ట్రెండ్‌కు తగ్గట్టుగా వచ్చేస్తున్నాయ్!.. ఇదిగో కొత్త కార్లు
ఇండియన్ మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు డిమాండ్ బాగా ఉంది. దీంతో పోటీ కూడా విపరీతంగా పెరిగింది. ఈ విభాగంలో టాటా పంచ్ ఈవీ నాయకత్వం వహిస్తోంది. ఇక బ్రెజ్జా మరియు నెక్సాన్ వంటివి కూడా ఆయా విభాగంలో ప్రసిద్ధి చెందాయి. కాగా మార్కెట్లో పలు కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను లాంచ్ చేస్తున్నాయి, లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. మార్కెట్లో లాంచ్ కావడానికి సిద్దమైన కార్లలో హ్యుందాయ్ ఇన్‌స్టర్, కియా క్లావిస్ మరియు స్కోడా యొక్క కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
హ్యుందాయ్ ఇన్‌స్టర్
దేశీయ విఫణిలో అధిక ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ కొత్త ఇన్‌స్టర్ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనుంది. కంపెనీ ఈ కారును 2026లో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టనున్న ఈ కారు మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందనుంది. ఇందులో 10.25 ఇంచెస్ డిజిటల్ డిస్‌ప్లేలు, వైర్‌లెస్ ఛార్జింగ్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్ సెటప్ వంటివి ఉండనున్నాయి.

హ్యుందాయ్ ఇన్‌స్టర్ డిజిటల్ కీ 2 టచ్ ఫంక్షనాలిటీని అందిస్తుంది. ఇది రెండు బ్యాటరీ ప్యాక్స్ పొందనున్నట్లు సమాచారం. ఇందులో ఒకటి 95 హార్స్ పవర్ ఉత్పత్తి చేసే 42కిలోవాట్ బ్యాటరీ, మరొకటి 113 హార్స్ పవర్ అందించే 49కిలోవాట్ బ్యాటరీ ప్యాక్. ఇది ఒక సింగిల్ చార్జితో 355కిమీ రేంజ్ అందిస్తుంది. అయితే విడుదలకు సిద్దమవుతున్న ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.
కియా క్లావిస్
కియా మోటార్స్ కూడా మార్కెట్లో క్లావిస్ ఎస్‌యూవీని లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది. ఇప్పటికే పలుమార్లు టెస్టింగ్ దశలో కనిపించిన ఈ కారు ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది దేశీయ విఫణిలో లాంచ్ అయిన తరువాత కియా సోనెట్, సెల్టోస్ మధ్య ఉంటుంది. ఈ కారు పరిమాణంలో కొంత పొడవుగా ఉంటుందని తెలుస్తోంది.

కియా క్లావిస్ కేవలం ఇంటర్నల్ కంభూషణ్ ఇంజిన్ మాత్రమే పొందుతుంది. ఇది రెండు వేరియంట్లలో లభించే అవకాశం ఉంది. మొదటి ఇంజిన్ 1.0 లీటర్ టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్. ఇది 118 Bhp పవర్ మరియు 172 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ ఐఎంటీ లేదా 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.
రెండో వేరియంట్ విషయానికి వస్తే.. ఇది 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుందని తెలుస్తోంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6 స్పీడ్ స్పీడ్ టార్క్ కన్వర్టర్‌తో జతచేయబడి ఉంటుంది. కాబట్టి ఇది తప్పకుండా మంచి పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

స్కోడా న్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీ
చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ స్కోడా కూడా కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కారు నెక్సాన్ మరియు బ్రెజ్జా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ లైట్, టైల్‌లైట్ మరియు రూప్ రైల్స్ వంటివి ఉంటాయి. ఈ కారులో 1.0-లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 113 Bhp పవర్ మరియు 172 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








