రూ. 10 లక్షల లోపు ధరలో విడుదల కాబోతున్న ప్రముఖ బ్రాండ్ల కార్లు ఇవే..
రూ. 10 లక్షల లోపు కొత్త కారు కొనాలనుకునేవారికి ఇక్కడ అదిరిపోయే న్యూస్ అందిస్తున్నాం. త్వరలో భారత మార్కెట్లోకి బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు విడుదల(Upcoming Compact SUVs) కాబోతున్నాయి. వచ్చే ఏడాది ప్రముఖ బ్రాండ్లు హ్యుందాయ్, కియా మరియు స్కోడా వంటి సంస్థల నుంచి రాబోతున్న మూడు కాంపాక్ట్ SUV ల వివరాలు ఈ కథనంలో..
దేశీయ ఆటోమొబైల్ రంగంలో కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో తీవ్ర పోటీ నెలకొంది. ఫ్యామిలీ కస్టమర్లు ఎక్కువగా కాంపాక్ట్ ఎస్‌యూవీలకే ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రముఖ బ్రాండ్ల నుంచి కొత్త మోడళ్లు విడుదల అవతున్నాయి. ఈ ఏడాది మహీంద్రా XUV300 ఫేస్‌లిఫ్ట్ మరియు ఇతర కొత్త మోడళ్లు లాంచ్ కాబోతున్నాయి. ఈ క్రమంలో 2025 లో హ్యుందాయ్, కియా మరియు స్కోడా నుంచి కొత్త సబ్-4-మీటర్ SUVలు విడుదల కానున్నాయి.

1. స్కోడా కాంపాక్ట్ SUV: భారతీయ మార్కెట్లో స్కోడా తన ఎంట్రీ-లెవెల్ కాంపాక్ట్ SUV(Skoda Compact SUV)ని వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది. MQB A0 IN ప్లాట్‌ఫారమ్ ద్వారా, ఇది కుషాక్ మిడ్ లెవెల్ SUVతో అనేక ఫీచర్లను పంచుకుంటుంది. ఈ SUV 1.0L 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. ఇది మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో అందుబాటులోకి రానుంది.
2. నెక్స్ట్-జెన్ హ్యుందాయ్ వెన్యూ: భారత్‌లో ప్రముఖ బ్రాండ్ హ్యుందాయ్ మోటార్స్ నుంచి వచ్చే ఏడాది రెండవ తరం హ్యుందాయ్ వెన్యూ(Next Gen Hyundai Venue) పరిచయం కానుంది. ఇది హ్యుందాయ్ ఎక్స్‌టర్ మైక్రో ఎస్‌యూవీ కంటే ఎక్కువ ఫీచర్లు, స్పెక్స్‌తో విడుదల కానున్నట్లు సంస్థ తెలిపింది. ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ పరంగా అనేక మార్పులను ఆశించవచ్చు.

ప్రస్తుతం భారత మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూకి మంచి ఆదరణ ఉంది. హ్యుందాయ్ మోటార్ సేల్స్‌లో వెన్యూ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో హ్యుందాయ్ ప్రస్తుత ఇంజిన్ లైనప్‌ను కొనసాగిస్తూనే రానున్న మోడల్ మరింత ప్రీమియం మరియు ఫీచర్-రిచ్ క్యాబిన్‌తో మరింత మెరుగ్గా రాబోతుందని సమాచారం. టాటా నెక్సాన్, కియా సోనెట్, మారుతి సుజుకి బ్రెజ్జా, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ ట్రైబర్ మొదలైన మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.
3. కియా క్లావిస్ (AY): దక్షిణ కొరియన్ ప్రముఖ బ్రాండ్ కియా మోటార్స్ నుంచి రాబోతున్న ప్రముఖ మోడల్ కియా క్లావిస్ AY(Kia Clavis AY). దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ కోసం అనుగుణంగా ఈ కొత్త ఎస్‌యూవీని సంస్థ అభివృద్ధి చేస్తోంది. బోల్డ్ స్టైలింగ్‌తో పాటు, అత్యాధునిక ఫీచర్లతో కియా క్లావిస్ AY లాంచ్ కానుంది.

అయితే ఇందులో 4WD కాన్ఫిగరేషన్ లేకపోవడంతో.. దీని టాప్ స్పెక్ ఆఫ్-రోడ్ సామర్థ్యాలను కలిగి ఉండకపోవచ్చని తెలుస్తోంది. భారత మార్కెట్లోకి వచ్చే ముందు 2025 ప్రారంభంలో ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ గ్లోబల్ అరంగేట్రం అయ్యే సూచనలు ఉన్నాయి. ఇందులో IC-ఇంజిన్, హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ వెర్షన్‌లు ఉండొచ్చని తెలుస్తోంది. 5 సీటర్‌తో ఈ కారు ఇప్పటికే భారత్‌తో పాటు కొరియన్ రోడ్లపై టెస్టింగ్ చేశారు.


Click it and Unblock the Notifications








