28 కి.మీ మైలేజీ అందించే ఈ టాప్-క్లాస్ కారులో 5 గురు హాయిగా వెళ్లవచ్చు.. వెయిటింగ్ పీరియడ్ కూడా తక్కువే!!
దేశంలో టయోటా కార్లకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఆ కంపెనీ నుంచి మిడ్‌సైజ్ ఎస్‌యూవీ విభాగంలో ఆ కార్లు దూసుకెళ్తున్నాయి. తాజాగా ఆ కంపెనీ విక్రయించే అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఎస్‌యూవీ ఆకర్షణీయమైన డిజైన్ మరియు ఫీచర్‌ని కలిగి ఉంది. దీంతో ఈ కారుని కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతున్నారు. ప్రస్తుతం మిడ్-సైజ్ ఎస్‌యూవీ అమ్మకాల్లో ఈ కారు టాప్-5 సేల్స్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ కారు డెలివరీ పొందడానికి నెలల తరబడి వేచి ఉండవలసిన అవసరం ఉంటుంది. ఈ కారు బుక్ చేసుకున్న తర్వాత ఎన్ని నెలలు వెయిట్ చేయాల్సి ఉంటుంది మరియు ఇతర వివరాలు మీ కోసం..
టయోటా ఇండియా జూన్ 1, 2024 నాటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 'అర్బన్ క్రూయిజర్ హైదర్' కోసం వెయిటింగ్ పీరియడ్ తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. హైబ్రిడ్‌తో నడిచే మోడళ్లను ఈ రోజు బుక్ చేసుకుంటే దాదాపు 2 నెలల తర్వాత డెలివరీ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయం రెండు నెలలకంటే ఎక్కువే పట్టే అవకాశం ఉంటుంది.

అర్బన్ క్రూయిజర్ హైరైడర్ నియో డ్రైవ్ (పెట్రోల్) వెర్షన్స్ అధిక వెయిటింగ్ పీరియడ్ కలిగి ఉన్నాయి. ఇవి ఇప్పుడు బుక్ చేసుకుంటే ఐదు నెలల తర్వాత డెలివరీ చేయబడతాయి. ఈ కారు సీఎన్‌జీ వేరియంట్లు మీ ఇంటికి చేరుకోవాలంటే వీటికి సుమారు 4 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. పైన తెలిపిన విధంగా ఈ కారు వెయిటింగ్ పీరియడ్స్ ఉన్నాయి.
దేశీయ మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉన్న టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ధర రూ .11.14 లక్షల నుంచి రూ .20.19 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఈ కారు కేఫ్ వైట్, గేమింగ్ గ్రే, స్పోర్టిన్ రెడ్ వంటి అత్యాధునిక రంగుల్లో లభిస్తుంది. ఈ కారులో సులభంగా 5 గురు లాంగ్ జర్నీకి వెళ్లవచ్చు. ఈ కారులో అత్యాధునిక ఫీచర్లు ఉంటాయి.

కొత్త కారు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్, స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ మరియు సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. వేరియంట్లను బట్టి ఇది 5-స్పీడ్ మాన్యువల్ / 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో లభిస్తుంది. ఇది 2 WD (టూ-వీల్ డ్రైవ్) మరియు AWD (ఆల్-వీల్ డ్రైవ్) టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ కార్లు వేరియంట్లను బట్టి 19.39 కి.మీ నుంచి 27.97 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది.
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఎస్‌యూవీలో 9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, వైర్ లెస్ ఫోన్ ఛార్జర్, సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 6-ఎయిర్ బ్యాగ్, ABS (యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), VSC (వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్), TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్ మరియు హోండా ఎలివేట్ ఈ కారుకు ప్రత్యర్థులుగా ఉన్నాయి. అర్బన్ క్రూయిజర్ హైరైడర్ రాబోయే రోజుల్లో 7-సీటర్ ఆప్షన్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీనిపై పెద్ద కుటుంబాలకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. త్వరలోనే లాంచ్ అయ్యే ఈ కారుతో మార్కెట్‌లో హైరైడర్ మరింత గ్రిప్ తెచ్చుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








