పిక్చర్‌ అబి బాకీ హై.. 2024 అర్ధభాగంలో వచ్చే కార్లు వీర లెవల్‌.. ఆ లిస్ట్‌లో కొన్ని మీ కోసం..

ఈ ఏడాది ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన పలు హ్యాచ్‌బ్యాక్‌లు, ఎస్‌యూవీలు భారతీయ మార్కెట్‌లో లాంచ్‌ అయ్యాయి. ప్రస్తుతం ఈ సంవత్సరం అర్ధభాగానికి చేరుకుంది. తొలి అర్ధభాగంలో ఆశించిన కార్లు మార్కెట్‌లోకి రాలేదు. అయితే రెండవ భాగంలో టాటా మోటార్స్, మహీంద్రా, మారుతి సుజుకి మరియు సిట్రోయిన్ కంపెనీల నుంచి ప్రముఖ కార్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్ల కోసం జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా టాటా ఆల్ట్రోజ్‌ రేసర్‌ హ్యాచ్‌బ్యాక్‌, మారుతి సుజుకి డిజైర్‌ సెడాన్‌, మారుతి స్విఫ్ట్‌ సీఎన్‌జీ మరియు మహీంద్రా థార్‌ 5-డోర్‌ కార్లతో పాటు ఇతర కంపెనీల కార్లు విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.

ఇందులో ముఖ్యంగా భారతీయులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కార్లలో టాటా ఆల్ట్రోజ్ రేసర్‌ జూన్‌ 7న విడుదల కానుంది. కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్ 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. ఇందులో 10.25 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్‌ క్లస్టర్, వైర్లెస్ స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్‌ ఛార్జర్, 360 డిగ్రీల సరౌండ్ కెమెరా తదితర ఫీచర్లు ఉండనున్నాయి.

Tata-Altroz-Racer

మారుతి సుజుకి డిజైర్ సెడాన్ కూడా దాదాపు ఈ సంవత్సరం లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గత నెలలో భారత మార్కెట్లోకి వచ్చిన నాల్గవ తరం స్విఫ్ట్ హ్యాచ్ బ్యాక్ మాదిరిగానే ఈ కారు ఫ్రంట్ మరియు డ్యాష్ బోర్డ్ డిజైన్‌ని కలిగి ఉండనుంది. ఇది 1.2-లీటర్, 3-సిలిండర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేయనుంది. ఈ కారు కోసం స్విఫ్ట్‌ లవర్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్‌జీ హ్యాచ్‌బ్యాక్‌ రాబోయే రోజుల్లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సరికొత్త స్విఫ్ట్ హ్యాచ్ బ్యాక్ ధర రూ.6.49 లక్షల నుంచి రూ.9.64 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) ఉంది. కానీ సీఎన్‌జీ వెర్షన్ ధర సుమారు రూ. 90,000 నుంచి రూ .95,000 ఎక్కువ ఖరీదు ఉండే అవకాశం ఉంది.

Maruti-Suzuki-Swift

వీటితో పాటు హ్యుందాయ్ క్రెటా ఈవీ ఈ ఏడాది చివర్లో లాంచ్ కానుంది. ఇది 2025 ప్రారంభంలో అమ్మకానికి రానుంది. ఇది ICE ఇంజిన్‌ కంటే కాస్త భిన్నంగా ఉండనుంది. దీనిలో వచ్చే 45 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ సుమారు 250 కిలోమీటర్ల పరిధిని అందించనుంది. టాటా నుంచి కూడా నెక్సాన్ తరహాలోనే కర్వ్‌ ఈవీ విడుదల కానుంది. ఇది 450-500 కిలోమీటర్ల పరిధిని అందించనుంది.

హ్యుందాయ్ ఆల్కాజర్ ఫేస్ లిఫ్ట్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో విడుదల కానుంది. ఇది కొత్త క్రెటాను పోలి ఉండనుంది. ఇందులో రెండు కనెక్టెడ్ డిజిటల్ డిస్ప్లేలు, ఎడిఎఎస్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్‌తో పాటు కొత్త డ్యాష్‌బోర్డ్‌ని గమనించవచ్చు. దీనితో పాటు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మహీంద్రా థార్ 5-డోర్ ఎస్‌యూవీ ఈ ఏడాది చివరి నాటికి, సిట్రోయెన్ బసాల్ట్ వచ్చే నెలలో అందుబాటులోకి రానుంది.

Hyundai-Alcazar-Facelift

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, June 3, 2024, 18:51 [IST]
English summary
Upcoming car launches in 2024 2nd half tata altroz race to mahindra thar 5 door
Read more on: #auto news #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+