ఇది వెరీ పాపులర్ 7 సీటర్ ఫ్యామిలీ కార్.. 26.11 కి.మీ మైలేజ్ ఇస్తుంది.. ధర కూడా బడ్జెట్ రేంజ్‌లోనే!
ప్రముఖ కార్ల తయారీ కంపెనీగా దేశంలో ప్రసిద్ధి చెందిన టయోటా(Toyota) భారత మార్కెట్లో పలు మోడళ్లను విక్రయిస్తూ ఇతర కంపెనీలకు ప్రత్యర్థిగా నిలుస్తుంది. ఇది జపాన్ బ్రాండ్ కలిగిన సంస్థ. చాలా కాలంగా ఇండియాలో కార్లను విక్రయిస్తుంది. దేశంలోని అన్ని నగరాల నుంచి మొదలుకుని పట్టణాలు, గ్రామాల్లో కూడా టయోటా కంపెనీకి చెందిన కార్లు కనిపిస్తుంటాయి. ఇన్నోవా క్రిస్టా, అర్బన్ క్రూయిజర్ హై రైడర్ వంటి పలు ఇతర మోడళ్లను విక్రయిస్తుంది. ఇదిలా ఉంటే టయోటా ఇటీవల వరుసగా తన కార్ల అమ్మకాల డేటాను విడుదల చేస్తుంది. నవంబర్ నెలలో తన మోడళ్ల వారీగా ఎన్ని అమ్మకాలు నమోదు చేశాయో వాటి డేటాను వెల్లడిస్తుంది. ఈ నేపథ్యంలో తన మోడల్ రుమియన్ (rumion) కారు విక్రయాల డేటాను ఇటీవల విడుదల చేసింది. ఇది ఎంపీవీ మోడల్, పెద్దగా ఉంటుంది.
ఎక్కువ మంది కలిసి ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. రుమియన్ 7 సీటర్ కారు. రెండు కుటుంబాలు ఈ కారులో సులభంగా ప్రయాణించవచ్చు. దూర ప్రాంతాలకు టూర్లకు వెళ్లడానికి కరోనా తర్వాత కాలంలో ఎక్కువగా అయింది. ఇలాంటి వాటికి ఈ రుమియన్ బాగా సెట్ అవుతుంది. తాజాగా ముగిసిన దసరా, దీపావళి సమయంలో అమ్మకాల్లో దుమ్ములేపిన ఈ ఎంపీవీ నవంబర్‌లో తక్కువ అమ్మకాలను నమోదు చేసింది.

రుమియన్ నవంబర్ 2024లో దాదాపు 1,803 యూనిట్లను విక్రయించింది. దీనికి ముందు అక్టోబర్ నెలలో మొత్తం అమ్మకాలు 2,169 యూనిట్లుగా ఉన్నాయి. ఒక నెలలోనే దీని డిమాండ్ కొంత వరకు తగ్గిపోయి, దాదాపు 16.87 శాతం క్షీణతను నమోదు చేసింది. పండుగల సమయంలో తగ్గింపులు, ఆఫర్లు, డిస్కౌంట్స్ వంటివి అందుబాటులో ఉండటం కారణంగా ఎంపీవీని అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో కొన్నారు. అయితే నవంబర్‌లో ఆఫర్లు లేకపోవడం వల్ల అమ్మకాలు తగ్గిపోయాయి.
అదే ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రతి నెలా అమ్మకాలను చూసినట్లయితే జనవరిలో 639 యూనిట్లు అమ్ముడుపోగా, ఫిబ్రవరిలో 730 యూనిట్లు, మార్చిలో 688 , ఏప్రిల్‌లో 1,192 యూనిట్లు, మే నెలలో 1,919 యూనిట్లు, జూన్‌లో 1,566 యూనిట్లు, జులై నెలలో 1,929 యూనిట్లు, ఆగస్టులో 1,721 యూనిట్ల అమ్మకాలను, అదే సెప్టెంబర్ నెలలో 1,968 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది.

రుమియన్ ఎంపీవీని టయోటా ఆగస్టు 2023లో విడుదల చేసింది. లాంచ్ అయిన మొదటి నెలలోనే 112 మంది కొనుగోలు చేశారు. ఆ తరువాత సెప్టెంబర్ నెలలో 1,461 మంది కొనుగోలు చేయగా, అక్టోబర్‌లో 792, నవంబర్‌లో 718 , డిసెంబర్‌లో 833 మంది ఈ ఎంపీవీని కొన్నారు. కొత్త రుమియన్ ధర రూ. 10.44 లక్షల నుండి రూ. 13.73 లక్షల వరకు ఉంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు.
ఇది S, G, V మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఎంపీవీ 1.5-లీటర్ పెట్రోల్, CNG ఇంజిన్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది. మైలేజ్ విషయానికి వస్తే, లీటర్ పెట్రోల్‌కు 20.11 నుండి 26.11 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. టూర్లకు వెళ్లడానికి ఎక్కువ లగేజ్ పెట్టుకోవడానికి 209 లీటర్ల బూట్ స్పేస్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది కేఫ్ వైట్, స్పంకీ బ్లూ, ఐకానిక్ గ్రే కలర్స్‌లలో లభిస్తుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








