మంచి మైలేజీ ఇచ్చే సీఎన్‌జీ కార్లు రాబోతున్నాయి.. లిస్ట్ చూశాక బైక్‌కి బదులు కారు కొనాలనుకుంటారు!
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ ఊపందుకుంటోంది. ప్రపంచంలోనే ఆటోమోబైల్ రంగంలో అత్యంత ప్రసిద్ధి చెందిన భారత్‌లో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాల వైపు జనాలు చూస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో వీటి కొనుగోలుకి జనాలు ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనికి కారణం ఎలక్ట్రిక్ వాహనాలపై జనాలకు పెద్దగా నమ్మకం లేదు. అంతే కాకుండా ఛార్జింగ్ స్టేషన్ల సదుపాయం విరివిగా లేకపోవడం, మంచి రేంజ్ (మైలేజీ) అందించక పోవడంతో వీటిని కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. అంతే కాకుండా భారతీయుల్లో ఎలక్ట్రిక్ వాహనాలు పేలుతున్నాయనే అపోహా కూడా వెంటాడుతోంది. దీంతో ఎలక్ట్రిక్ సేల్స్ ఆశించిన మేర జరగడం లేదు.
అయితే జనాలు సాంప్రదాయ వాహనాలైన పెట్రోల్ లేదా డీజిల్ కార్లను తీసుకుందామంటే ఇంధన ధరలు మండుతున్నాయని వాపోతున్నారు. దీనిని గ్రహించిన కొందరు తెలివైన కస్టమర్లు మాత్రం సీఎన్‌జీ కార్లను కొనుగోలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా బెంగళూరు, ఢిల్లీ, ఇతర మెట్రో నగరాల్లో సీఎన్‌జీ కార్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా తెలుగు రాష్టాల్లోనూ సీఎన్‌జీ కార్లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

సీఎన్‌జీ కార్లు పెట్రోల్ మరియు డీజిల్ మోడళ్ల కంటే ఎక్కువ మైలేజీని అందించడమే ముఖ్య కారణమని చెప్పవచ్చు. అంతే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాల ధరతో పోల్చితే కొద్దిగా ధరలు తక్కువగా ఉండటం వల్ల సీఎన్‌జీ కార్లకు డిమాండ్ పెరుగుతుంది. పెట్రోల్, డీజీల్‌తో పోల్చితే దీని ధర తక్కువగా ఉండటం కూడా ప్రజలను ఆకర్షిస్తోంది. ఎంట్రీ లెవల్ కార్లలో కూడా ఇప్పుడు సీఎన్జీ కిట్ లభిస్తుంది.
ఈ సీఎన్‌జీ కార్లు సీఎన్‌జీతో పాటు పెట్రోల్‌తోనూ నడుస్తాయి. మీ కారులో సీఎన్‌జీ అయిపోగానే ఆటోమేటిక్‌గా పెట్రోల్‌తో కారు నడుస్తుంది. కాబట్టి ఎటువంటి ఆందోళన లేకుండా సాఫీగా ప్రయాణ చేసేందుకు ఇవి బెస్ట్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం దేశంలోని టాప్ బ్రాండ్స్ మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుందాయ్ కంపెనీలు సీఎన్‌జీ కార్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. త్వరలో రాబోయే టాప్ బడ్జెట్ ఫ్రెండ్లీ CNG కార్ల వివరాలు మీకోసం..

మారుతి స్విఫ్ట్ CNG: ఈ స్విఫ్ట్ కారుకి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలతో దీనితో విడదీయలేని సంబంధం ఉంది. ఈ కారు 4th జనరేషన్ తాజాగా విడుదలైంది. దీనిని కొనేందుకు జనాలు షోరూమ్‌ల వద్ద క్యూ కడుతున్నారు. ఈ కారు ఈ ఏడాది పండుగ సీజన్‌లో సీఎన్‌జీ కారుని విడుదల చేయనుంది. ఇది మార్కెట్ రికార్డులను తిరగ రాసే అవకాశం ఉంటుంది.
ఈ సరికొత్త స్విఫ్ట్ కారు 1.2-లీటర్ 3-సిలిండర్ జెడ్ 12E ఇంజిన్‌తో పనిచేస్తుంది. అయితే సీఎన్‌జీ ఇంజిన్ పనితీరులో మార్పులు ఉండే అవకాశం ఉంది. అయితే సీఎన్‌జీ ఇంజిన్ భారీ మైలేజీని అందించనుంది. ప్రస్తుతం స్విఫ్ట్ పెట్రోల్ వెర్షన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో లీటరుకు 24.8 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. అయితే సీఎన్‌జీ వెర్షన్‌లో కిలోకు 30.9 కిలోమీటర్ల మైలేజీని అందించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

టాటా నెక్సాన్ సీఎన్‌జీ: దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సబ్-4 మీటర్ల కాంపాక్ట్ ఎస్‌యూవీగా టాటా నెక్సాన్ ఉంది. ఈ కారు కూడా త్వరలో సీఎన్‌జీ వేరియంట్‌లో రానుంది. 2024 భారత్ మొబిలిటీ షోలో ఈ సీఎన్‌జీ కారుని ఆ సంస్థ ప్రదర్శించింది. త్వరలోనే ఈ కారు లాంచ్ కానుంది. ఇది కిలోకు 25-27 కిలోమీటర్ల మైలేజీని అందించే అవకాశం ఉంది.
మారుతి డిజైర్ CNG: 2024 స్విఫ్ట్ డిజైర్ మోడల్ తాజాగా విడుదల అయ్యింది. అతి త్వరలోనే ఈ కారు కూడా సీఎన్‌జీ వెర్షన్‌లో విడుదల కానుంది. డిజైర్ మాదిరిగానే మంచి మైలేజీని అందించనుంది. ఇక ఫైనల్‌గా హ్యుందాయ్ సంస్థ టాటాకు చెందిన ట్విన్ సిలిండర్ టెక్నాలజీని పోలిన వ్యవస్థతో ఓ కారుని తీసుకురాలని యోచిస్తోంది. దీనిని 'హై-సీఎన్‌జీ' మరియు 'హై-సీఎన్‌జీ డుయో' అని పిలిచే అవకాశం ఉంది.

హ్యుందాయ్ ప్రస్తుతం గ్రాండ్ ఐ10 నియోస్, ఆరా మరియు ఎక్స్‌టర్ అనే మూడు కార్లలో సీఎన్‌జీ వెర్షన్‌ని అందిస్తోంది. బేస్ సీఎన్‌జీ వేరియంట్లు అన్ని హై-సీఎన్‌జీ సింగిల్ సిలిండర్ కిట్లను మరియు ప్రీమియం వేరియంట్లలో హై-సీఎన్‌జీ డుయో ట్విన్ సిలిండర్ కిట్లను అందించే అవకాశం ఉంది. ఏది ఏమైనా రానున్న రోజుల్లో సీఎన్‌జీ కార్లు సేల్స్‌ని పెంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








