అందరూ మెచ్చిన ‌అందగాడు.. మార్కెట్‌లో ఈ కారుదే అప్పర్‌ హ్యాండ్‌.. 28.5 కి.మీ భారీ మైలేజీ, క్లాసీ ఫీచర్లు!

టయోటా కార్లు మార్కెట్‌లో ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ఈ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న కార్లు అత్యాధునిక డిజైన్, క్లాసీ ఫీచర్లతో వస్తాయి. ఈ కార్ల ధరలు ఇతర కార్లతో పోలిస్తే కాస్త ఎక్కువే అయినా కానీ ఇందులో ఉండే కంఫర్ట్‌, బెస్ట్‌ డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ కస్టమర్లు వీటిని కొనేందుకు ఓటేస్తున్నారు. కొన్ని ప్రొడక్ట్స్‌ కోసం మారుతి సుజుకితో కలిసి టయోటా పనిచేస్తుంది. ఇందులో భాగంగా కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఫ్రాంక్స్ ఆధారిత టైజర్ ఎస్‌యూవీని (Toyota Taisor) విడుదల చేసింది.

ఈ కారుని జనాలు అధిక సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. ఇది సరసమైన ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అందువల్ల ఈ కారు నెలనెలా మంచి ఎక్కువ సంఖ్యలో అమ్ముడవుతోంది. ఈ కారుకి సంబంధించిన నవంబర్‌ అమ్మకాలు విడుదల అయ్యాయి. గత కొన్ని నెలలుగా ఈ కారు అమ్మకాల్లో స్థిరంగా రాణిస్తోంది. నవంబర్‌లో మొత్తం 3,620 యూనిట్లను కంపెనీ సేల్ చేసింది.

Toyota Taisor Sales

ఇక అక్టోబర్‌లో 3,092 యూనిట్లు అమ్ముడుపోగా.. సెప్టెంబర్‌లో 2,278 యూనిట్లు, ఆగస్టులో 3,213 యూనిట్లు, జూలైలో 2,640 యూనిట్లు, జూన్‌లో 3,184 యూనిట్లను కంపెనీ విక్రయించింది. ఇన్నోవా హైక్రాస్‌, హైరైడర్‌, గ్లాంజా తర్వాత అత్యధికంగా అమ్మడువుతున్న టయోటా కారుగా టైజర్‌ ఉంది. ఇది చూడటానికి అచ్చం ఫ్రాంక్స్‌ ఎస్‌యూవీ వలె ఉంటుంది. ఇది ప్రీమియం లుక్‌తో వస్తుంది.

ఈ సరికొత్త టయోటా టైజర్ ధర కనిష్టంగా రూ .7.74 లక్షలు నుంచి రూ .13.04 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఈ కారు E, S, S ప్లస్, G, V అనే వేరియంట్లలో లభిస్తుంది. బేస్‌ E వేరియంట్‌లో భారీ ఫీచర్లు ఉన్నాయి. ఇది ఓ బడ్జెట్‌ కారుగా అభివర్ణించవచ్చు. ఈ వేరియంట్‌ సీఎన్‌జీ వేరియంట్‌లో లభిస్తుంది.

Toyota Taisor Midnight Black

ఈ 2 పవర్‌ఫుల్ పవర్ట్రెయిన్ ఆప్షన్స్‌తో వస్తుంది. ఇందులోని 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 90 ps హార్స్ పవర్, 113 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. మరో 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 100 ps పవర్, 148 nm గరిష్ట టార్క్‌ని విడుదల చేస్తుంది. ఇక సీఎన్‌జీ ఆధారిత వేరియంట్ 1.2-లీటర్ ఇంజిన్‌తో వస్తుంది.

సీఎన్‌జీ మోడ్‌లో 77.5 ps హార్స్ పవర్, 98.5 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ జతచేయబడి ఉంటుంది. ఈ కొత్త టయోటా టైజర్ 19.8 నుంచి 28.5 కిలోమీటర్ల భారీ మైలేజీని ఇస్తుంది. ఇది FWD టెక్నాలజీతో వస్తుంది. ఈ కారులో 5 మంది సులభంగా ప్రయాణించవచ్చు.

Toyota Taisor Interior

ఇందులో 308 లీటర్ల కెపాసిటీ గల భారీ బూట్ స్పేస్‌ కలదు. ఈ కారులో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. 9 ఇంచెస్‌ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్‌ మోబైల్‌ ఛార్జర్‌, ప్యాడిల్ షిఫ్టర్స్‌, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్‌, ABS, EBD, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్ & 360 డిగ్రీల కెమెరా వంటివి ఉన్నాయి.

ఇది 5 మోనోటోన్‌, 3 డ్యూయల్‌ టోన్‌ కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఇది మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO, నిస్సాన్‌ మాగ్నైట్‌, టాటా నెక్సాన్, హ్యుందాయ్‌ వెన్యూ, కియా సోనెట్‌, మారుతి బ్రెజా, రెనాల్ట్ కిగర్‌, స్కోడా కైలాక్‌కి గట్టి పోటీని ఇస్తుంది. ఈ కారు కొనుగోలుపై ప్రస్తుతం లక్ష రూపాయల వరకు ఇయర్‌ ఎండ్‌ డిస్కౌంట్‌ని కంపెనీ అందిస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, December 13, 2024, 10:56 [IST]
English summary
Toyota taisor november 2024 sales report check here
Read more on: #toyota #car sales #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+