టయోటా కొత్త కారు అదిరిపోతుంది.. దిమ్మతిరిగే ఫీచర్లు.. సరికొత్త స్టైలిష్ డిజైన్‌తో వేరే లెవల్‌లో ఉంది..
జపాన్‌కు చెందిన కార్ల తయారీ కంపెనీ టయోటా చాలా కాలంగా ఇండియా మార్కెట్‌పై కన్నేసి కొత్త కార్లను వరుసగా విడుదల చేస్తుంది. ఇప్పటికే దేశీయంగా ఉన్న కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చి ఎక్కువ మార్కెట్ వాటాను సంపాదించడానికి గతంలో అధునాత ఫీచర్లతో నిండిన కార్లను తీసుకురాగా, తాజాగా కొత్త ఏడాదికి ముందు వినియోగదారులను ఆకట్టుకోడానికి టయోటా ఇప్పుడు కొత్త క్యామ్రీని విడుదల చేసింది. ఇది 9వ తరం క్యామ్రీ సెడాన్. ఈ కారు ఏడాది క్రితం అంతర్జాతీయ మార్కెట్లో విడుదల అయి బాగా సక్సెస్ అయింది. ఇతర దేశాల్లో మంచి విక్రయాలను నమోదు చేయడంతో కార్ల వినియోగంలో ప్రపంచంలోనే అత్యంత డిమాండ్ కలిగిన భారత్‌లో కూడా లాంచ్ చేసి మరింత మంది కస్టమర్లను తన వైపు తిప్పుకోడానికి 9వ తరం క్యామ్రీ సెడాన్‌ను తీసుకొచ్చింది.
ఈ మోడల్‌ను కంపెనీ థాయ్‌లాండ్‌లో తయారుచేసి ఇండియాకు నాక్డ్ డౌన్ (CKD) యూనిట్‌గా దిగుమతి చేసింది. ఆ తరువాత కర్ణాటకలోని టయోటాకు చెందిన యూనిట్‌లో అసెంబుల్ చేసి దేశీయంగా విక్రయిస్తున్నారు. టయోటా క్యామ్రీ సెడాన్ ప్రారంభ ధర రూ.48 లక్షలుగా ఉంది. ఇది వేరియంట్‌ను బట్టి మరింత పెరిగే అవకాశం ఉంది. పాత మోడల్‌తో పోలిస్తే ఇది రూ.1.83 లక్షల కంటే ఎక్కువ.

ఈ సెడాన్ TNGA-K ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించబడింది. ఇది మెర్సిడెస్ c-క్లాస్ లిమౌసిన్, bmw 3 సిరీస్ గ్రాన్ లిమౌసిన్‌తో పోటీ పడుతుంది. దీని డిజైన్ సరికొత్తగా ఉంటుంది. ముందు హ్యామర్ హెడ్ డిజైన్ ఉంది. ఫ్రంట్ బంపర్ లెక్సస్ మాదిరిగా అన్విల్ రూపాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ కారుకు ప్రత్యేక రూపాన్ని తీసుకొచ్చాయి. చీకట్లో మెరుగైన వెలుతురు కోసం LED హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి.
అలాగే వెనుక భాగంలో C-ఆకారంతో LED టెయిల్ ల్యాంప్‌లు అందించారు. హెడ్‌ల్యాంప్‌లకు జత చేసిన గ్రిల్ కూడా అందంగా ఉంటుంది. ఇంటీరియర్‌లో చాలా కొత్త అప్‌డేట్‌లు ఉన్నాయి. క్యాబిన్‌లో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్‌తో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, అలాగే, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ ఉంది. ప్రధానంగా పాత మోడల్‌తో పోలిస్తే, కొత తరం క్యామ్రీలో డాష్‌బోర్డ్ డిజైన్ సరికొత్తగా ఉంటుంది.

ప్రయాణంలో బోర్ కొట్టకుండా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 9 స్పీకర్ Jbl సౌండ్ సిస్టంను అమర్చారు. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, డిజిటల్ కీ, డ్యూయల్ జోన్ ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, సన్‌షేడ్‌తో ఉన్నటువంటి సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఈ సెడాన్‌లో ఉన్నాయి. ముఖ్యంగా క్యామ్రీ ప్రీమియం కారులో ప్రయాణికుల భద్రత కోసం 9 ఎయిర్‌బ్యాగులు ఉన్నాయి. దీంతో ప్రమాద సమయంలో లోపల కూర్చున్న వారికి రక్షణ లభిస్తుంది.
కొత్త క్యామ్రీ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.5 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. పవర్ అవుట్‌పుట్‌లో 225 bhp శక్తిని విడుదల చేస్తుంది. ఇప్పటికే ఉన్న హైబ్రిడ్ కార్లలో అందించినటువంటి eCVT గేర్‌బాక్స్‌ని ఈ కారులో ఇచ్చారు. పాత మోడల్ కంటే 9వ తరం క్యామ్రీలో ఇంధన కెపాసిటీ 30 శాతం మెరుగుపడింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








