కొత్త ఏడాదిలో టయోటా గుడ్ న్యూస్.. స్టన్నింగ్ లుక్, ఆకర్షించే ఫీచర్లతో మూడు కొత్త ఎస్‌యూవీలు!
ప్రపంచవ్యాప్తంగా మూడో అతిపెద్ద ఆటో మార్కెట్‌గా అవతరించే దిశగా భారత్ దూసుకెళ్తోంది. ఈ క్రమంలో విదేశీ వాహన కంపెనీలు.. భారత మార్కెట్‌పై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. జపాన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ టయోటా కొత్త ఏడాదిలో తన ప్రముఖ మోడల్ కార్లను మరిన్ని అప్‌డేట్లతో తీసుకొచ్చి మార్కెట్‌ను పెంచుకునే యోచనలో ఉంది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) మారుతి సుజుకితో పాటు దాని స్వంత శ్రేణి ప్యాసింజర్ వాహనాల నుంచి మోడల్‌లతో భాగస్వామ్యం ద్వారా కొత్త ఏడాదిలో భారత్‌లో రికార్డు స్థాయి విక్రయాలను సాధించే యోచనలో ఉంది. దీని కోసం, దేశీయ మోడల్ లైన్‌ను బలోపేతం చేయడానికి టయోటా నుంచి మూడు SUV లు రానున్నాయి. వీటిలో ఒక ఎలక్ట్రిక్ కాగా, రెండు హైబ్రిడ్ మోడల్స్ ఉన్నాయి.

1. టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ 7-సీటర్: 2025 ప్రథమార్ధం నాటికి టయోటా మూడు వరుస సీట్లతో అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను పరిచయం చేసే అవకాశం ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇది MG హెక్టర్ ప్లస్, టాటా సఫారి, మహీంద్రా XUV700, సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్, హ్యుందాయ్ అల్కాజార్ వంటి వాటికి గట్టి పోటీనివ్వనుంది.
ఈ SUV ఆకర్షణీయమైన స్టైలింగ్, మెరుగైన ఫీచర్లతో ఇతర ఎస్‌యూవీలకు గట్టి పోటీగా ఉందని సమాచారం. టయోటా 1.5-లీటర్ మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ యూనిట్, 1.5-లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌తో ప్రస్తుత 5-సీటర్ మోడల్ లైనప్ మాదిరిగా అదే ఇంజిన్ లైనప్‌ను కలిగి ఉండవచ్చని తెలుస్తోంది.

2. టయోటా అర్బన్ క్రూయిజర్ EV: 2025 జనవరిలో జరగనున్న '2025 బ్రస్సెల్స్ మోటార్ షో'లో అర్బన్ క్రూయిజర్ EVని రివీల్ చేయడానికి టయోటా సిద్ధంగా ఉంది. UK ధర, ఇతర వివరాలు 2025 చివరి నాటికి ప్రకటించనుంది. అదే సంవత్సరంలో భారత మార్కెట్‌లోనూ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.
అర్బన్ క్రూయిజర్ EV రెండు లిథియం-అయాన్-ఫాస్ఫేట్ బ్యాటరీ ఎంపికలను కలిగి ఉంటుంది. అవి 49 kWh, 61 kWh. 49 kWh మోడల్ ఫ్రంట్-వీల్ మోటార్ సెటప్‌ను కలిగి ఉంటుండగా.. ఇది 144 bhp శక్తితో పాటు 189 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ముఖ్యంగా, 61 kWh బ్యాటరీకి అప్‌గ్రేడ్ చేయడం వలన అదే టార్క్ రేటింగ్‌లో పవర్ అవుట్‌పుట్ 174 bhpకి పెరుగుతుంది. ఇంకా, 61 kWh బ్యాటరీతో నడిచే ఆల్-వీల్-డ్రైవ్ వేరియంట్ వెనుక మోటారును కలిగి ఉంటుండగా.. ఇది పవర్ అవుట్‌పుట్ వద్ద 300 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.
4,285 మి.మీ పొడవు, 2,700 మి.మీ వీల్‌బేస్‌తో, టయోటా అర్బన్ క్రూయిజర్ EV మొత్తం పరిమాణంలో E-విటారాకు గట్టి పోటీగా ఉంటుంది. ఇంకా టయోటా EV మోడల్ డిజైన్.. గతేడాది ప్రపంచవ్యాప్తంగా రివీల్ అయిన అర్బన్ SUV కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించినట్లుగా తెలుస్తోంది.
3. టయోటా ఫార్చ్యూనర్ MHEV: ఈ మోడల్ ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. టయోటా ఫార్చ్యూనర్ MHEV మెరుగైన ఇంధన సామర్థ్యం, తక్కువ కర్బన ఉద్గారాలు, లిమిట్ స్పీడ్ మెరుగైన పనితీరు కోసం 48-వోల్ట్ మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో రానుంది.
ఈ సిస్టమ్ 2.8-లీటర్ నాలుగు-సిలిండర్ GD-సిరీస్ డీజిల్ ఇంజన్‌కు అనుసంధానించబడి ఉంటుంది. అదనంగా, టయోటా తదుపరి తరం ఫార్చ్యూనర్‌పై పని చేస్తోందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇది దాని పవర్‌ట్రెయిన్ ఆఫర్‌లను మరింత వినూత్నంగా తీసుకురావడానికి కొత్త టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉండవచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








