ఆ కారు ధరను భారీగా పెంచారు.. దీనికున్న డిమాండ్ అలాంటిది మరీ, ఎంత పెంచారంటే?
2024 ఏడాది ముగిసేందుకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ తరుణంలో పలు ప్రముఖ కార్ల కంపెనీలు అమ్మకాల వృద్ధితో ఈ ఏడాదిని ఘనంగా ముగించాలని భావిస్తున్నాయి. ఈ ఏడాది కార్ల అమ్మకాలు స్థిరంగా కొనసాగాయి. కొన్ని కార్లు ఈ ఏడాది మరోసారి హిట్ జాబితాలో చేరిపోగా.. మరికొన్ని కార్లు మాత్రం ఆశించిన స్థాయిలో అమ్మకాలను రాబట్టలేక పోయాయి. ఇయర్ ఎండ్ అఫర్లతోనైనా సేల్స్ పెంచుకోవాలని చాలా కంపెనీలు ఇప్పటికే డిస్కౌంట్లను ప్రకటించాయి. అయితే టయోటా మాత్రం ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచి ఆశ్చర్యానికి గురిచేసింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి రానున్నాయి. ఎంత పెంచారు. ఇతర తదితర అంశాలు ఈ కథనంలో..
ఇన్నోవా హైక్రాస్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎంపీవీ మోడళ్లలో ఒకటిగా ఉంది. ఈ నేపథ్యంలోనే దీని ధరను పెంచారు. ముఖ్యంగా ఈ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఓ చేదువార్తగా చెప్పవచ్చు. దీని ధరను ప్రస్తుతం రూ. 17 వేల నుంచి రూ.36,000 వరకు పెంచారు. ధరల పెంపు వేరియంట్ల వారీగా పెంచారు. ఈ పెరిగిన ధరలు ప్రస్తుతం షోరూమ్‌ల్లో ఉన్న మోడళ్లకు సైతం వర్తిస్తాయి.

ప్రస్తుతం దీని వెయిటింగ్ పీరియడ్ 45 రోజుల నుంచి ఆరు నెలల వరకు ఉంది. కొన్ని నగరాల్లో ఇది ఎక్కువగానే ఉంది. దీనికి కస్టమర్ల నుంచి అధిక డిమాండ్ వస్తుండటం వల్ టయోటా ధైర్యంగా ధరను పెంచేసింది. అయితే ఈ ధరల పెంపు ఇన్నోవా హైక్రాస్ అమ్మకాలపై ఏ మాత్రం ప్రభావం చూపదని టయోటా తెలిపింది. ఈ పెంపు మాత్రమే కాదు ఇదివరకే పలు కంపెనీలు సైతం ధరలను పెంచేశాయి.
వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఈ పెంచిన ధరలు అమల్లోకి వస్తాయి. వివిధ కంపెనీల డేటా ప్రకారం 2025 జనవరి నుంచి కొత్త వాహనాల ధరలు 2 శాతం నుంచి 3 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ఇక టయోటా ఇన్నోవా హైక్రాస్ ఇటీవల భారత్‌లో 1 లక్ష యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకుంది. ప్రస్తుతం ఇది ఆరు వేరియంట్లలో లభిస్తుంది.

GX, GX (0), VX, VX O, ZX, ZX 0 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వీటిలో GX, GX O ప్రారంభ ధరను రూ.17,000కు పెంచారు. అలాగే VX, VX O మిడ్ లెవల్ వేరియంట్ల ధరను 35 వేలకు పెంచారు. ఇక ZX, ZX O ధరలను రూ.36,000 పెంచారు. ఈ ధరలు సిటీని బట్టి మారుతుంటాయి.
ఇక ఇన్నోవా హైక్రాస్ వెర్షన్స్ సాధారణ పెట్రోల్, పెట్రోల్-హైబ్రిడ్ టెక్నాలజీ ఇంజిన్‌తో లభిస్తుంది. ఈ హైబ్రిడ్ వెర్షన్ అత్యంత ఇంధన సామర్థ్యం కలిగి ఉంది. ఈ హైబ్రిడ్ వెర్షన్ లీటర్‌కి 23.24 కిలోమీటర్ల మైలేజీని, రెగ్యూలర్ పెట్రోల్ ఇంజిన్ లీటరుకు 16.13 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ కారు ధరలు రూ. 19.94 లక్షల నుంచి రూ. 31.34 లక్షల మధ్య ఉన్నాయి.


Click it and Unblock the Notifications








