కార్లు కొనడానికి ‘సరిపోదా సెప్టెంబర్’.. వచ్చే నెలలో విడుదలయ్యే కార్లు మీకు బెస్ట్ ఆప్షన్
ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఆశించిన స్థాయిలో కార్లు విడుదల కాలేదు. ఈ సంవత్సరం ద్వితీయ భాగం నుంచి కొత్త కార్ల విడుదల కాస్త ఊపందుకుంది. ఈ నెల ఆగస్టులో దేశంలో చాలా కొత్త, అప్‌గ్రేడ్ కారు మోడళ్లు విడుదలయ్యాయి. అదేవిధంగా సెప్టెంబర్ నెలలో కొన్ని కొత్త కారు మోడళ్లను లాంచ్ చేయనున్నారు. ఈ నెలలో విడుదల అయ్యే కార్లు కస్టమర్లను ఆకట్టుకునే అవకాశం ఉంది. ఈ పండుగ సీజన్‌ని టార్గెట్ చేస్తూ కొత్త కార్లను తీసుకురానున్నారు. ఏ కార్ మోడళ్లు ఏ తేదీన లాంచ్ అవుతాయి? వాటి ప్రత్యేకతలు ఏమిటి? అలాగే ఆ కార్లను మనం ఎంత ధరకు ఆశించవచ్చు? వంటి వివరాలను ఈ స్టోరీలో చూడబోతున్నాం.
టాటా కర్వ్ (Tata Curvv): టాటా ఇటీవల ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కారు మోడల్‌ని ఆగస్టు 07న విడుదల చేసింది. ఈవీ విడుదల సమయంలో ఇంధన ఆధారిత వెర్షన్‌ని (ICE) సెప్టెంబర్‌లో విడుదల చేయనున్నట్లు లాంచ్ సమయంలో ప్రకటించారు. ఈ కారు సెప్టెంబర్ 2న టాటా కర్వ్ లాంచ్ కానుంది. ఇది కూడా లుక్‌లో కర్వ్ EV, కర్వ్ ఒకేలా ఉంటాయి.

ఈ కారు రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తుంది. ఇవి 1.2-లీటర్, 3-సిలిండర్ టర్బోఛార్జ్డ్ ఇంజిన్, 1.2-లీటర్, 3-సిలిండర్, T-GDi ఇంజిన్‌తో పనిచేస్తాయి. ఇది కాకుండా ఈ కారులో 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ కూడా ఉంటుందని భావిస్తున్నారు. అదే రోజు ధరను కూడా ప్రకటించనున్నారు. దీని ధర రూ.10 లక్షల లోపు ఉండొచ్చని అంచనా.
హ్యుందాయ్ అల్కాజర్: హ్యుందాయ్ నుంచి రానున్న అతిపెద్ద ఎస్‌యూవీ ఇది. ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉన్నవారి వారి నుంచి దీనికి మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది. ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ని సెప్టెంబర్ 9న ఈ కారు లాంచ్ చేయనుంది. ఈ అప్‌డేట్ కింద ఈ కారు పలు కొత్త ఫీచర్లను అందించవచ్చు. కొత్త అల్కాజార్ డిజైన్ ఆకర్షణీయంగా ఉండనుంది.

ఇది కాకుండా, ఈ కారు మోడల్లో కొన్ని కొత్త రకాల టెక్నాలజీ కూడా ఉందని చెబుతున్నారు. లెవల్ 2 ఏడీఏఎస్ టెక్నాలజీతో పాటు రెండు 10.25 అంగుళాల స్క్రీన్లు, పనోరమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉంటాయి. అంతే కాకుండా వైర్‌లెస్ ఛార్జర్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు ఇతర ఫీచర్లు. ఇంజిన్ విషయంలో ఎలాంటి మార్పులు లేవు.
ఎంజీ విండ్సర్ ఈవీ: ఎంజీ విండ్సర్ ఈవీ JSW అనే భారతీయ కంపెనీతో దేశంలో పనిచేయడం ప్రారంభించింది. దేశంలో ఒక కొత్త ఉత్పత్తిని విడుదల చేయనుంది. దీని ఆధారంగా విండ్సర్ అనే కొత్త ఎలక్ట్రిక్ కారును త్వరలో భారతదేశంలో విడుదల చేయనుంది. సెప్టెంబర్ 11న లాంచ్ కానుంది. ఈ కారు మోడల్ ఇప్పటికే ఇండోనేషియాలో అందుబాటులో ఉంది.

ఈ కారు ధర రూ. 15 లక్షల నుంచి రూ. రూ.20 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీని ధరలు, స్పెసిఫికేషన్లను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇది భారీ సన్‌రూఫ్‌ని కలిగి ఉంటుందని ధృవీకరించబడింది. ప్రయాణీకులకే కాకుండా మరిన్ని సరుకులను రవాణా చేసే ఉత్పత్తిగా ఎంజీ దీన్ని తయారు చేసిందని చెబుతున్నారు.
మారుతి డిజైర్: మారుతి సుజుకి డిజైర్ కార్ నెక్ట్స్ జనరేష్ వెర్షన్ వచ్చే నెలలో రానుంది. భారతీయుల ఆసక్తిగా ఎదురు చూస్తున్న కార్లలో ఇది ఒకటిగా ఉంది. కొత్త తరం స్విఫ్ట్ ఇటీవల భారతదేశంలో అనేక కొత్త ఫీచర్లు, మైలేజీతో లాంచ్ అయింది. అదే విధంగా కొత్త డిజైర్ కూడా చాలా ఫీచర్లు, బెస్ట్ మైలేజీ ఉండే అవకాశం ఉంది.

అయితే ఏ తేదీని ఖరారు చేశారనే దానిపై స్పష్టత లేదు. తేదీకి సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఇది 1.2-లీటర్, 3-సిలిండర్, ఇ సిరీస్ ఇంజిన్‌తో పనిచేస్తుందని భావిస్తున్నారు. ఇదే ఇంజిన్‌ని కొత్త స్విఫ్ట్‌లో ఉపయోగించడం గమనార్హం. భారతదేశంలో పైన చూసిన అన్ని కార్ మోడళ్లపై చాలా అంచనాలు ఉన్నాయి. మరి వీటికి ఆశించిన స్థాయిలో ఆదరణ లభిస్తుందో లేదో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications








