టయోటా నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ కారు వచ్చేస్తుంది.. ఇక మిగతా కంపెనీలు మార్కెట్‌ని మూసుకోవాల్సిందే!

టయోటా అర్బన్ క్రూయిజర్ మార్కెట్‌లో ఈవీ వెర్షన్‌లో అడుగుపెట్టనుంది. ఈ సరికొత్త ఈవీకి సంబంధించిన వివరాలను టయోటా రివీల్‌ చేసింది. దీనిని సుజుకి ఇ-విటారా ఆధారంగా రూపొందించనున్నారు. ఈ అర్బన్ క్రూయిజర్ ఈవీ 2025లో యూరప్‌ రోడ్లపై పరుగులు పెట్టనుంది. 2026 నాటికి ఇది భారత్‌లో అడుగుపెట్టనుంది. త్వరలోనే టయోటా 15 జీరో ఎమిషన్ కార్లను తీసుకువచ్చే యోచనలో ఉంది. వీటిలో ఆరు ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. అందులో అర్బన్ క్రూయిజర్ ఈవీ ఒకటిగా ఉంది. ఈ అర్బన్ క్రూయిజర్ మిడ్-సైజ్ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ డిజైన్‌తో అచ్చం సుజుకి ఇ-విటారా మాదిరిగానే ఉండనుంది.

ఈ టయోటా ఈ ఎస్‌యూవీ ఫ్రంట్ ఎండ్ డిజైన్‌ సరికొత్తగా ఉండనుంది. వెనక టెయిల్ లైట్లతో పాటు LED లైట్ బార్‌ని కలిగి ఉండనుంది. ఇది సైడ్‌ ప్రొఫైల్‌లో జీప్ కంపాస్‌ని పోలినట్లు కనపిస్తుంది. ఈ అర్బన్ క్రూయిజర్ కొలతల పరంగా 4,285 mm పొడవు, 1,640 mm ఎత్తు, 1,800 mm వెడల్పు, 2,700 mm వీల్‌బేస్‌ని కలిగి ఉంది.

Toyota Urban Cruiser EV Features

ఈ ఎస్‌యూవీ మోడల్ గ్రేడ్ ఆధారంగా 18 ఇంచెస్‌ లేదా 19 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌తో రానుంది. ఇది డ్యూయల్ టోన్ ఆప్షన్స్‌, బ్లాక్ రూఫ్‌తో టయోటా వివిధ రకాల కలర్ స్కీమ్స్‌తో రానుంది. ఈ అర్బన్ క్రూయిజర్ రెండు బ్యాటరీ ప్యాక్స్‌, ఫ్రంట్ లేదా ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో అందించబడుతుంది. రెండూ బ్యాటరీ ప్యాక్స్‌ లిథియం-ఐరన్ ఫాస్ఫేట్ టెక్నాలజీతో రానున్నాయి.

ఫ్రంట్‌ వీల్‌ డ్రైవ్‌ మోడల్‌ 49 కిలోవాట్ల బ్యాటరీ 144 hp అవుట్‌పుట్‌ని, 61 కిలోవాట్ల బ్యాటరీ ఆప్షన్‌ 174 hpని విడుదల చేస్తుంది. AWD వేరియంట్‌లోని 61 కిలోవాట్ల బ్యాటరీ 184 hpని ఉత్పత్తి చేస్తుంది. ఈ అర్బన్ క్రూయిజర్ ఈవీ రేంజ్‌ని ఇంకా వెల్లడించలేదు. అయితే మార్కెట్‌లో ప్రస్తుతం ఉన్న ఎస్‌యూవీలతో పోల్చితే భారీ రేంజ్‌ని అందించే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి.

Toyota Urban Cruiser EV Launch Date

ఇక ఇందులోని ఇంటీరియర్ సైతం సుజుకి ఇ-విటారాను పోలి ఉంటుంది. ఇది బ్లాక్‌, బూడిద కలర్‌ స్కీమ్‌తో వస్తుంది. వెనుక సీటు స్లైడింగ్ ఫంక్షన్‌తో వస్తుంది. ఇది 40:20:40 స్ప్లిట్‌తో వస్తుంది. ఇందులో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ కన్సోల్‌తో పాటు 10.1 అంగుళాల మల్టీమీడియా స్క్రీన్ స్మార్ట్‌ఫోన్‌ ఇంటిగ్రేషన్‌తో వస్తుంది. డ్రైవర్‌ ఎలక్ట్రిక్ సర్దుబాటుతో వస్తుంది.

ఇంటీరియర్‌లో JBL ప్రీమియం ఆడియో సిస్టమ్, ఫిక్స్డ్ సన్‌రూఫ్, 12-కలర్ యాంబియంట్ లైటింగ్ వంటి ఇతర ఫీచర్లు ఇంటీరియర్‌కి మరింత అందాన్ని పెంచుతాయి. ఇక సేఫ్టీలోనూ ఈ ఈవీ మంచి ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో ప్రీ-కొలిషన్ సిస్టమ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ అలర్ట్, లేన్ కీప్ అసిస్ట్, 360 డిగ్రీల కెమెరా వంటివి ఇందులో ఉన్నాయి.

Toyota Urban Cruiser EV Revealed

సుజుకి ఇ-విటారా లాంచ్ తర్వాత టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ భారత్‌లో అడుగుపెడుతుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని గుజరాత్‌లోని సుజుకి ప్లాంట్‌లో తయారు చేసి దేశీయ మార్కెట్‌లో విడుదల చేయనున్నారు. ఇది సైతం సుజుకి ఇ-విటారాతో సమానంగా ధరను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. టయోటా వంటి పేరొందిన బ్రాండింగ్‌తో ఈ కొత్త కారు మార్కెట్‌లోకి వస్తుండటం వల్ల మంచి డిమాండ్‌ని పొందే అవకాశం ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, December 14, 2024, 15:48 [IST]
English summary
Toyota urban cruiser ev revealed check expected range and features
Read more on: #toyota #upcoming cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+