ఇన్నోవా హైక్రాస్ కొత్త వేరియంట్ వచ్చేసింది - ధర, వివరాలు ఇక్కడ చూడండి
దేశీయ విఫణిలో ఇప్పటికే అత్యుత్తమ అమ్మకాలు పొందుతున్న 'టయోటా' (Toyota) కంపెనీ యొక్క 'ఇన్నోవా హైక్రాస్' ఇప్పుడు మరో కొత్త వేరియంట్లో లాంచ్ అయింది. ఈ కొత్త వేరియంట్ ధర, ఫీచర్స్ మరియు ఇతర వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
మార్కెట్లో విడుదలైన కొత్త వేరియంట్ టయోటా ఇన్నోవా జీఎక్స్ (ఓ). ఇది ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్ మోడల్ యొక్క కొత్త టాప్ స్పెక్ మోడల్. దీని ధర రూ.20.99 లక్షల నుంచి రూ.21.13 లక్షల (ఎక్స్ షోరూమ్,ఢిల్లీ) మధ్య ఉంది. ఇది ఏడు మరియు ఎనిమిది సీట్ల కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది. అంతే కాకుండా ఈ మోడల్ మునుపటి టాప్ స్పెక్ హైక్రాస్ పెట్రోల్ జీఎక్స్ కంటే ఎక్కువ ఫీచర్స్ పొందుతుంది.

ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్ జీఎక్స్ కంటే కూడా ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్ జీఎక్స్ (ఓ) వేరియంట్ ఎక్కువ ఫీచర్స్ పొందుతుంది. కానీ చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఈ కొత్త వేరియంట్ డెలివరీలు కూడా ఇప్పటికే మొదలయ్యాయి. ఈ కొత్త వేరియంట్ ధర దాని మునుపటి మోడల్ (జీఎక్స్) కంటే కూడా రూ.1 లక్ష ఎక్కువ. కానీ ఈ డబ్బుకు తగిన విధంగా ఆధునిక హంగులను పొందుతుంది.
కొత్త టయోటా ఇన్నోవా హైక్రాస్ జీఎక్స్(ఓ) వేరియంట్ ఎల్ఈడీ ఫాగ్ లైట్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, 360డిగ్రీ కెమెరా మరియు డీ ఫాగర్ వంటి వాటిని పొందుతుంది. లోపలి భాగంలో డ్యాష్ బోర్డు మరియు డోర్‌ల మీద సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ మరియు కొత్త ఫాబ్రిక్ కవర్స్ ఉన్నాయి. అంతే కాకుండా 10.1-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, వైర్‌లెస్ ఆపిల్ కార్ప్లే, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటివి ఇందులో లభిస్తాయి.

ఇన్నోవా హైక్రాస్ జీఎక్స్ (ఓ) 8 సీటర్ మోడల్ మాత్రం 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, వైర్‌లెస్ ఆపిల్ కార్ప్లే మరియు రియర్ సన్ షేడ్ వంటి వాటిని కోల్పోతుంది. మిగిలిన దాదాపు అన్ని ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. ఈ కారణంగానే ఇది 7 సీటర్ కంటే కూడా రూ. 14000 తక్కువ ధర వద్ద లభిస్తుంది.
కొత్త టయోటా ఇన్నోవా హైక్రాస్ జీఎక్స్ (ఓ) వేరియంట్ మొత్తం ఏడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి బ్లాకిష్ అగేహా గ్లాస్ ఫ్లేక్, ప్లాటినం వైట్ పెర్ల్, యాటిట్యూడ్ బ్లాక్ మైకా, స్పార్క్లింగ్ బ్లాక్ పెర్ల్ క్రిస్టల్ షైన్, సిల్వర్ మెటాలిక్, సూపర్ వైట్ మరియు అవాంట్ గార్డ్ బ్రాంజ్ మెటాలిక్ కలర్స్. ఇవన్నీ చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటాయి.

ఇంజిన్ విషయానికి వస్తే.. ఈ కొత్త వేరియంట్ అదే 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 174 హార్స్ పవర్ మరియు 205 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ కేవలం సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ కొత్త వేరియంట్ 16.13 కిమీ/లీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. కాబట్టి ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








