28 కి.మీ మైలేజీ.. హైబ్రిడ్‌ కారులో దీన్ని కొట్టేదే లేదు.. కానీ సేల్స్‌లో అంతత మాత్రమే!!

మారుతి సుజుకీ మరియు టయోటా సంయుక్తంగా అభివృద్ధి చేసిన అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కారును అభివృద్ధి చేశారు. ఈ మోడల్ కు ఊహించిన స్థాయిలో సేల్స్ లభించడం లేదు. గత ఏప్రిల్ నెలలో మరింత క్షీణించాయి. మంచి ఫీచర్లు ఉత్తమ మైలేజీ ఉన్నా కానీ ప్రజలు ఈ కారు కొనుగోలుకు ఆసక్తి కనబరచడం లేదు.

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ గత ఏడాది ఏప్రిల్ నెలతో పోల్చితే 24.31 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. ఇదే కారు 2024 ఏప్రిల్ నెలలో 3,252 యూనిట్ల వరకు విక్రయాలు జరిగాయి. అయితే గతేడాది ఏప్రిల్‌లో 2,616 యూనిట్లను మాత్రమే విక్రయించడం గమనార్హం. నెల నెలా ఈ కారు సేల్స్ ఆటుపోటులను చవిచూస్తున్నాయి.

Toyota-Urban-Cruiser-Hyryder

మార్చి 2024తో సేల్స్‌తో పోలిస్తే ఏప్రిల్‌లో ఈ కారుని కొనేందుకు వెనుకాడారు. మార్చి నెలలో 5,965 యూనిట్ల వరకు అర్బన్ క్రూయిజర్ హైరైడర్ విక్రయించబడింది. దీంతో ఏప్రిల్‌లో మార్చితో పోల్చితే 45 శాతం క్షీణించింది. ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా, టయోటా అన్ని కార్లపై భారీ డిస్కౌంట్‌లను అందించింది. అందుకే మార్చిలో సేల్స్‌ పెరిగాయని ఆటో మోబైల్‌ నిపులుణు తెలిపారు.

భారీ డిస్కౌంట్స్‌ అందించడంతో మార్చిలో మంచి రిజల్ట్స్‌ని హైరైడర్‌ సాధించింది. ధర కొద్దిగా ఎక్కువగా ఉండటంతో దీనిని కొనేందుకు జనాలు ఇంట్రెస్ట్‌ చూపించడం లేదు. కానీ ఈ కారు ఫ్యామిలీలు కంఫర్ట్‌గా ప్రయాణించే అవకాశం ఉంటుంది. దీనిలోని అధునాతన ఫీచర్లు ప్రీమియం కార్ల అనుభూతిని కల్పిస్తుంది. ప్రస్తుతం ఈ కారు మోడల్ 5 సీట్ల వాహనంగా అమ్మకానికి అందుబాటులో ఉంది. త్వరలోనే ఇది 7-సీటర్ వెర్షన్‌లో ప్రారంభం కానుంది.

Toyota-Hyryder

ఎక్కువ మైలేజీ అందించడంతో పాటు సేఫ్టీ ఫీచర్లు అధికంగా ఉండటంతో అర్బన్ క్రూయిజర్ హైరైడర్ అమ్మకాలను మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ భారతదేశంలో అమ్మకానికి అందుబాటులో ఉన్న హ్యుందాయ్ క్రెటా, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా మరియు ఇతర వాటితో పోటీ పడుతోంది. పైన తెలిపిన కార్లకు ఈ కారు గట్టి పోటీని ఇస్తుంది.

7-సీటర్ వెర్షన్ అమ్మకానికి వస్తే, ఇది MG హెక్టర్ ప్లస్, టాటా సఫారీ, సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ మరియు హ్యుందాయ్ అల్కాజార్‌లకు పోటీగా ఉంటుంది. టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ భారతదేశంలో పెట్రోల్ మరియు CNG ఎంపికలలో అందుబాటులో ఉంది. దీని పెట్రోలు ప్రారంభ ధర రూ. 11.14 లక్షల నుంచి CNG ధర రూ.13.71 లక్షల ప్రారంభ ధర నుంచి విక్రయానికి అందుబాటులో ఉంది.

Toyota-Urban-Cruiser-Hyryder

దీనితో పాటు, ఈ కారు మోడల్‌లో పెట్రోల్-హైబ్రిడ్ ఎంపిక కూడా అందించబడుతుంది. ఇది రూ. 16.66 లక్షల ప్రారంభ ధర నుండి విక్రయానికి అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే. దీని CNG ఎంపిక కిలోకు 26.6 మైలేజీని అందిస్తుంది, సాధారణ పెట్రోల్ ఎంపిక 19.39 kmpl నుంచి 21.12 kmpl వరకు మైలేజీ అందిస్తుంది. హైబ్రిడ్ ఆప్షన్‌ 27.97 kmpl మైలేజీని ఇస్తుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, May 23, 2024, 9:40 [IST]
English summary
Toyota urban cruiser hyryder sales decrease in april but still tough competitor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+