లాంచ్‍కు సిద్దమవుతున్న కార్లు ఇవే.. కొత్త కారు కొనాలనుకునే వారికి పండగే!

2024 ప్రారంభం నుంచి చాలా వాహనాలు భారతీయ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. వచ్చే నెలలో (ఏప్రిల్) కూడా దేశీయ విఫణిలో అడుగు పెట్టడానికి మరికొన్ని కార్లు సిద్ధంగా ఉన్నాయి. ఆ కార్ల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

టయోటా అర్బన్ క్రూయిజర్ టైసర్

ఏప్రిల్ నెలలో విడుదల కావడానికి సిద్దమవుతున్న కార్ల జాబితాలో 'టయోటా అర్బన్ క్రూయిజర్ టైసర్' ఒకటి. ఇది మారుతి సుజుకి ఫ్రాంక్స్ నుంచి ప్రేరణ పొందిన కాంపాక్ట్ SUV. రెండు కంపెనీల (టయోటా మరియు మారుతి సుజుకి) సహకారంతో దేశీయ మార్కెట్లో విడుదలకానున్న నాలుగవ మోడల్ ఈ టైసర్. ఇది ఏప్రిల్ 3న ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది.

Toyota Urban

కొత్త టయోటా అర్బన్ క్రూయిజర్ టైసర్ కొత్త గ్రిల్, బంపర్ మరియు అల్లాయ్ వీల్స్ వంటి వాటిలో విలక్షణమైన మార్పులను పొందుతుందని సమాచారం. ఇది 1.0 లీటర్ బూస్టర్‌జెట్ టర్బో పెట్రోల్ మరియు 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందనుంది. ఇది మార్కెట్లో టాటా పంచ్ మరియు హ్యుందాయ్ ఎక్స్‌టర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

మహీంద్రా ఎక్స్‌యువీ300 ఫేస్‌లిఫ్ట్

దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా యొక్క ఎక్స్‌యువీ300 కూడా ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇది రిఫ్రెష్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, రీడిజైన్ గ్రిల్, అప్డేటెడ్ అల్లాయ్ వీల్స్ వంటివి మాత్రమే కాకుండా పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటిని పొందుతుంది. ఇది వచ్చే నెలలో ఎప్పుడు లాంచ్ అవుతుందనేది ఇంకా వెల్లడి కాలేదు.

2024 Maruti Suzuki Swift

మారుతి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు ఎక్కువమంది ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తున్న మారుతి స్విఫ్ట్ త్వరలోనే ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ మంచి డిజైన్ మరియు అత్యాధునిక టెక్నాలజీ పొందనున్నట్లు సమాచారం. కావున ఇది కూడా స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే తప్పకుండా వాహన వినియోగదారులను ఆకర్శించడంలో విజయం పొందుతుందని సమాచారం.

కొత్త మారుతి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 82 Bhp పవర్ మరియు 112 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మరింత మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందించడానికి సెల్ఫ్ ఛార్జింగ్ 12వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టం పొందుతుంది. వాహన వినియోగదారులకు మెరుగైన భద్రతను అందించడానికి కంపెనీ ఈ కారులో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌ (ADAS) అందించే అవకాశం ఉంది.

Tata Altroz Racer

టాటా ఆల్ట్రోజ్ రేసర్

అత్యంత సురక్షితమైన కార్లను అందించే టాటా మోటార్స్ కంపెనీ కూడా వచ్చే నెలలో కొత్త ఆల్ట్రోజ్ రేసర్ అనే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆవిష్కరించడానికి సిద్ధమవుతోంది. గత ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడిన ఈ కొత్త కారు 1.2 లీటర్ టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 120 Bhp పవర్ మరియు 170 Nm టార్క్ అందిస్తుంది.

మంచి డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ ఈ టాటా ఆల్ట్రోజ్ రేసర్ కారులో కూడా ఉండనున్నాయి. ఇది బోల్డ్ గ్రాఫిక్స్ మరియు స్పోర్టి బకెట్ సీట్లతో సహా అనేక విలక్షణమైన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే మాత్రమే కాకుండా అధునాతన ఇన్ఫోటైన్‌మెంట్ వంటి వాటితో అనేక అప్‌గ్రేడ్‌లను పొందనుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

స్కోడా సూపర్బ్

చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ స్కోడా కూడా వచ్చే నెలలో తన 'సూపర్బ్' లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది ఏప్రిల్ 3న ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కొత్త మోడల్ 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి 189 Bhp పవర్ మరియు 320 Nm టార్క్ అందిస్తుంది. ఈ సెడాన్ కంప్లీట్ బిల్డ్ యూనిట్(CBU) మార్గం ద్వారా దేశీయ మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, March 30, 2024, 16:00 [IST]
English summary
Upcoming cars debut in 2024 april from toyota urban cruiser taisor to tata altroz racer
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+