ఇంద్రభవనం లాంటి టయోటా కారు కోసం ఎగబడుతున్నారు.. ఏకంగా సగానికి పైగా పెరిగిన సేల్స్

భారత్‌లో దిగ్గజ కార్ల తయారీ కంపెనీగా ఉన్నటువంటి టయోటా(Toyota) ఇటీవల వరుసగా తన అమ్మకాలకు సంబంధించిన డేటాను విడుదల చేస్తుంది. మధ్య తరగతి వినియోగదారుల నుంచి మొదలుకుని ధనవంతుల వరకు అన్ని వర్గాలకు అనుకూలంగా ఉండే మోడళ్లను విడుదల చేస్తున్న టయోటా తాజాగా అత్యంత ప్రీమియం కారు వెల్‌ఫైర్ భారత్‌లో ఎలాంటి విక్రయాలను సాధింస్తుందో వెల్లడించింది. టయోటా విడుదల చేసిన డేటా ప్రకారం, ధనవంతులు మాత్రమే కొనగలిగే ధరలో లభిస్తున్న వెల్‌ఫైర్ (vellfire) 2024 నవంబర్ నెలలో 86 యూనిట్లు అమ్ముడుపోయింది. అదే ఇది గత ఏడాది (2023) నవంబర్ నెలతో పోలిస్తే 62 శాతం ఎక్కువ. వెల్‌ఫైర్ కారు ఏడాది కాలంలోనే ఇంత వృద్ది చెందడంపై కంపెనీ సంతోషం వ్యక్తం చేస్తుంది. దీని ఆకట్టుకునే డిజైన్, లోపల విశాలవంతమైన స్థలంతో ప్రయాణికులకు లగ్జరీ ప్రయాణాన్ని అందిస్తుంది.

టయోటా వెల్‌ఫైర్ దేశీయ మార్కెట్లో విక్రయించే అత్యంత ప్రీమియం మోడల్‌గా ఉంది. ఇండియాలో దీని ధర రూ.1.22 నుండి రూ.1.32 కోట్ల వరకు ఉంటుంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. ఈ కారులో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. రోడ్డుపై ఇది వెళ్తుంటే, ఒక పెద్ద ఇంద్రభవనం కదులుతున్నట్లుగా ఉంటుంది. ఇంజిన్ విషయానికి వస్తే, ఇది హైబ్రిడ్ కారు. 2.5-లీటర్ 4-సిలిండర్ డబుల్ ఓవర్‌హెడ్ క్యామ్‌షాఫ్ట్ ఇంజిన్‌తో రన్ అవుతుంది.

Toyota Vellfire Sales

పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్‌తో ఇది 193 PS పవర్, 240 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. కార్బన్ ఉద్గారాలను తక్కువ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి ఎలక్ట్రిక్ మోటార్, హైబ్రిడ్ బ్యాటరీ సహాయపడుతాయి. ఈ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కారు 19.28 కి.మీ వరకు మైలేజ్‌ను అందిస్తుంది. భారత మార్కెట్లో టయోటా వెల్‌ఫైర్ మరో లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్-బెంజ్‌కు చెందిన V-క్లాస్‌కు ప్రత్యర్థిగా నిలుస్తుంది.

వెల్‌ఫైర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ హాయ్, రెండోది టాప్. దీని ఇంటీరియర్ చాలా అందంగా ఉంటుంది. లోపల లేటెస్ట్ సదుపాయాలు ఉన్నాయి. సీట్లు లెదర్ అపోల్స్ట్రేలో ఉన్నాయి. క్యాబిన్ డిజైన్ కూడా కొత్తగా ఉంది. ముఖ్యంగా రెండో వరుస సీట్లు మసాజ్ ఫంక్షన్ మాదిరిగా ఉంటాయి. ముందు వరుస రెండు వరుసల సీట్ల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. ప్రయాణికులు చాల కంఫర్ట్‌గా కూర్చోవచ్చు.

Toyota Vellfire November 2024 Sales Report

టయోటా వెల్‌ఫైర్ ముందు క్రోమ్ యాక్సెంట్స్‌ను కలిగి ఉంటుంది. చీకట్లో మెరుగైన వెలుతురు కోసం LED హెడ్‌ల్యాంప్‌లు, ఫాగ్ లాంప్, సరికొత్త బంపర్ సెటప్ ఉన్నాయి. లోపల డాష్‌బోర్డు చుట్టు సాఫ్ట్-టచ్ కంట్రోల్స్ ఉన్నాయి. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల స్టీరింగ్ వీల్, రూఫ్-మౌంటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్, వెహికల్ డయాగ్నస్టిక్, రిమోట్ డోర్ లాక్-అన్‌లాక్, డ్రైవర్ మానిటరింగ్ అలర్ట్‌లు వంటివి ఉన్నాయి.

లగ్జరీ కారు కావడంతో టయోటా దీనిలో అధునాతన ప్రమాణాలతో భద్రతా ఫీచర్లను అందించారు. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ప్రీ-కొలిజన్ సేఫ్టీ, లేన్ ట్రేస్ అసిస్ట్, ADAS ఫీచర్లు, చుట్టు ప్రక్కల చూడటానికి 360-డిగ్రీ కెమెరా ఇంకా మరిన్ని సేఫ్టీ ఫీచర్లు, డ్రైవర్లకు సహాయం చేయడానికి ఇతర ముఖ్యమైన సదుపాయాలు కూడా దీనిలో ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, December 14, 2024, 13:49 [IST]
English summary
Toyota vellfire november 2024 sales report details
Read more on: #toyota #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+