ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్

ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'హ్యుందాయ్' (Hyundai) కొన్ని ఎంపిక చేసిన మోడల్స్ మీద ఈ నెలలో అద్భుతమైన బెనిఫిట్స్ అందిస్తోంది. కంపెనీ ఏ కార్ల మీద ఎంత వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది అనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

హ్యుందాయ్ కంపెనీ ఈ నెలలో గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20, ఆరా మరియు వెర్నా వంటి మోడల్స్ కొనుగోలు మీద గరిష్టంగా రూ. 48000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, కార్పొరేట్ బెనిఫిట్స్ మరియు ఎక్స్చేంజ్ బోనస్ వంటివి ఉన్నాయి. ఈ నెలలో కొనుగోలు చేసేవారికి మాత్రమే ఈ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ విషయాన్ని కస్టమర్లు తప్పకుండా గుర్తుంచుకోవాలి.

Hyundai-Discounts-October

హ్యుందాయ్ ఐ20: Hyundai i20 కొనుగోలు మీద రూ.50000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులోని మాన్యువల్ వేరియంట్ మీద రూ.30000, CVT ఆటోమాటిక్ వేరియంట్ మీద రూ.20000 వరకు కస్టమర్లు ఆదా చేసుకోవచ్చు. ఐ20 అనేది స్టైలిష్ ఫ్యామిలీ హ్యాచ్‌బ్యాక్. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ మోడల్ వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇది బాలెనో, ఆల్ట్రోజ్, గ్లాంజా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

హ్యుందాయ్ వెర్నా: ఈ నెలలో Hyundai Verna కొనుగోలు చేసేవారు రూ.35000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ మిడ్ సైజ్ సెడాన్ యొక్క అన్ని వేరియంట్ల మీద ఈ ఆఫర్ పొందవచ్చు. ఈ కారు 115 హార్స్ పవర్ మరియు 143 Nm టార్క్ అందించే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 160 హార్స్ పవర్ మరియు 253 Nm టార్క్ అందించే 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది.

Hyundai-Discounts-October

మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన హ్యుందాయ్ వెర్నా కారు మారుతి సుజుకి కంపెనీ యొక్క సియాజ్, స్కోడా స్లావియా, హోండా సిటీ మరియు ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఇది చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా.. మంచి పనితీరును అందిస్తుంది. కాబట్టి ఇది అన్ని విధాలుగా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్: కస్టమర్లు Hyundai Grand i10 Nios నియోస్ కొనుగోలు మీద రూ. 48000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ డిస్కౌంట్ CNG వేరియంట్ కొనుగోలు మీద మాత్రమే లభిస్తుంది. పెట్రోల్ ఆటోమాటిక్ వేరియంట్ మీద రూ. 28000 వరకు ప్రయోజనాలు, పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ కొనుగోలుపైన రూ. 38000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. గ్రాండ్ ఐ10 నియోస్.. మారుతి స్విఫ్ట్, టాటా టియాగో వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Hyundai-Discounts-October

హ్యుందాయ్ ఆరా (Hyundai Aura): హ్యుందాయ్ ఆరా కొనుగోలుపైన వినియోగదారుడు రూ. 33000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఆరా CNG వేరియంట్ కొనుగోలు మీద రూ. 33000, ఇతర పెట్రోల్ వేరియంట్ల కొనుగోలు మీద రూ. 18000 వరకు తగ్గింపులు లభిస్తాయి. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిం హ్యుందాయ్ ఆరా కారు దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి డిజైర్ మరియు హోండా అమేజ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

గమనిక: హ్యుందాయ్ కంపెనీ అందిస్తున్న ఈ ప్రయోజనాలు ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే డిస్కౌంట్స్ అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా ఎంపిక చేసిన హ్యుందాయ్ కార్లను ఈ నెలలో కొనుగోలు చేస్తే మాత్రమే ఈ డిస్కౌంట్స్ లభిస్తాయి. మరిన్ని ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి సమీపంలోని స్థానిక డీలర్‌ను సంప్రదించవచ్చు.

Hyundai-Discounts-October

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Tuesday, April 23, 2024, 12:49 [IST]
English summary
Up to rs 48000 discount on hyundai cars full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+