ఇండియాలో అందరి ఫెవరేట్ మోడల్.. బాగా డిమాండ్ ఉన్న కారు ఇదే.. అమరన్ సినిమా రేంజ్‌లో సూపర్‌హిట్
ఇండియాలో కార్ల వాడకం గతంతో పోలిస్తే భారీగా పెరిగింది. ప్రధానంగా ఎక్కువ మైలేజ్ అందించే మోడళ్ల అమ్మకాలు అధికంగా ఉంటున్నాయి. ఇటీవల ముగిసిన పండగ సీజన్‌లో కూడా ఇలాంటి కార్లు విక్రయాల పరంగా మంచి గణంకాలను నమోదు చేశాయి. దాదాపు అన్ని ఆటోమొబైల్ తయారీదారులు ఎక్కువ మైలేజ్ కార్లను వినియోగదారులకు అందించడానికి ప్రధానంగా దృష్టి సారించారు. ఇలాంటి కారు మార్కెట్లోకి వచ్చిందంటే చాలు అతి తక్కువ కాలంలోనే అందరికి చేరువయ్యి ఎక్కువ మార్కెట్‌ను సంపాదిస్తాయి. అలాంటి ఎక్కువ మైలేజ్ ఇచ్చే టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా హైక్రాస్(innova hycross) మోడల్ విక్రయాల పరంగా సరికొత్త మైలురాయి చేరుకుంది. ఇది ఒక ఎంపీవీ మోడల్. ఎక్కువ మంది కలిసి ఒకేసారి ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లడానికి ఈ ఎంపీవీ మంచి ఆప్షన్‌గా ఉంది.
తాజాగా విడుదలైన డేటా ప్రకారం, ఇండియాలో ఇన్నోవా హైక్రాస్ కారు ఇప్పటి వరకు దాదాపు లక్ష యూనిట్ల విక్రయాలను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఎంపీవీ మొదటగా ఇండియన్ మార్కెట్లో నవంబర్ 2022లో విడుదల అయింది. మైలేజ్ పరంగా బెస్ట్ మోడల్‌గా ఉండటమే కాకుండా, ఎక్కువ మంది కలిసి ఒకేసారి లాంగ్ రైడ్‌లు వంటివి చేయడానికి అనువుగా ఉండటంతో సేల్స్‌లో కొత్త గణంకాలను నమోదు చేసింది.

ఈ కారును ముఖ్యంగా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీల వంటి వారు తమ గ్యారేజీలో ఉంచుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అమ్మకానికి వచ్చిన రెండేళ్లలోనే ఇన్ని విక్రయాలు సాధించడం అంటే మామూలు విషయం కాదు. హైక్రాస్ 2.0 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఇది ఒక ఎంట్రీ లెవల్ మోడల్. లీటర్ పెట్రోల్‌కు మైలేజ్ 16 కి.మీ గా ఉంటుంది.
అదే సమయంలో ఈ కారు సెల్ఫ్-చార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సిస్టమ్ సదుపాయంతో వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా లీటర్‌కు 23.24 కి.మీ మైలేజ్ అందిస్తుంది. ఎక్కువ మైలేజ్ కావాలనుకునే వారు ఈ ఫీచర్ మోడల్‌ను ఎంచుకుంటారు. ఇన్నోవా హైక్రాస్ ఎక్స్‌టీరియర్ డిజైన్ చాలా స్టైలీష్‌గా ఉంటుంది. దీంతో సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగిన వారు ఈ మోడల్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు.

ఈ పెద్ద కారులో చాలా అధునాతన ఫీచర్లు ఉన్నాయి. సీట్లు కూడా చాలా కంఫర్ట్‌గా ఉంటాయి. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లడానికి అనువుగా ఉంటాయి. లోపల ఉన్న సదుపాయాలు అన్ని కూడా స్మార్ట్ టచ్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రయాణికుల భద్రత పరంగా కూడా మెరుగైన సేఫ్టీ ప్రమాణాలు ఉన్నాయి. 6 ఎయిర్‌బ్యాగులు, ADAS ఫీచర్లు ఉన్నాయి.
క్యాబిన్‌లో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ , డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 65 కంటే ఎక్కువ కనెక్టివిటీ ఫీచర్లు, వెనుక పవర్ డోర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. హైక్రాస్ ప్రధానంగా 2024 ప్రారంభంలో 50,000 అమ్మకాలను నమోదు చేసింది. ఆ తర్వాత వేగంగా లక్ష విక్రయాలను ఈ తొమ్మిది నెలల కాలంలో సాధించింది. ప్రస్తుతం దీని ధర రూ. 19.77 లక్షల నుండి 30.98 లక్షల వరకు ఉంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








