28 కి.మీ మైలేజీ అందించే ఈ ఫేమస్ కారు త్వరలోనే 7- సీటర్ ఆప్షన్‌లో విడుదల..
దేశంలో టయోటా కార్ల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. అందుకు తగినట్లుగానే ఆ సంస్థ కార్లను విడుదల చేస్తుంది. టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ భారతదేశంలో అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన కార్ మోడళ్లలో ఒకటిగా ఉంది. ఇది లీటరుకు 28 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది.
అయితే టయోటా త్వరలో అర్బన్ క్రూయిజర్ హైరడర్‌లో హై-మైలేజీ అందించే మరొక కారుని విడుదల చేయనుంది. ప్రస్తుతానికి, ఈ కారు మోడల్ 5-సీటర్ వెర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంది. 7-సీటర్ కార్ మోడళ్లకు భారతదేశంలో మంచి స్పందన లభిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని 7-సీటర్‌ని తీసుకువస్తుంది.

టయోటా తన హై-మైలేజ్ కారు మోడల్ లో 7-సీటర్ వెర్షన్‌కి అతి త్వరలోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తాజా నివేదికల ప్రకారం టయోటా 2025 చివరి నాటికి 7 సీట్ల అర్బన్ క్రూయిజర్ హైరడర్ మార్కెట్‌లో విడుదల కానుంది. ఇది అమ్మకానికి వస్తే ఈ విభాగంలోని ఇతర కంపెనీలతో పోటీ పడనుంది.
ఇది ముఖ్యంగా ఎంజీ హెక్టర్ ప్లస్, టాటా సఫారీ, సిట్రోయెన్ సీ3 ఎయిర్ క్రాస్, హ్యుందాయ్ ఆల్కాజర్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. 7 సీట్ల అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మూడు వరుసల సీటింగ్ సెటప్‌తో రానుంది. ఈ మూడు వరుసల్లోనూ ప్రత్యేక ఏసీ వెంట్లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే, అన్ని వరుసలలో ఎక్కువ స్పేస్ మరియు ఎక్కువ లెగ్ రూమ్ కూడా ఉండే అవకాశం ఉంది.

7-సీటర్ వెర్షన్ ప్రస్తుతం అమ్మకానికి ఉన్న 5-సీటర్ వెర్షన్ కంటే కొద్దిగా భిన్నంగా ఉండనుంది. 7 సీట్ల అర్బన్ క్రూయిజర్ హైరైడర్ అదనపు కండిషన్‌లతో వస్తుంది. మరే ఇతర మార్పులూ ఉండే అవకాశం లేకపోదు. ముఖ్యంగా ఇంజిన్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు.
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ 1.5-లీటర్ టీఎన్జీఏ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 101.6బిహెచ్ పి పవర్ మరియు 117ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

ప్రస్తుతం నాన్-హైబ్రిడ్ ఆప్షన్ కలిగి ఉన్న ఇంజిన్‌లు లీటరుకు 21.1 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తున్నాయి. టయోటా, మారుతి సుజుకి సంయుక్త భాగస్వామ్యంతో ఈ కారును రూపొందించారు. గ్రాండ్ విటారా పేరుతో మారుతి బ్రాండ్ పేరుతో ఈ కారు అందుబాటులో ఉంది. దీని ధర రూ.10.99గా ఉంది. మరోవైపు, టయోటా అర్బన్ క్రూయిజర్ హైదర్ ప్రారంభ ధర రూ .11.14 లక్షలుగా ఉంది.
రెండు కార్లు (గ్రాండ్ విటారా మరియు అర్బన్ క్రూయిజర్ హైరైడర్) సీఎన్‌జీ, పెట్రోల్, పెట్రోల్ మరియు హైబ్రిడ్ ఆప్షన్‌లో ఉన్నాయి. టయోటా 7-సీటర్‌లోనూ ఈ ఆప్షన్‌లు కలిగిన ఇంజిన్‌లు వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి మార్కెట్‌లోకి వచ్చాక ఈ కారు 7-సీటర్‌లో కింగ్ మేకర్‌గా నిలుస్తుందని ఆటోమోబైల్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కారు ప్రకటించిన తేదీ కంటే ముందే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








