టయోటా రూమియాన్‌ నుంచి మరో వేరియంట్‌ లాంచ్‌.. ధర కేవలం రూ.13 లక్షలు మాత్రమే!!

భారత మార్కెట్లో ప్రముఖ కార్ల తయారీ సంస్థల్లో టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) ఒకటి. డిజైన్‌, లుక్, పనితీరు పరంగా టయోటా కార్లకు ప్రజాదరణ అధికంగా ఉంది. ఫార్చ్యూనర్‌, ఇన్నోవా క్రిస్టా, రూమియాన్‌ ఇంకా పలు కార్లు టయోటా సేల్స్‌లో ఎక్కువ భాగాన్ని కైవసం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో టయోటా రూమియాన్‌ ఎంపీవీ G ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్‌ను విడుదల చేసింది.

మారుతి సుజుకి ఎర్టిగా ఆధారంగా రూపొందించిన రూమియాన్‌(Toyota Rumion G AT Variant Launch) ఎంపీవీకి భారత మార్కెట్లో డిమాండ్‌ ఎక్కువగా ఉంది. కాగా తాజాగా సంస్థ విడుదల చేసిన టయోటా రూమియాన్‌ MPV G (Automatic Transmission) యొక్క కొత్త వేరియంట్‌ను సంస్థ రూ.13 లక్షల ధరతో విడుదల చేసింది. ఇది ఎక్స్-షోరూమ్ ధర.

Toyota-Rumion-G-Variant-AT-Launch

టయోటా రూమియాన్‌ మూడు వేరియంట్లు S, G, మరియు V లలో అందుబాటులో ఉంది. ఇప్పటివరకూ.. ఆరు-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కేవలం ఎంట్రీ-లెవల్ S మరియు టాప్-స్పెక్ V ట్రిమ్‌లలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు కొత్త G AT వేరియంట్‌లో కూడా, AT అందుబాటులోకి వచ్చింది.

టయోటా రూమియాన్‌ G AT వేరియంట్‌ డెలివరీలు మే 5 నుంచి ప్రారంభం అవుతాయి. ఆసక్తి ఉన్న కస్టమర్లు రూ.11,000 అడ్వాన్స్ చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఇక టయోటా రూమియాన్‌ G AT వేరియంట్‌ డిజైన్ పరంగా చూడగానే ఆకట్టుకుంటుంది. దీనికి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు మరియు LED టెయిల్ టెయిల్‌లైట్‌లను సంస్థ అందిస్తోంది.

Toyota-Rumion-G-Variant-AT-Launch

టయోటా రూమియాన్‌ కారులో ఏడుగురు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఫీచర్ల పరంగా ఇందులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇస్తుంది. టయోటా ఐ-కనెక్ట్ టెక్నాలజీ, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్ వంటి వివిధ ఫీచర్లను ఇందులో చూడవచ్చు.

సేఫ్టీ ఫీచర్ల పరంగా కొత్త Toyota Rumion G వేరియంట్‌ MPV ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. ఇందులో నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి అనేక భద్రతా లక్షణాలను కలిగి ఉంటుంది.

Toyota-Rumion-G-Variant-AT-Launch

ఇంజిన్‌ పరంగా టయోటా రూమియాన్‌ MPV G AT వేరియంట్.. 1.5-లీటర్, 4-సిలిండర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. గరిష్ఠంగా 102 bhp శక్తిని మరియు 137 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (గేర్ బాక్స్)తో జత చేయబడి ఉంటుంది. ఈ మోడల్ లీటర్‌కు 20.51 కి.మీ మైలేజీని అందిస్తుంది.

కాగా గత ఏడాది సెప్టెంబర్‌లో నిలిపివేయబడిన CNG-ఆధారిత రూమియాన్‌ MPV బుకింగ్‌లు భారీ డిమాండ్ కారణంగా తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే ఇది కేవలం 'S' వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇంకా దీని ధర రూ. 11.39 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. అదనంగా, ఇది ఇతర బైక్‌లకు పోటీగా కేజీకి 26.11 కి.మీ మైలేజ్‌ని ఇస్తుంది.

Toyota-Rumion-G-Variant-AT-Launch

మార్కెట్లో టయోటా రూమియాన్‌ ఎంపీవీకి కియా కేరెన్స్, మహీంద్రా మరాజో బలమైన పోటీగా ఉన్నాయి. మారుతి సుజుకి మరియు టయోటా భాగస్వామ్యంలో భాగంగా ఎర్టిగా ఆధారిత రూమియాన్‌ MPV ఆగస్ట్ 2023లో లాంచ్‌ అయింది. అప్పటి నుంచి నేటి వరకు ఈ కారుకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇక సేల్స్‌ పరంగా టయోటా రూమియాన్‌ ఎంపీవీ భారీ సంఖ్యలో అమ్ముడవుతున్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, April 30, 2024, 12:41 [IST]
English summary
Toyota rumion g variant in automatic transmission launched price specs details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+