దేశంలోనే చాలా మందికి ఇష్టమైన 7 సీటర్ ఫ్యామిలీ కార్లపై రూ.2.25 లక్షల వరకు తగ్గింపు

ప్రస్తుతం భారతదేశంలో కుటుంబంతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు చేయడం ఎక్కువ అయింది. మొత్తం అందరూ కలిసి విహారయాత్ర చేస్తే అది ఎంతో సరదాగా ఉంటుంది. అయితే చిన్న కార్లలో నలుగురితో కూడిన చిన్న కుటుంబం మాత్రమే ఒకసారి ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. పెద్ద కుటుంబం కలిగిన వారికి ఇది అతిపెద్ద సమస్యగా ఉంటుంది. ఎక్కువ మంది కలిసి ఒకే కారులో ఆడుతూ, పాడుతూ టూర్లకు వెళ్తుంటే ఈ మజాయే వేరే లెవల్‌లో ఉంటుంది. ఇలాంటి ఎంజాయ్‌మెంట్ కోరుకునే వారు ఎక్కువగా పెద్ద కారును ఎంచుకుంటారు. ఇండియా మార్కెట్లో ఈ పెద్ద కార్లు చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి మొదలుకుని ఇటీవల ముగిసిన పండగల వరకు కూడా ఎక్కువ సీటింగ్ కలిగిన ఫ్యామిలీ కార్లు చాలా అమ్ముడుపోయాయి.

ముఖ్యంగా అక్టోబర్‌లో వచ్చిన పండుగల కారణంగా పెద్ద కార్లు మెరుగైన అమ్మకాలను నమోదు చేశాయి. ఇప్పుడు డిసెంబర్‌లో కూడా మరిన్ని అమ్మకాలు పెంచుకోడానికి తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఫ్యామిలీ కార్లను కొనుగోలు చేయాలనే ఆలోచన ఉన్నవారు, కొత్త ఏడాదికి ముందు తక్కువ ధరలో కారును కొనుగోలు చేసి తమ ఇంటికి తీసుకెళ్లవచ్చు. సాధారణంగా పెద్ద కుటుంబానికి 7 సీటర్ కారు బాగా సరిపోతుంది.

Toyota Offers Discount On Fortuner

ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించడానికి తమ సేల్స్‌ను మరింత పెంచుకోడానికి దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ టయోటా ఇయర్ ఎండ్‌లో డిసెంబర్ నెలలో తన కార్లపై తగ్గింపును అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్స్ అత్యంత డిమాండ్ ఉన్న ఇన్నోవా క్రిస్టా (innova crysta), అలాగే ఫార్చ్యూనర్ (fortuner) కార్లపై ఉన్నాయి. ఈ రెండు కూడా పెద్ద కుటుంబానికి అనువుగా ఉంటాయి. టూర్లకు ప్లాన్ చేసే వారికి బెస్ట్ ఆప్షన్.

టయోటా కంపెనీ ఫార్చ్యూనర్ కారుపై డిసెంబర్ నెలలో రూ. 2.25 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది. అలాగే తన వేరియంట్‌పై రూ. 75,000 క్యాష్ డిస్కౌంట్, ఇతర వేరియంట్‌పై రూ. 30,000 తగ్గింపును అందిస్తున్నట్లు పేర్కొంది. అదనంగా ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.లక్ష , లాయల్టీ బోనస్ రూ.50000 వరకు ఉన్నాయి. ఫార్చ్యూనర్ ఆఫ్-రోడ్ ప్రయాణాలను అత్యంత అనువైనది. ఇది ఏడు-సీట్లతో లభిస్తుంది. పెద్ద ఫ్యామిలీకి సరైన ఆప్షన్.

Toyota Offers Innova Crysta

ఫార్చ్యూనర్‌ 6-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ మోడల్‌ను మొదటగా 2009లో మార్కెట్లోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి లేటెస్ట్ ట్రెండ్‌కు అనుగుణంగా అప్‌డేట్ అవుతూ వస్తుంది. టయోటా ఫార్చ్యూనర్ ఇండియాలో అత్యంత డిమాండ్ మోడల్‌గా అవతరించింది. ఇటీవలే దక్షిణాఫ్రికాలో టయోటా ఫార్చ్యూనర్ హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా లాంచ్ చేసింది. పాత దాని కంటే ఇది మరింత అప్‌డేట్‌గా ఉంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా విషయానికి వస్తే, దీనిపై డిసెంబర్‌లో రూ.1.25 లక్షల వరకు ఆఫర్‌ను అందిస్తున్నట్లు పేర్కొంది. వీటిలో క్యాష్ తగ్గింపు, ఎక్స్చేంజ్ బోనస్, లాయల్టీ బోనస్ వంటివి ఉన్నాయి. ఇన్నోవా కారు మార్కెట్లో 2005లో లాంచ్ అయింది. దాదాపు 20 ఏళ్లు దాటినా కూడా ఈ మోడల్‌కు డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. టయోటా సైతం డిమాండ్ పడిపోకుండా చూడటానికి లేటెస్ట్ ఫీచర్లను అందిస్తూ, దీన్ని అప్‌డేట్ చేస్తూనే ఉంది.

Toyota Offers Discount On Innova Crysta

ఇన్నోవా క్రిస్టా ఏడు, ఎనిమిది సీట్ల వేరియంట్లలో లభిస్తుంది. ఇది . 2.4 డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లో ఉంది. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌‌ను జత చేశారు. మైలేజ్ కూడా ఈ కారుకు ఎక్కువగానే వస్తుంది. ఈ ఇంజిన్ 148 bhp పవర్‌ను, 343 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. తక్కువ ధరలో ఎక్కువ సీటింగ్ ఫ్యామిలీ కార్లు కావాలనుకునే వారు ఈ ఆఫర్స్‌ను సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం.

More from DriveSpark

Article Published On: Monday, December 16, 2024, 16:50 [IST]
English summary
Toyota offers upto rs 2 25 lakh discount on fortuner and innova crysta
Read more on: #toyota #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+