్, జెడ్ఎక్స్ (O) వేరియంట్ల బుకింగ్స్ తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి.

భారతీయ విఫణిలో అందుబాటులో ఉన్న టయోటా హైక్రాస్ ధరలు రూ. 19.77 లక్షల నుంచి రూ. 30.68 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. మల్టిపుల్ వేరియంట్లలో లభించే ఈ కారు సూపర్ వైట్, ప్లాటినం వైట్ పెర్ల్ మరియు సిల్వర్ మెటాలిక్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్స్ పొందుతుంది. ఇవన్నీ మంచి డిజైన్ మరియు ఆధునిక ఫీచర్స్ పొందుతాయి.

Toyota Innova Hycross Rear Profile

ఏడు మరియు ఎనిమిది సీట్ల ఎంపికలో లభించే ఈ హైక్రాస్ MPV రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. అందులో ఒకటి 2.0 లీటర్ హైబ్రిడ్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్) ఇంజిన్ కాగా, మరొకటి 2.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్. ఇవి రెండూ కూడా CVT మరియు E-CVT గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి. వేరియంట్లను బట్టి మైలేజ్ 16.13 కిమీ నుంచి 23.24 కిమీ/లీ అందిస్తుంది.

డిజైన్ పరంగా అద్భుతంగా ఉన్న హైక్రాస్ MPV 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే మరియు 7 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే పొందుతుంది. అంతే కాకుండా ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, సన్‌రూఫ్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్ మరియు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సెకండ్ రో సీట్లు మొదలైనవి ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

Toyota Innova Hycross Interior Design

టయోటా ఇన్నోవా హైక్రాస్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే ఇందులో 6 ఎయిర్ బ్యాగులు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, ఆటో హై బీమ్, బ్లైండ్ స్పాట్ మానిటర్, సీట్ బెల్ట్ వార్ణింగ్, చైల్డ్ లాక్, ఓవర్ స్పీడ్ వార్ణింగ్ మరియు యాంటీ తెఫ్ట్ ఇంజిన్ ఇమ్మొబిలైజర్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి.

ఇన్నోవా హైక్రాస్ 50000 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసిన సందర్భగా టయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ 'శబరి మనోహర్' మాట్లాడుతూ.. హైక్రాస్ వాహన వినియోగదారులకు మంచి సౌకర్యం మరియు భద్రతను అందించడం మాత్రమే కాకుండా మంచి డ్రైవింగ్ అనుభూతినిని అందిస్తోంది. అంతే కాకుండా కంపెనీ వారంటీ కవరేజ్ మరియు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటి ప్రయోజనాలను అందించడం వల్ల ఉత్తమ అమమకాలు పొందినట్లు వెల్లడించారు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, February 23, 2024, 15:00 [IST]
English summary
Toyota innova hycross 50000 sales record since launch
Read more on: #టయోటా #toyota
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+