ఈ డ్రైవింగ్ టిప్స్‌ పాటిస్తే చాలు.. ఆ కారు 28 కి.మీ కంటే తక్కువ మైలేజీ ఇవ్వదు..

టయోటా విడుదల చేసిన కార్లలో టయోటా అర్బన్‌ క్రూయిజర్‌ హైరైడర్‌కి మంచి డిమాండ్‌ ఉంది. సేల్స్‌లోనూ ఈ కారు దూసుకెళ్తుంది. ఎక్కువ మైలేజీతో పాటు అధునాతన ఫీచర్లతో ఫుల్‌-ప్యాక్డ్‌ వెర్షన్‌గా ఇది అందుబాటులో ఉంది. ఈ కారు మీకు మంచి డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుంది. బెస్ట్‌ మైలేజీ అందించే టిప్స్‌ మీకోసం..

ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టయోటా కార్లలో హైరైడర్‌ ఒకటి. ఈ కారు పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ ఆప్షన్‌లో గరిష్టంగా 20.58 కిలోమీటర్లు, హైబ్రిడ్‌ వెర్షన్‌లోని ఆటోమేటిక్ కారు 27.97 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని ARAI ధ్రువీకరించింది. బెస్ట్ మైలేజీతో పాటు మంచి కారు డ్రైవింగ్‌ అనుభూతి కోసం ఈ కారుని నిరభ్యంతరంగా ఎంచుకోవచ్చు.

Toyota-Urban-Cruiser-Hyryder

టయోటా ఎస్‌యూవీ సీఎన్‌జీ ఆప్షన్‌లో కూడా విక్రయించబడుతుంది. టయోటా హైరైడర్ సీఎన్‌జీ కిలోకు 26.6 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. పెట్రోల్ కంటే సీఎన్‌జీ కారు ధర తక్కువగా ఉన్నందున ఈ కారుని కొనేందుకు జనాలు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక టయోటా హైరైడర్‌ స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో లభిస్తుంది. ఈ హై ఎండ్‌ స్ట్రాంగ్‌ వెర్షన్‌ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది.

టయోటా హైరైడర్ ఎక్కువ మైలేజీ పొందడానికి కొన్ని చిట్కాలను అనుసరించాల్సి ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా కారు వేగాన్ని ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలి. ఇంజిన్‌పై ఎక్కువ ప్రెజర్‌ ఇవ్వకపోతే ఆటోమేటిట్‌గా మైలేజ్ పెరగడం మొదలవుతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు యాక్సిలరేషన్ మరియు బ్రేక్‌ను తరచుగా ఉపయోగించవద్దు.

Toyota-Urban-Cruiser-Hyryder

ఎక్కువగా హైవేలపై హైరైడర్‌ను నడపడం వల్ల దాని మైలేజీ పెరగడంతో పాటు మంచి డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది. అందుకే ఈ కారులో క్రూయిజ్ కంట్రోల్‌ను అందించారు. క్రూయిజ్ కంట్రోల్‌తో హైవేలపై డ్రైవింగ్ చేసేటప్పుడు తరచుగా యాక్సిలరేషన్‌ మాన్యువల్‌గా అప్లై చేయాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది.

గంటల తరబడి ఒకేచోట ఆగాల్సి వస్తే కారు ఇంజిన్ ఆఫ్ చేయడం మంచిది. వీలైతే ట్రాఫిక్‌లో ఆగినప్పుడు కూడా దీనిని అనుసరించడం మంచి మైలేజీని అందిస్తుంది. ముందున్న వాహనాలకు మరీ దగ్గరగా వెళ్లకండి. అదేవిధంగా, యాక్సిలరేషన్ పెడల్‌ను వేగంగా పెడలింగ్ చేయడం వల్ల కూడా మైలేజీ తగ్గుతుంది. కారు మైలేజీ మన డ్రైవింగ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుందని మర్చిపోవద్దు.

Toyota-Urban-Cruiser-Hyryder

డ్రైవింగ్ స్టైల్ మాదిరిగానే, టైర్ల నాణ్యత కూడా కారు మైలేజీలో ఒక ముఖ్యమైన అంశం. కారు మైలేజీలో టైర్లు కీలక పాత్ర పోషిస్తాయి., సరైన కండిషనింగ్ కోసం టైర్లను క్రమానుగతంగా తనిఖీ చేయండి. అదేవిధంగా కారు లోపల ఏసీని ఎక్కువగా ఉపయోగించడం వల్ల కూడా ఇంజిన్ పై లోడ్ పెరుగుతుంది మరియు మైలేజ్ తగ్గుతుంది.

టయోటా హైరైడర్‌ కచ్చితమైన మైలేజీ అందిస్తుంది. పైన తెలిపిన చిన్న చిన్న టిప్స్‌ని పాటించడంతో మెరుగైన మైలేజీని పొందవచ్చు. ఇది రియల్ వరల్డ్‌లో కాస్త తక్కువ మైలేజ్ వస్తుంది. అయితే మెరుగైన మైలేజీ కావాలంటే మాత్రం కచ్చితంగా పైన తెలిపిన టిప్స్‌ని పాటించాలి. మంచి హైబ్రిడ్‌ కారుని కొనుగోలు చేయాలంటే ఈ కారు బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Sunday, May 26, 2024, 10:47 [IST]
English summary
Toyota urban cruiser hyryder mileage save tips
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+