టైసర్ లిమిటెడ్ ఎడిషన్‌పై టయోటా బంపర్ ఆఫర్.. ఈ నెల వరకే లాస్ట్ ఛాన్స్
టయోటా కంపెనీ పండుగ సీజన్‌లో తన అమ్మకాలను పెంచుకోడానికి ప్రత్యేకంగా టైసర్ లిమిటెడ్ ఎడిషన్(Taisor Limited Edition)SUV ని విడుదల చేసింది. ఇది టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఇప్పటికే ఇతర ఆటోమొబైల్ తయారీ కంపెనీలు పోటీ పడి మరి పండుగల సమయంలో లేటెస్ట్ ఫీచర్లతో కొత్త మోడళ్లను విడుదల చేస్తుండగా, ఇప్పుడు టయోటా కంపెనీ ప్రత్యేకంగా టైసర్ లిమిటెడ్ ఎడిషన్‌ను వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. ఇది పరిమిత కాలం వరకు మాత్రమే లభిస్తుంది. కంపెనీ పేర్కొన్న దాని ప్రకారం ఈ లిమిటెడ్ ఎడిషన్ అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా ఈ కారుకు అదనంగా రూ. 20,160 విలువైన ఉచిత టయోటా జెన్యూన్ యాక్సెసరీస్ ప్యాకేజీని సైతం అందిస్తున్నారు.
ఇంజిన్-ధర: లిమిటెడ్ ఎడిషన్ 100 హార్స్ పవర్ వద్ద 148 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇది 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంది. అలాగే ఇది స్టాండర్డ్ పవర్ ట్రెయిన్‌లలో 90 హార్స్ పవర్ వద్ద 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో మాన్యువల్, ఆటోమెటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్(AMT) ఎంపికలతో వస్తుంది.

మాన్యువల్ వేరియంట్‌లో మాత్రమే 78 హార్స్ పవర్ CNG-శక్తితో కూడిన వెర్షన్ అందుబాటులో ఉంది. లిమిటెడ్ ఎడిషన్ ధర రూ. 10.56 లక్షల నుంచి 12.88 లక్షల(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్య ఉంది. ప్రాంతాల వారీగా ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. పండుగల టైంలో కొత్తగా SUV మోడల్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఇది చాలా బెస్ట్ ఆప్షన్‌గా ఉంది.
ఇంటీరియర్-ఎక్స్‌టీరియర్ డిజైన్: టైసర్ లిమిటెడ్ ఎడిషన్ డిజైన్ సరికొత్తగా ఉంది. గ్రానైట్ గ్రే, రెడ్ కలర్స్‌లో స్పాయిలర్‌లు, డోర్ సిల్ గార్డ్‌లు, హెడ్‌ల్యాంప్‌ల చుట్టూ క్రోమ్ గార్నిష్, ఫ్రంట్ గ్రిల్, సైడ్ మౌల్డింగ్ ఉన్నాయి. క్యాబిన్ లోపల ఆల్-వెదర్ 3D మ్యాట్‌లు, డోర్ వైజర్‌లు, డోర్ ల్యాంప్‌లు, లోపల 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, వైర్‌లెస్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి.
ఇంకా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ జోన్, ప్రయాణికుల భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS సిస్టం, చుట్టుపక్కల చూడటానికి 360-డిగ్రీల కెమెరా, వెనుక పార్కింగ్ సెన్సార్లు, లోపల 6-స్పీకర్ సౌండ్ సిస్టం, ఆటో AC వంటి సదుపాయాలు ఉన్నాయి.
వీటితో పాటు టయోటా కంపెనీ తన ప్రత్యర్థి మోడళ్లకు పోటీగా మరిన్ని అధునాతన ఫీచర్లను అందించింది. టైసర్ లిమిటెడ్ ఎడిషన్ పరిమిత కాలం అందుబాటులో ఉంటుంది. కాబట్టి అదనపు హంగులతో ఎక్కువ ఫీచర్లు కావాలనుకునే వినియోగదారులు తొందరగా బుకింగ్ చేసుకోగలరని అధికారులు తెలిపారు.
టయోటా హైరైడర్ విడుదల అయిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఇది రెండవ పరిమిత ఎడిషన్ కారు. అదనపు ఖర్చు లేకుండా వినియోగదారులకు అవసరమ్యే టయోటా జెన్యూన్ యాక్సెసరీస్‌ను ఉచితంగా అందిస్తూ, తన అమ్మకాలను పెంచుకోవాలని కంపెనీ చూస్తుంది. ఇది హ్యుందాయ్ ఎక్స్‌టర్, టాటా పంచ్ వంటి మైక్రో ఎస్‌యూవీలకు అలాగే టాటా నెక్సాన్, మారుతీ బ్రెజ్జాతో సహా సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీలకు పోటీగా నిలుస్తుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








