నం.1 ట్రస్టెడ్ కారు.. 28 కి.మీ మైలేజీకి తగ్గదు.. కావాలంటే టెస్ట్ చేసి కొనండి, డబ్బులు ఎవరికీ ఊరికే రావు
టయోటా అర్బన్ క్రూయిజర్‌కి భారత్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ కారు భారత్‌లోని ఇతర కార్లకు గట్టి పోటీని ఇస్తుంది. ముఖ్యంగా కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అమ్మకానికి ఉన్న ఇతర కారు మోడళ్లకు ఈ కారు పలు సవాళ్లను విసురుతోంది. ప్రీమియం ఫీచర్లు మరియు కచ్చితమైన మైలేజీ సామర్థ్యం కారణంగా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ నంబర్ వన్ ట్రస్టెడ్ కారుగా ఎదిగింది. మరోవైపు ఈ కారు తక్కువ ఉద్గారాణాలను విడుదల చేస్తుంది. దీంతో ప్రకృతి ప్రియులకు కూడా ఈ కారు అమితంగా నచ్చుతుంది. ఈ కారులోని హైబ్రిడ్ సిస్టమ్ మెరుగైన రైడింగ్‌కి అనుమతిస్తుంది. దీనిలోని డ్రైవర్, ప్రయాణికులు మంచి డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఫీల్ అవ్వగలరు.
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ ఇంజిన్ లీటర్ పెట్రోల్‌కు 28 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. మరోవైపు నాన్ హైబ్రిడ్ ఆప్షన్ కారు లీటర్‌కి 19.39 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వనుంది. మైలేజీ విషయంలో ఈ కారు కస్టమర్ల నమ్మకాన్ని వమ్ము చేయదు. అందుకే బెస్ట్ మైలేజీ కోసం చూసే వారికి ఈ కారుని నిరభ్యంతరంగా రిఫర్ చేస్తున్నారు.

ఇంధన పొదుపు మరియు మైలేజీ పరంగా చూస్తే హైరైడర్ ఉత్తమ కారుగా ఉంది. అదే హ్యుందాయ్ క్రెటా కారు లీటరుకు 17.4-21.8 కిలోమీటర్ల మైలేజీని మాత్రమే ఇస్తుంది. ప్రస్తుతం ఈ విభాగంలో సేల్స్‌లో టాప్‌గా ఉన్న ఈ క్రెటా కూడా హైరైడర్ కంటే తక్కువ మైలేజీని అందిస్తుంది. ఇతర ప్రత్యర్థి కార్లు కూడా ఈ కారుకి కనీసం దగ్గర్లోనూ లేవు. అందుకే హైరైడర్ ఈ విభాగంలో కింగ్ మేకర్‌గా ఉంది.
ఇంజిన్ స్పెసిఫికేషన్లు: హైరైడర్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ హైబ్రిడ్ సిస్టమ్ హైరైడర్ ఎక్కువ మైలేజీని అందిస్తుంది. ఈ టెక్నాలజీ ప్రత్యర్థి కార్ మోడళ్లలో అందుబాటులో లేదు. హ్యుందాయ్ క్రెటా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే లభిస్తుంది. ఈ కారులోని స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌తో ఏ కారు కూడా పోటిపడలేదు.

ధర: అర్బన్ క్రూయిజర్ ప్రారంభ ధర రూ.11.14 లక్షల నుంచి రూ.20.19 లక్షలుగా ఉంది. ఈ కారు సాధారణ పెట్రోల్, సీఎన్‌జీ మరియు హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. అదే హ్యుందాయ్ క్రెటా రూ. 11 లక్షల నుంచి రూ.20. 15 లక్షల వరకు ఉంది. ఈ కారు మోడల్ సాధారణ పెట్రోల్ మరియు డీజిల్ ఆప్షన్‌లలో మాత్రమే లభిస్తుంది.
హైలైట్స్: టయోటా హైరైడర్‌లో ఫీచర్లు ఇతర ప్రత్యర్థి కార్లతో కాస్త మెరుగ్గా ఉంటాయి. ఈ కారు మరియు ప్రత్యర్థి కార్లలో 9 అంగుళాల టచ్‌స్క్రీన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 360 డిగ్రీల కెమెరా ఉన్నాయి. ఫీచర్ల పరగం చూస్తే అన్ని మోడళ్లు ఒకే విధంగా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే హైరైడర్‌లోని రిచ్ లుక్ కారు ఇంటీరియర్‌ని మరింత అందంగా చూపించనుంది.

డిమాండ్: టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లో ప్రీమియం ఫీచర్లు, కచ్చితమైన ఫ్యూయల్ ఎఫిషియెన్సీ ఎస్‌యూవీగా పేరుగాంచింది. అంతే కాకుండా దీనిలో హైబ్రిడ్ టెక్నాలజీ ఇంజిన్ ఉండటం ప్లస్ పాయింట్‌గా చెప్పవచ్చు. దీని ప్రత్యర్థి కారు హ్యుందాయ్ క్రెటా కంటే ఈ కారు చాలా మెరుగ్గా ఉంటుంది. ఈ కారు వెయిటింగ్ పీరియడ్ వేరియంట్‌ని బట్టి మారుతున్నాయి. నాన్ హైబ్రిడ్‌కి 2-3 నెలలు, హైబ్రిడ్ వేరియంట్‌కి 8-9 నెలల సమయం పడుతుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








