టయోటా కార్ల ఉత్పత్తి ఇక వేగవంతం.. అదృష్టమంటే ఆ రాష్ట్రానిదే!
భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన కార్ బ్రాండ్లలో టయోటా (Toyota) ఉంది. జపాన్‌కి చెందిన ఈ కంపెనీకి ఇటీవల మారుతితో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా చిన్న కార్లను ఉత్పత్తి చేస్తుంది. కస్టమర్లకు అత్యంత విశ్వసనీయమైన ఉత్పత్తులను అందించేందుకు టయోటా ప్రయత్నిస్తుంది. కంపెనీకి ఉన్న బ్రాండ్ వ్యాల్యూ ప్రకారం ఈ కంపెనీ అమ్మకాలు స్థిరంగా పెరుతున్నాయి. డిమాండ్‌కి అనుగుణంగా ఉత్పత్తి జరగకపోవడంతో టయోటా కార్ల వెయిటింగ్ పీరియడ్ కూడా విపరీతంగా పెరుగుతోంది. దీనిని అధిగమించేందుకు టయోటా కొత్త ప్లాంట్‌ని ఏర్పాటు చేయనుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..
టయోటాకు ప్రస్తుతం కర్ణాటకలోని బెంగళూరు సమీపంలోని బిడది (Bidadi)లో రెండు తయారీ యూనిట్స్ ఉన్నాయి. ఈ రెండు ఫ్యాక్టరీలలో ఏడాదికి 3.42 లక్షల కార్లను ఉత్పత్తి అవుతున్నాయి. కార్లకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో బిడదిలోనే మూడో ప్లాంట్‌ని ఏర్పాటు చేయనున్నట్లు టయోటా గత ఏడాది ప్రకటించింది. ఇందుకోసం కర్ణాటకలో రూ.3,300 కోట్ల పెట్టుబడులు పెడుతోంది.

బిడదిలో టయోటా మూడో ప్లాంట్ 2026 నాటికి 1 లక్ష యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫ్లాంట్ అందుబాటులోకి వస్తే టయోటా మొత్తం ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 4.42 లక్షల కార్లకు పెరుగనుంది. తాజాగా టయోటా మహారాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ (ఔరంగాబాద్)లో కొత్త గ్రీన్ ఫీల్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ని ఏర్పాటు చేయనుంది.
టయోటా కొత్త ఫ్లాంట్‌ని ఏర్పాటు చేయడానికి మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకోవడం ఆటోమొబైల్ ప్రపంచంలో చాలా అతిపెద్ద తీర్పుగా ఉండనుంది. మహారాష్ట్రలో ఏర్పాటు చేయబోయే ప్లాంట్‌లో ప్రధానంగా గ్రీన్ టెక్నాలజీపై దృష్టి పెట్టనుంది. ఛత్రపతి శంభాజీ నగర్‌లో కొత్త ప్లాంటు ఏర్పాటు చేస్తే 24,000 మందికి ఉపాధి లభిస్తుంది. సుమారు 8 వేల మందికి ప్రత్యక్షంగా, మిగిలిన వారికి అనుబంధ విభాగాల్లో ఉపాధి కల్పించనున్నారు.

టయోటా ఈ కొత్త ఫ్లాంట్‌లో పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయగలదు. హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లు ప్రధానంగా ఇక్కడే ఉత్పత్తి కానున్నాయి. ఇందుకోసం టయోటా ఈ ఫ్లాంట్‌లో భారీ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాలని యోచిస్తోంది. జపాన్ ఆటో దిగ్గజం మహారాష్ట్రలో ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతుందో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
మహారాష్ట్రలో రూ.20,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్ల పాటు దశలవారీగా ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు సమాచారం. ఈ పథకం కింద ఏటా రూ.20 వేల కోట్ల పెట్టుబడితో 4 లక్షల ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లు తయారవుతాయని, 8 వేల మందికి ప్రత్యక్షంగా, 8 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు.
ఇక భారతీయ మార్కెట్‌లో టయోటా కార్లకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. అందువల్ల ఉత్పత్తిని పెంచడానికి టయోటా కొత్త ఫ్లాంట్‌లను ఏర్పాటు చేస్తుంది. గతంలో కర్ణాటక కేంద్రంగా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు కొత్త ప్లాంట్ ఏర్పాటుకు మహారాష్ట్రను ఎంచుకుంది. భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో అతిపెద్ద ఫ్లాంట్ కీలకంగా మారనుంది. దీంతో టయోటా ఉత్పత్తులు అధిక సంఖ్యలో అందుబాటులోకి రానున్నాయి.


Click it and Unblock the Notifications








