జనం మెచ్చిన ఆ ఫేమస్ కారు మీ ఇంటికి రావాలంటే ఏడు నెలలు ఓపిక పట్టాల్సిందే.. అందులో ప్రయాణం ఓ భూతల స్వర్గం!
దిగ్గజ ఆటోమొబైల్ తయారీ కంపెనీ టయోటా కార్లకు ప్రస్తుతం ఇండియాలో డిమాండ్ ఎక్కువగా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ సైతం వినియోగదారుల ఇష్టానికి అనుగుణంగా అధునాతన ఫీచర్లతో, పలు కార్లను లాంచ్ చేస్తుంది. ప్రీమియం విభాగంలో కూడా తన వ్యాపారాన్ని విస్తరించడానికి తాజాగా వెల్‌ఫైర్(vellfire) కారును మార్కెట్లోకి తీసుకురాగా, దీనికి విపరీతమైన డిమాండ్ నెలకొంది. కస్టమర్ల నుంచి ఎక్కువగా బుకింగ్స్ రావడంతో టయోటా తన వెల్‌ఫైర్ కారును డెలివరీ చేయడాన్ని ఆలస్యం చేయనుంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, ఈ కారు దాదాపు 7 నెలల వెయిటింగ్ పిరియడ్‌ను కలిగి ఉంది. టయోటా కంపెనీ ప్రీమియం విభాగంలో కస్టమర్ల నుంచి బాగా డిమాండ్ ఉన్న కారుగా ఇది నిలిచింది.
ఇండియాలో టయోటా వెల్‌ఫైర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.22 కోట్ల నుంచి రూ.1.32 కోట్ల మధ్య ఉంది. ఇది హైబ్రిడ్ కారు. పెట్రోల్-ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. సెప్టెంబర్ నెలలో వెల్‌ఫైర్ మోడల్ దాదాపు 87 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. గత నెలలో కూడా అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయి. ఈ కారులో ఉన్న ఫీచర్లు కస్టమర్లకు నచ్చడంతో బుకింగ్‌లను ఎక్కువగా సాధించింది.

టయోటా వెల్‌ఫైర్ 2.5-లీటర్ హైబ్రిడ్ (పెట్రోల్ & ఎలక్ట్రిక్) ఇంజిన్ ఆప్షన్‌తో రన్ అవుతుంది. ఇది 142 kW పవర్‌ను, గరిష్టంగా 240 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక, మైలేజ్ విషయానికి వస్తే, ఈ కారు 19.28 kmpl వరకు ఇస్తుందని కంపెనీ పేర్కొంది. దీనిలో అందించిన ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా కారు నుంచి విడుదల అయ్యే కార్బన్ ఉద్గారాలు చాలా వరకు తగ్గిపోనున్నాయి.
హైబ్రిడ్ ఎలక్ట్రిక్ 2.5-లీటర్ ఇన్‌లైన్ 4-సిలిండర్ DOHC (డబుల్ ఓవర్‌హెడ్ క్యామ్‌షాఫ్ట్) ఇంజిన్ ఆప్షన్‌తో రన్ అవుతుంది. బయటి నుంచి చూడటానికి కారు డిజైన్ పెద్దగా, ఒక ఇంద్ర భవనంలా కనిపిస్తుంది. దీని లోపల చాలా అధునాతన ఫీచర్లు ఉన్నాయి. సీటింగ్ వెడల్పుగా ఉంటుంది. ఎక్కువ దూరం ప్రయాణం చేసిన కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మెత్తని సీట్లు కంఫర్ట్‌గా ఉన్నాయి.

డ్రైవింగ్ సమయంలో డ్రైవర్‌కు సహాయపడటానికి కూడా కొన్ని ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. వెహికల్ డయాగ్నస్టిక్, డ్రైవర్ మానిటరింగ్ అలర్ట్‌లు వంటి 60కి పైగా కనెక్ట్ ఫీచర్లు, రిమోట్ డోర్ లాక్/అన్‌లాక్, ఎమర్జెన్సీ సమయంలో ఉపయోగపడే కొన్ని ఆప్షన్లను కూడా దీనిలో అందించారు. భద్రతకు సంబంధించిన ఆప్షన్లు కూడా ఈ కారులో ఉన్నాయి. ఇది లగ్జరీ కారు కావడంతో కంపెనీ ప్రయాణికుల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.
ప్రయాణికులతో పాటు, రోడ్డుపై వెళ్తున్న వారిని ప్రమాద సమయంలో కాపాడటానికి ప్రీ-కొలిజన్ సేఫ్టీ, లేన్ ట్రేస్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటర్, అడాప్టివ్ హై బీమ్ LED హెడ్‌ల్యాంప్‌లు వంటి ప్రోయాక్టివ్ డ్రైవింగ్ అసిస్ట్ ఫీచర్లు ఉన్నాయి. లోపల క్యాబిన్‌లో డ్రైవర్ సీటుతో పాటు రెండవ వరుస సీట్ల మధ్య గ్యాప్ ఎక్కువ ఉంది. సీట్ల మధ్యలో సామాన్లు పెట్టడానికి వీలుగా ఉంటుంది.
రెండో వరుస సీట్లు మసాజ్ ఫంక్షన్ సెటప్ మాదిరిగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్, పవర్ కంట్రోల్స్ వంటివి ఉన్నాయి. ఇది టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రయాణంలో మంచి పాటల అనుభూతి కోసం ఇంటీరియర్‌లో 15-స్పీకర్ ఆడియో సిస్టమ్‌తో పాటు ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, ఎగ్జిక్యూటివ్ లాంజ్ 14-అంగుళాల వెనుక సీటు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఇంకా డజన్ల కొద్దీ ఫీచర్లను కారులో అందించారు.


Click it and Unblock the Notifications








