ఎలక్ట్రిక్ కారు కొనేవారికి గుడ్‌న్యూస్.. త్వరలో సరికొత్త హ్యాచ్‌బ్యాక్‌ల జాతర.. స్పెషాలిటీస్ ఇవే.!!
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా కస్టమర్లు ఈవీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కాగా మార్కెట్లో ఎలక్ట్రిక్ టూ వీలర్లకు డిమాండ్ అధికంగా ఉండగా.. ఈవీ సెగ్మెంట్‌లో కార్లు కూడా మెల్లగా ఆదరణ పొందుతున్నాయి. ఈ క్రమంలో మీరు కొత్త ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలనుకుంటే త్వరలో విడుదల కానున్న హ్యాచ్‌బ్యాక్‌ల వివరాలు అందిస్తున్నాం..
చిన్న ఫ్యామిలీ ఉన్న వారు ఎక్కువగా తమ బడ్జెట్ ధరలో అందుబాటులో ఉండే హ్యాచ్‌బ్యాక్(Upcoming Electric Hatchbacks)లకు ప్రాధాన్యత ఇస్తారు. త్వరలో స్టైలిష్ Tata Altroz.ev, బడ్జెట్-ఫ్రెండ్లీ రెనాల్ట్ క్విడ్ EV మరియు సరికొత్త మారుతి సుజుకి ఎలక్ట్రిక్ వంటి అద్భుతమైన హ్యాచ్‌బ్యాక్‌లు కస్టమర్ల మనసు దోచుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ కాంపాక్ట్, ప్రాక్టికల్, ఎకో ఫ్రెండ్లీ కార్ల వివరాలు తెలుసుకుందాం..

టాటా ఆల్ట్రోజ్ EV: దేశీయ ఆటోమొబైల్ తయారీదారు టాటా మోటార్స్ నుంచి త్వరలో రాబోతున్న సరికొత్త హ్యాచ్‌బ్యాక్ Tata Altroz.ev. స్టైలిష్ మరియు ఫీచర్-ప్యాక్డ్‌గా 2025 లో ఎలక్చ్రిక్ కారు విడుదల కానుంది. టాట పంచ్ ఎలక్ట్రిక్ వెర్షన్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఈ కారును రూపొందిస్తున్నారు. విశాలమైన క్యాబిన్, ప్రీమియం ఫీచర్లు, అధునాతన సౌకర్యాలతో టాటా ఆల్ట్రోజ్ ఈవీ రానుంది.
టాటా ఆల్ట్రోజ్ ఈవీలో రెండు బ్యాటరీ ప్యాక్‌లు 25 kWh, 35 kWh ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. బ్యాటరీ ప్యాక్‌ను బట్టి 300 నుంచి 420 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. సుమారు 120 bhp గరిష్ఠ అవుట్‌పుట్‌ను కలిగి ఉంటుంది. సరసమైన ధరలో, స్పోర్టీ లుక్‌తో కారు ప్రియులను ఆకట్టుకునేందుకు Altroz EV సిద్ధంగా ఉంది.

రెనాల్ట్ క్విడ్ EV: భారత మార్కెట్లో నిత్యం ప్రజాదరణ కలిగి ఉన్న మోడల్ రెనాల్ట్ క్విడ్. భారతీయులకు బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్న ఈ మోడల్.. త్వరలో ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అందుబాటులోకి రానుంది. విదేశీ మోడల్ Dacia స్ప్రింగ్ ఈవీ ఆధారంగా దీనిని రూపొందిస్తున్నారు. Renault Kwid EV లో 26.8 kwh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. రేంజ్ 230 కి.మీ.
బ్యాటరీ ప్యాక్, రేంజ్ తక్కువగా ఉన్నప్పటికీ.. తక్కువ ధర, DC ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్లతో కస్టమర్లను ఆకట్టుకుంటుందని ఆటో నిపుణులు భావిస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీ రైడింగ్ కోసం చూస్తున్న నగరవాసులకు క్విడ్ ఈవీ సరైన ఎంపిక. మార్కెట్లోకి విడుదలైన తర్వాత.. Tata Tiago.ev మరియు MG కామెట్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

మారుతి సుజుకి ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్(Maruti Suzuki Electric Hatchback): సామాన్యులకు అందుబాటు ధరలో ఉండే ప్రముఖ కంపెనీ మారుతి సుజుకి నుంచి త్వరలో ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ రానుంది. 2025 లో ప్రముఖ ఆటో బ్రాండ్లు సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయనున్నాయి. వాటిలో మారుతి సుజుకి నుంచి ఒకటి రాబోతుంది.
బర్న్-EV ప్లాట్‌ఫామ్(Burn-EV) ఆధారంగా ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్(Suzuki eWX Concept)ను మారుతి సుజుకి రూపొందిస్తోంది. ఇందులో వివిధ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను ప్రవేశపెట్టనుంది. భారత్‌లో మారుతి సుజుకి బ్రాండ్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో సర్వీస్ నెట్‌వర్క్స్ ఉన్నాయి. తద్వారా రాబోయే ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ టాటా మోటార్స్‌కు గట్టి పోటీనిస్తుందని ఆటో నిపుణులు భావిస్తున్నారు.
రాబోయే సంవత్సరంలో మార్కెట్లోకి విడుదల కానున్న ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ల గురించి ఇంకా పూర్తి సమాచారం త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఈ కార్ల ధరలపై అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఆధునిక ఫీచర్లు, అధునాతన టెక్నాలజీతో ఫ్యామిలీ కార్లుగా రానున్న ఈ కార్ల గురించి పూర్తి సమాచారం కోసం మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే..


Click it and Unblock the Notifications








