కొత్త ఏడాదిలో కియా నుంచి క్రేజీ కార్లు.. పెద్ద స్కెచ్ వేసిందిగా.. అన్ని అదిరిపోయే మోడల్సే!

భారత ఆటోమొబైల్ రంగం 2024 ఏడాదిలో మంచి వృద్ధిని కనబరిచింది. ప్రపంచ దేశాల కంటే కూడా ఇండియాలో వాహన మార్కెట్ సానుకూలంగా ఉండటంతో ఇప్పటికే దేశీయంగా ఉన్న కంపెనీలకు అదనంగా విదేశీ సంస్థలు తమ కార్లను ఇక్కడి మార్కెట్లోకి లాంచ్ చేసి అమ్మకాల పరంగా మెరుగైన గణాంకాలను నమోదు చేశాయి. ఏడాది ప్రారంభం నుంచి డిసెంబర్ ముగింపు వరకు కూడా ఈ పరిశ్రమ గత ఏడాది కంటే మంచి లాభాలను చూసింది. అయితే ఇప్పుడు మరికొద్ది రోజుల్లో ఈ ఏడాది ముగియనుంది. త్వరలోనే 2025 కొత్త ఏడాది ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పాత ఏడాది కంటే కొత్త ఏడాదిలో మరిన్ని లాభాలను ఆర్జించడానికి కార్ల తయారీ కంపెనీలు కొత్త మోడళ్లను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.

ఇదిలా ఉంటే దక్షిణ కొరియాకు చెందినటువంటి కియా మోటార్స్ ఇండియా గత కొంత కాలంగా ఇండియాలో మంచి మార్కెట్‌ను సంపాదించుకుంది. దేశయంగా అడుగుపెట్టింది కొన్నేళ్ల క్రితం అయినప్పటికి కియా ఇండియా మార్కెట్లో ఇతర కంపెనీలకు గట్టిపోటీని ఇస్తూ, ఆటోమొబైల్ రంగంలో గణనీయమైన వాటాను సంపాదిస్తుంది. 2024లో కూడా కియా కార్లు ఎక్కువగానే అమ్ముడుపోయాయి.

upcoming kia car carens facelift in 2025

ఇదే క్రమంలో కంపెనీ రాబోయే కొత్త ఏడాదిలో కూడా ఇండియా మార్కెట్లో మరింత పట్టు సాధించడానికి పలు కార్లను విడుదల చేయడానికి సిద్ధమైంది. వీటి ద్వారా దేశీయంగా మొత్తం కార్ల విక్రయాల గణంకాలను పెంచుకోవాలని చూస్తుంది. 2025 ఏడాదిని మరింత ఉత్తేజకరం చేయడానికి కియా ఎంతో ఆతృతగా ఉంది. 2025లో కియా కేరెన్స్ EV, కేరెన్స్ ఫేస్ లిఫ్ట్, EV6 ఫేస్‌లిఫ్ట్, సోనెట్ EV వంటి కార్లు విడుదల కాబోతున్నాయి.

Kia Sonet EV: ఈవీ కార్లకు ఇండియా మార్కెట్ గమ్యస్థానంగా మారుతుంది. దీంతో కియా సాధారణ ఇంధన వాహనాలతో పాటు ఈవీలను కూడా తీసుకురావాలని చూస్తుంది. అందుకే కంపెనీ సోనెట్ ఈవీని కొత్త ఏడాదిలో తీసుకొస్తుంది. ఈ కారు డిజైన్ చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈవీలకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో దీని అమ్మకాలు ఎక్కువగానే ఉంటాయని అంచనా.

upcoming kia cars ev carens facelift ev6 in 2025

Kia Carens EV: కియా కేరెన్స్ ఈవీ కొత్త ఏడాది మార్కెట్లో సందడి చేయడానికి రాబోతుంది. ఈ కారును కంపెనీ ఇటీవల రోడ్లపై టెస్టింగ్ కూడా చేసింది. దీన్ని 2025 ప్రారంభంలోనే విడుదల చేసే అవకాశం ఉంది. ఇది 45 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉండవచ్నని తెలుస్తుంది. ఒకే ఎలక్ట్రిక్ మోటార్‌ కూడా ఉండనుంది. కారు సింగిల్ ఛార్జ్‌పై ఈ కారు 500 కి.మీ ప్రయాణించే అవకాశం ఉంది.

Kia Carens facelift:ఈ ఫేస్‌లిఫ్ట్ కూడా కొత్త ఏడాది మొదటి రెండు నెలల్లోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని డిజైన్ వినియోగదారులను కట్టిపడేసేలా ఉంది. ముందు బంపర్‌, ఎక్స్‌టీరియర్ డిజైన్ చాలా అద్బుతంగా ఉంటాయని ఫొటోలను చూస్తే తెలుస్తుంది. ముఖ్యంగా అల్లాయ్ వీల్స్ కూడా అందంగా ఉంటాయి. ఇంటీరియర్‌లో చాలా అధునాతన ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ పరంగా కూడా అదనపు ఆప్షన్లను కారులో అందించారు.

upcoming kia cart ev6 in 2025

Kia EV6 facelift:కియా ఈవీ6 ఫేస్‌లిఫ్ట్ 2025 మధ్య భాగంలో లాంచ్ కాబోతుంది. ఇది పెద్ద 84 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుందని సమాచారం. బయట డిజైన్ కూడా అందంగా ఉంటుంది. ముందు భాగంలో c-ఆకారంలో స్లీకర్ హెడ్‌ల్యాంప్‌లు, లోపల 12.3-అంగుళాల డిస్‌ప్లే, ప్రయాణికుల భద్రత కోసం ఏయిర్ బ్యాగులు, అధునాతన ADAS ఫీచర్లు, ఇంకా మరిన్ని సదుపాయాలు ఈ కారులో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, December 2, 2024, 9:30 [IST]
English summary
Upcoming kia cars sonet ev carens facelift ev6 in 2025 here details
Read more on: #kia motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+