27 కి.మీ మైలేజీ ఇచ్చే ఈ టయోటా 7-సీటర్‌ని తెగ కొనేస్తున్నారు.. ఇన్నోవా క్రిస్టాకు ఏమాత్రం తీసిపోదు!
మార్కెట్‌లో టయోటా కార్లు నమ్మదగినవిగా, ప్రయాణీకులకు మంచి సౌకర్యాన్ని అందించేలా రూపొందిచబడ్డాయి. అయితే ఒకప్పుడు ఖరీదైన కార్లను మాత్రమే అమ్మే టయోటా ఇప్పుడు మారుతి సుజుకి భాగస్యామ్యంతో తక్కువ ధరకే కార్లను అందిస్తోంది. మారుతి సుజుకి నుంచి గత నెలలో మారుతి ఎర్టిగా ఎంపీవీ (Maruti Ertiga) దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. అయితే ఈ ఎర్టిగా ఎంపీవీని టయోటా రూమియాన్‌కి (Toyota Rumion) రీబ్యాడ్ వెర్షన్‌గా విక్రయిస్తుంది. అయితే ఈ మార్పులు జరిగినా కానీ ఒరిజినల్ టయోటా రూమియాన్‌కి కూడా మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. మారుతి ఎర్టిగా అంతా కాకాపోయినా ఈ రూమియాన్ సేల్స్‌లో అదరగొడుతోంది. సెప్టెంబర్ 2024 లో దేశంలో టయోటా రూమియాన్ సేల్స్‌కి సంబంధించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ వివరాలు ఈ కథనంలో..
టయోటా రూమియాన్ గత ఏడాది ఆగస్టులో భారత మార్కెట్‌లో లాంచ్ అయింది. ఏడాది కాలంగా టయోటా ఈ కార్లను విక్రయిస్తోంది. ఈ ఎంపీవీ పెట్రోల్, సీఎన్‌జీ వెర్షన్‌లలో లభిస్తుంది. సీఎన్‌జీ వెర్షన్ మంచి మైలేజీతో మార్కెట్‌లోకి రావడం వల్ల భారీ సంఖ్యలో బుకింగ్స్ వచ్చాయి. దీంతో కంపెనీ అనూహ్యంగా దీనిని నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత డిమాండ్‌కి తగిట్లుగా దీనిని మార్కెట్‌లో అందుబాటులో ఉంచింది.

టయోటా రూమియాన్ 2024 సెప్టెంబర్‌లో 1,968 యూనిట్లు విక్రయించబడ్డాయి. 2023 సెప్టెంబర్లో విక్రయించిన 1461 యూనిట్లతో పోలిస్తే ఇది 34.70 శాతం వృద్ధిని నమోదు చేసింది. అలాగే 2024 ఆగస్టులో విక్రయించిన 1721 యూనిట్లతో పోలిస్తే గత నెల అమ్మకాలు 14.35 శాతం పెరిగాయి. ఎర్టిగాతో పాటు దీనిని భారీ సంఖ్యలో కొనుగోలు చేయడం పట్ల ఆ సంస్థ హర్షం వ్యక్తం చేస్తోంది.
ఈ రూమియాన్ ఎంపీవీ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 103 ps శక్తిని, 137 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. రూమియాన్ సీఎన్‌జీ వెర్షన్ 88 ps పవర్‌ని అలాగే 121.5 nm టార్క్‌ని మాత్రమే విడుదల చేస్తుంది. ఇంజిన్ పవర్ అవుట్ పుట్ తక్కువగా ఉన్నప్పటికీ సీఎన్‌జీ వెర్షన్ మంచి మైలేజీని ఇస్తుంది. అందువల్ల దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంది.

రూమియాన్ పెట్రోల్ వెర్షన్లు 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. అయితే సీఎన్‌జీ వేరియంట్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది. ఇక రూమియాన్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లు లీటరుకు 20.51 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఆటోమేటిక్ వేరియంట్లు లీటరుకు 20.11 కిలోమీటర్ల మైలేజీని ఇస్తాయి. ఇక రూమియాన్ సీఎన్‌జీ కిలోకు 26.11 కిలోమీటర్ల భారీ మైలేజీని అందిస్తుంది.
ఇతర టయోటా కార్ల మాదిరిగానే రూమియాన్ క్యాబిన్ రిచ్ లుక్‌ని కలిగి ఉంటుంది. ఇందులో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే ఉన్నాయి. టయోటా రూమియాన్‌లో 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఏసీ, క్రూయిజ్ కంట్రోల్, ప్యాడిల్ షిఫ్టర్స్, కీలెస్ ఎంట్రీ, ఆటోమేటిక్ హెడ్‌లైట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
సేఫ్టీ పరంగా 6 ఎయిర్‌బ్యాగ్స్, హిల్ హోల్డ్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ రూమియాన్ ఎంపీవీ ధర రూ.10.44 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమౌతోంది. దీని టాప్ వేరియంట్ ధర రూ.13.73 లక్షలు (
ఎక్స్-షోరూమ్)గా ఉంది. టయోటా నుంచి మంచి ఫ్యామిలీ కారు కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది.


Click it and Unblock the Notifications








