బడ్జెట్ రెడీ చేసుకోండి.. ఈ నెలలో రాబోతున్న తోపు కార్లు ఇవే.. జాక్‌పాట్ కొట్టడానికి సిద్ధం కండి!
ఇండియాలో ఈ ఏడాది మార్కెట్లోకి చాలా ఆటోమొబైల్ తయారీ కంపెనీలు కొత్త కొత్త కార్లను విడుదల చేశాయి. వాటిలో చాలా వరకు అమ్మకాల పరంగా మంచి గణాంకాలను నమోదు చేశాయి. ముఖ్యంగా ఇటీవల ముగిసిన పండగ సీజన్ సమయంలో దేశవ్యాప్తంగా కొత్త కార్ల విక్రయాలు బాగా పుంజుకున్నాయి. గత ఏడాది కంటే కూడా ఈ సారి ఆటోమొబైల్ రంగ వృద్ధి సానుకూలంగా కనిపించింది. ఈ నేపథ్యంలో ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడానికి వాహన తయారీ కంపెనీలు డిసెంబర్ నెలలో మరిన్ని కొత్త వాహనాలను మార్కెట్లోకి తీసుకు వస్తున్నాయి. వీటిలో హైబ్రిడ్ మోడళ్లు సైతం ఉన్నాయి. రాబోయే కొత్త ఏడాదిలో ఈ కొత్త కార్లు సందడి చేయడానికి సిద్ధంగా ఉంటాయి. ఇవి వినియోగదారులు అవసరమయ్యే అన్ని రకాల ఫీచర్లతో అడుగుపెట్టబోతున్నాయి.
ఇప్పుడు కొత్త వాహనాల విడుదలతో డిసెంబర్ నెల అమ్మకాల పరంగా పరిశ్రమకు అత్యంత కీలకం. ఎందుకంటే లాంచ్ సమయంలోనే మంచి బుకింగ్స్ వచ్చాయంటే కొత్త ఏడాదిలో కంపెనీలు లభాలను ఆర్జించవచ్చు. అదే తక్కువ బుకింగ్స్ వచ్చాయంటే మాత్రం అంచనాలు తలకిందులు అయి లాభాలపై ఎఫెక్ట్ పడుతుంది. అందుకే ఈ డిసెంబర్ నెలపై వాహన తయారీదారులు ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. వీటి ఫలితాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

ఈ నెలలో మొదటగా కొత్త తరం హోండా అమేజ్‌పై కంపెనీలు భారీ అంచనాలు పెట్టుంది. ఎందుకంటే ఇప్పటికే దీనిలో పాత వెర్షన్ ఇండియాలో మంచి డిమాండ్ ఉన్న కారుగా ఉంది. అందుకే హోండా కొత్త తరాన్ని తీసుకువస్తుంది. ఇది డిసెంబర్ 4న మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. ఈ మోడల్‌కు సంబంధించి విడుదలైన ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. దీని ఇంటీరియర్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది.
కొత్త తరం హోండా అమేజ్ 1.2-లీటర్ ఇంజిన్‌తో 90 PS పవర్, 110 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ లేదా CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. దీని ప్రారంభ ధర రూ.7.19 లక్షలకు కొంచెం పైనే ఉంటుంది. వేరియంట్‌ను బట్టి ధరల్లో కూడా మార్పులు ఉంటాయి. పాత మోడల్ కంటే దీని డిజైన్ మరింత అప్‌డేట్‌గా ఉంది.

ఈ మోడల్ తరువాత డిసెంబర్ 11న టయోటా కంపెనీ నుంచి క్యామ్రీ విడుదల కాబోతుంది. ఇది హైబ్రిడ్ సిస్టంతో వచ్చింది. 2.5-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. దీని ధర ఇండియన్ మార్కెట్లో రూ. 48-49 లక్షలుగా ఉంటుందని తెలుస్తుంది. ఎక్స్‌టీరియర్‌తో పాటు ఇంటీరియర్ డిజైన్ అందంగా ఉంటుంది. హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ కాబట్టి వినియోగదారులను మరింత ఆకట్టుకుంటుంది.
క్యాబిన్ లోపల 12.3-అంగుళాల స్క్రీన్, సౌకర్యవంతమైన సీట్లు, AC వెంటిలేషన్, ప్రయాణికుల భద్రత కోసం ఎయిర్‌బ్యాగులు, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), ఇంకా మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ కార్ల కంటే కూడా హైబ్రిడ్ కార్ల వినియోగం ఇటీవల కాలంలో పెరుగుతున్న తరుణంలో టయోటా క్యామ్రీ రాబోయే కొత్త ఏడాదిలో అందరిని ఆకట్టుకుంటుందని కంపెనీ భావిస్తోంది.
వీటితో పాటు కియా నుంచి కొత్త మోడల్ సిరోస్ suv డిసెంబర్ 19న విడుదల కాబోతుంది. దీని ధర రూ. 8.50-9.50 లక్షల మధ్య ఉంటుందని అంచనా. ఎస్‌యూవీలకు మంచి మార్కెట్ ఉన్న నేపథ్యంలో ఈ కారు కూడా బాగా క్లిక్ అవుతుందని కంపెనీ అంచనాలు పెట్టుకుంది. ఇది 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఇది ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








