రూ. 7.73 లక్షల ధరలో టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ లాంచ్.. అదరగొట్టే డిజైన్, ఫీచర్లు
టయోటా కిర్లోస్కర్ మోటార్స్ నుంచి భారత మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ ఎస్‌యూవీ నేడు విడుదలైంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఆధారంగా రీబ్యాడ్జ్‌డ్ వెర్షన్‌గా టయోటా దీన్ని తీసుకువచ్చింది. కొత్త స్టైలింగ్ మరియు విలక్షణమైన ఫీచర్లతో టైజర్(Toyota Urban Cruiser Taisor SUV) అందుబాటులోకి వచ్చింది.
భారత మార్కెట్లో టయోటా కార్లకు మంచి ప్రజాదరణ ఉంది. ముఖ్యంగా టయోటా ఫార్చ్యూనర్, టయోటా ఇన్నోవా క్రిస్టా, హైక్రాస్ వంటి ఎస్‌యూవీలు మార్కెట్లో మంచి సేల్స్‌తో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకితో భాగస్వామ్యం కుదుర్చుకున్న టయోటా.. దాని ప్రముఖ మోడల్ మారుతి ఫ్రాంక్స్‌కు రీబ్యాడ్జ్ వెర్షన్‌గా టయోటా టైజర్‌ను తీసుకువచ్చింది.

సరసమైన ధరలో అర్బన్ క్రూయిజర్ టైజర్ ఎస్‌యూవీని టయోటా అందుబాటులోకి తీసుకువచ్చింది. ధర రూ. 7.73 లక్షల(ఎక్స్-షోరూమ్- ఢిల్లీ) ప్రారంభ ధరతో ఈ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. మారుతి సుజుకి ఫ్రాంక్స్, టయోటా టైజర్‌లు బ్యాడ్జ్- ఇంజినీరింగ్ ఆఫర్‌తో దాదాపు ఒకే విధమైన స్పెసిఫికేషన్లను కలిగి ఉండగా.. కొత్త స్టైలింగ్‌తో టైజర్ తన స్వంత ఐడెంటిటీతో లాంచ్ అయింది.
డిజైన్: అర్బన్ క్రూయిజర్ Taisor ముందు భాగంలో కొత్త లుక్‌ను చూడవచ్చు. కూపే స్టైల్‌తో మధ్యలో టయోటా లోగోతో గ్లేస్ బ్లాక్‌ను కలిగి ఉంది. కొత్త ట్విన్ LED DRL లతో ఫినిష్ అయిన కొత్త బోల్డ్ హనీకోంబ్ మెష్ గ్రిల్‌తో వస్తుంది. లైట్ బార్ ద్వారా కనెక్టెడ్ ట్వీక్ LED టైల్‌లైట్‌లతో ఆకర్షణీయంగా ఉంటుంది. రీస్టైల్ చేసిన అల్లాయ్ వీల్స్, వెనుక విండ్ స్క్రీన్.. ఆకట్టుకునే రూపాన్ని జోడిస్తుంది.

ఇంటీరియర్: అర్బన్ క్రూయిజర్ Taisor ఇంటీరియర్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మారుతి ఫ్రాంక్స్ మాదిరిగానే 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ట్విన్ పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, డ్యూయల్ టోన్ కలర్ ట్రీట్‌మెంట్‌తో క్యాబిన్ టెక్ ఫీచర్లతో నిండి ఉంది. ఇంకా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకు వైర్‌లెస్ మద్దతునిస్తుంది.

వీటితో పాటు అర్బన్ క్రూయిజర్ Taisorలో 360 డిగ్రీ కెమెరా, హెడ్ అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, DRL లతో కూడిన ఆటోమేటిక్ ఎల్‌ఈడీ ల్యాంప్‌లు, 6- స్పీకర్ సౌండ్ సిస్టమ్, పుష్-బటన్ స్టార్ట్\స్టార్టప్, ఇంకా రియర్ ఏసీ వెంట్‌ల వంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉంది.

ఇంజిన్: టయోటా అర్బన్ క్రూయిజర్ Taisor రెండు ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఒకటి 1.2 లీటర్ నేచురల్లీ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్. ఈ ఇంజిన్ 89 bhp మరియు 113 nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా రెండోది 1.0 లీటర్ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 99 bhp మరియు 148 nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
అర్బన్ క్రూయిజర్ Taisor లో ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటాయి. అయితే నేచురల్లీ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 5 స్పీడ్ AMT ని కలిగి ఉండగా.. టర్బో పెట్రోల్ ఇంజిన్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆప్షన్‌ను కలిగి ఉంది. ఇందులో సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్‌ను కూడా సంస్థ తీసుకువచ్చింది.

సరసమైన ధరలో విడుదలైన టయోటా అర్బన్ క్రూయిజర్ Taisor.. భారత మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కైగర్, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, కియా సోనెట్ వంటి సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలకు గట్టి పోటీనిస్తుంది. కాగా మారుతి సుజుకి ఫ్రాంక్స్ ధరలు మార్కెట్లో రూ. 7.51 లక్షల నుంచి 9.72 లక్షల వరకు ఉన్నాయి. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు.


Click it and Unblock the Notifications








