ఎలక్ట్రిక్‌ కారు కొనాలని చూస్తున్నారా.??.. త్వరలో విడుదల కానున్న టాప్‌ కంపెనీల ఈవీలు ఇవే.!!

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. త్వరలో ఐసీఈ వాహనాలకు దీటుగా ఈవీలు మార్కెట్‌ను శాసించే అవకాశం ఉంటుందని ఆటో నిపుణులు భావిస్తున్నారు. టాటా, మహీంద్రా వంటి భారతీయ కంపెనీలతో సహా ఇతర ప్రముఖ కంపెనీలు ఎలక్ట్రిక్‌ కార్ల(Electric Cars) తయారీపై దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది భారత మార్కెట్లో విడుదల కాబోతున్న కొత్త కార్లేంటో తెలుసా..

టాటా పంచ్ EV: భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన కార్ మోడల్ పంచ్. కారు పాపులారిటీని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో, టాటా ఇటీవల భారతదేశంలో పంచ్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను పరిచయం చేసింది. ధర రూ. 11 లక్షలుగా ఉంది. బుకింగ్‌లు ప్రారంభం కాగా.. అధికారికంగా ఈ కారు త్వరలో విడుదల కానుంది. బడ్జెట్‌ ఫ్రెండ్లీగా.. ఫుల్‌ ఛార్జింగ్‌తో 315 కి.మీ నుంచి 421 కి.మీ రేంజ్‌ ఇవ్వనుంది.

Suzuki-eVX

మారుతి సుజుకి EVX (Maruti Suzuki eVX): మారుతి నుంచి రాబోతున్న మొదటి ఎలక్ట్రిక్‌ కారు ఇదే.. కంపెనీ ఇప్పటికే ఈ కారు కాన్సెప్ట్‌ను మార్కెట్లో పరిచయం చేసింది. దీని అధికారిక లాంచ్ ఈ ఏడాది చివరి నాటికి జరుగుతుందని అంచనా. పూర్తి ఛార్జింగ్ పై 550 కి.మీల వరకు ప్రయాణించేలా.. ఇందులో 60kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు.

BYD-Seal-EV

BYD సీల్ EV: చైనీస్ కంపెనీ BYD నుంచి భారత మార్కెట్లో మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న మూడవ ఎలక్ట్రిక్‌ కారు ఇదే.. ఈ సెడాన్‌ను BYD ఇప్పటికే టెస్ట్ రన్‌ను భారత్‌లో నిర్వహించింది. పూర్తి ఛార్జింగ్‌పై 700 కి.మీల రేంజ్‌ను అందించేలా రూపొందించారు. రెండు విభిన్న బ్యాటరీ ప్యాక్‌లలో మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం.

మహీంద్రా XUV300 EV (Mahindra XUV300 EV) మరియు మహీంద్రా XUV.e8 (Mahindra XUV.e8): మహీంద్రా నుంచి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఒకే ఒక్క ఎలక్ట్రిక్‌ కారు.. మహీంద్రా XUV400 EV. ఇటీవల దాని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను సంస్థ విడుదల చేసింది. ఈ దశలో తన ఎలక్ట్రిక్‌ కార్‌ సెగ్మెంట్‌లో XUV300 EV మరియు XUV.E8 మోడల్‌లను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది.

Mahindra-XUV-300

ఈ రెండింటినీ ఈ ఏడాదిలోనే స్వల్ప వ్యవధిలో ప్రవేశపెట్టాలని సంస్థ భావిస్తోంది. ఈ రెండింటిలో, XUV300EV కొంచెం చౌకైన ఎలక్ట్రిక్ కారు కాగా XUVE8 కొంచెం ఖరీదైనదిగా సమాచారం. రెండు కార్లు రేంజ్ మరియు ధర పరంగా భారీ వ్యత్యాసంతో విడుదల కానున్నాయి. ఒకటి 350 కి.మీ కంటే తక్కువ రేంజ్‌ను అందిస్తుండగా.. మరొకటి 450 కి.మీ కంటే ఎక్కువ రేంజ్‌తో రానుంది.

టాటా హారియర్ EV, సఫారి EV మరియు Curvv: భారతీయ ఎలక్ట్రిక్‌ కార్ల సెగ్మెంట్‌లో టాటా మోటార్స్‌ ఇప్పటికే అగ్రగామిగా ఉంది. ప్రస్తుతం సంస్థ నాలుగు ఎలక్ట్రిక్‌ కార్లను విక్రయిస్తోంది. త్వరలో కంపెనీ తన ప్రసిద్ధ కార్ల మోడల్స్ అయిన హారియర్ మరియు సఫారీ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌లను ప్రవేశపెట్టనుంది.

Tata-Curvv-EV

ఇది కాకుండా, ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కర్వ్(Tata Curvv EV) అనే కొత్త మోడల్‌ను కూడా విడుదల చేయాలని టాటా మోటార్స్‌ యోచిస్తోంది. కాగా ఈ కర్వ్ ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ వెర్షన్‌లోనే కాకుండా ICE ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉంటుందని టాటా మోటార్స్‌ వెల్లడించింది.

More from DriveSpark

Article Published On: Monday, February 19, 2024, 8:55 [IST]
English summary
Upcoming electric cars launch list in india tata punch ev evx byd mahindra xuv300 etc
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+