25 కి.మీ మైలేజ్ ఇచ్చే ఈ కారు కోసం అందరూ వెయిటింగ్.. ఇది చాలా చాలా స్పెషల్ గురూ!

జపాన్‌కు చెందినటువంటి టయోటా(Toyota) కంపెనీకి ఇండియాలో కూడా మంచి మార్కెట్ ఉంది. చాలా కాలంగా అధునాత మోడళ్లను భారతీయ వినియోగదారుల కోసం విడుదల చేస్తూ తన మార్కెట్‌ను క్రమంగా పెంచుకుంటుంది. ఈ క్రమంలో దేశీయ దిగ్గజ కంపెనీలకు కూడా గట్టి పోటీని ఇస్తుంది. మారుతీ సుజుకీ(Maruti Suzuki), మహీంద్రా(Mahindra) వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంది. ఈ నేపథ్యంలో వాటి కంటే కూడా మరింత మార్కెట్ వాటాను సంపాదించడానికి కొత్త మోడల్‌ను త్వరలో మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. దాని పేరే టయోటా క్యామ్రీ(toyota camry). ఈ ఫేస్‌లిఫ్టెడ్ కారు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు రాబోతున్న మోడల్ క్యామ్రీలో తొమ్మిదో తరం. దీనిని కంపెనీ మార్కెట్లోకి డిసెంబర్ 11, 2024న విడుదల చేయబోతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పాత మోడల్‌తో పోలిస్తే ఇది అధునాతనంగా ఉంటుంది.

ఇది ఒక హైబ్రిడ్ కారు. ఇటీవల రోజుల్లో ఈ మోడళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కంపెనీ ఇప్పటికే హై రైడర్, హై క్రాస్ వంటి హైబ్రిడ్ కార్ల ద్వారా వినియోగదారులను ఆకట్టుకుంటుండగా, ఇప్పుడు తదుపరి రాబోయే సెడాన్ ద్వారా అమ్మకాలను మరింత పెంచుకుని హైబ్రిడ్ విభాగంలో మొదటి ప్లేస్‌లో ఉండటానికి ప్రయత్నాలు చేస్తుంది. క్యామ్రీ కొత్త కారు డిజైన్ ఆకర్షణీయంగా ఉంది.

Toyota New Camry Launch

పాత మోడళ్ల కంటే కూడా ఈ హైబ్రిడ్ కారు డిజైన్ చాలా విభిన్నంగా ఉంది. ఎక్స్‌టీరియర్‌ను మరింత అప్‌డేట్ చేసి ముందు భాగంలో పెద్ద ట్రాపెజోయిడల్ గ్రిల్‌ను అందించారు. చీకట్లో మెరుగైన వెలుతురు కోసం హెడ్‌ల్యాంప్‌లు, యూ ఆకారంలో గల ఇంటిగ్రేటెడ్ LED DRLలు, LED టెయిల్‌లైట్‌లు, వినియోగదారులను ఆకర్షించేలా వేరు వేరు కలర్స్‌లలో ఈ కారు లభిస్తుంది.

పెద్ద డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ కారును బయటి నుంచి మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి. క్యాబిన్ కూడా అందంగా ఉంటుంది. 7.0-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, . 8.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, వెనుక సీట్లు కూడా కూర్చోడానికి చాలా కంఫర్ట్‌గా ఉంటాయి. లోపల యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 427 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 9-స్పీకర్ JBL ఆడియో సిస్టం వంటివి ఉన్నాయి.

Toyota New Camry Launch Date

ప్రయాణికుల భద్రత కోసం ఈ కారులో ఎయిర్‌బ్యాగ్స్, 3.0 ADAS సూట్ ఇంకా మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. ఇది 2.5-లీటర్ 4 -సిలిండర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఈ ఇంజిన్‌కు తోడుగా అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ సైతం పవర్‌ను అందిస్తుంది. పెట్రోల్ ఇంజిన్ 229 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 25 kmpl మైలేజీని అందిస్తుంది.

ఇండియాలో ఈ సెడాన్ ధర రూ.48 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ధర ఎక్కువగా అనిపించినప్పటికీ కూడా హైబ్రిడ్ వేరియంట్ కారు మైలేజ్ కూడా ఎక్కువగా ఉండటం కారణంగా అమ్మకాలు మెరుగ్గా ఉండవచ్చని కంపెనీ అంచనా వేస్తుంది. వచ్చె నెలల రాబోతున్న ఈ సెడాన్‌ కోసం చాాలా మంది ఎదరుచూస్తున్నారు.

Toyota New Camry Expected Features

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, November 27, 2024, 17:13 [IST]
English summary
Toyota new camry launch on december 11 and here the expected features
Read more on: #toyota #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+