మహీంద్రా ఎలక్ట్రిక్‌ కార్ల జాతరకు సిద్ధం అవ్వండి.. ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లో మీ ఫేవరెట్‌ కార్లు.. థార్ కూడా ఉంది

భారతీయ ఎస్‌యూవీలకు మంచి డిమాండ్‌ ఉంది. ఈ సంస్థ నుంచి అందుబాటులో ఉన్న లైనప్‌లోని కార్లు అధునాతన ఫీచర్లు కలిగి ఉన్నాయి. ఈ సంస్థ అతి త్వరలో ఎలక్ట్రిక్ మార్కెట్‌ని ఏలేందుకు సిద్ధం అవుతుంది. దీని కోసం కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల అభివృద్ధిపై ఆ సంస్థ వేగంగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఉన్న లైనప్‌లోని ఫేమస్‌ కార్లను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో తీసుకురావాలని చూస్తోంది. మీరు కూడా మహీంద్రా ఎస్‌యూవీలకు వీర అభిమాని అయితే ఈ బ్రాండ్ నుంచి త్వరలో రాబోయే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల వివరాలు మీకోసం..

మహీంద్రా స్కార్పియో.e: ఈ జాబితాలో ముందు ఉన్న ఎస్‌యూవీ స్కార్పియో-ఎన్ ఎలక్ట్రిక్ వెర్షన్. దీనికి స్కార్పియో.ఇ అని నామకరణం చేసినట్లు సమాచారం. ఈ ఎస్‌యూవీ INGLO ప్లాట్‌ఫామ్‌కి మోడిఫైడ్‌ వెర్షన్‌లో రానుంది. ఇంటర్‌నల్‌గా దీనిని పీ1 కోడ్ నేమ్‌తో పిలుస్తున్నారు. ఇది 2,775mm నుంచి 2,975mm వీల్‌బేస్‌ని కలిగి ఉండే అవకాశం ఉంది. మహీంద్రా స్కార్పియోకు ఉన్న డిమాండ్‌ ఈ వేరియంట్‌కి కలిసి రానుంది.

Upcoming-Mahindra-Electric-Scorpio-N

స్కార్పియో.e పవర్‌ట్రెయిన్‌కి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. అయితే ఇది థార్.ఇ కాన్సెప్ట్‌తో సహా బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్లను పంచుకోనుంది. దీని ప్రకారం ఇది 109 bhp మరియు 135 nm టార్క్‌ని ఉత్పత్తి చేసే ఫ్రంట్-మౌంటెడ్ మోటార్, ఆల్‌వీల్‌ డ్రైవ్‌లో 286bhp మరియు 535 nm టార్క్‌ని ఉత్పత్తి చేసే మోటారును కలిగి ఉంటుంది. ఇది 325 కిలోమీటర్ల నుంచి 450 కిలోమీటర్ల రేంజ్‌ అందించనుంది.

మహీంద్రా బొలెరో.e: అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీలలో ఒకటైన బొలెరో కూడా ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లో రానుంది. స్కార్పియో మాదిరిగానే, దీనికి బొలెరో.ఇ పేరునే పెట్టే అవకాశం ఉంది. ఇందులోనూ INGLO ప్లాట్‌ఫామ్‌ని ఉపయోగించవచ్చు. ప్రస్తుతం ఉన్న బొలెరో 2,680mm వీల్‌బేస్‌ని కలిగి ఉంది. కొత్త కారు ఎక్కువ వీల్‌బేస్‌తో రానుంది. బొలెరో.ఇ 325 km నుంచి 450 km రేంజ్‌ అందించే అవకాశం ఉంది.

Mahindra-XUV-E8

మహీంద్రా ఎక్స్‌యూవీ.e8: మహీంద్రా ఎక్స్‌యూవీ 700 యొక్క ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్‌గా భావిస్తున్నారు. ఈ ఎస్‌యూవీని ఇప్పటికే పరీక్షించారు. ఇది కూడా INGLO ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి రానుంది. ఇది 450-500 కి.మీ రేంజ్‌ అందించే అవకాశం ఉంది. ఇది డ్యూయల్-మోటార్ సెటప్‌తో అమర్చబడి రావచ్చు. ఈ ఏడాది చివరికల్లా వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే తొలి మహీంద్రా నుంచి వచ్చే తొలి ఎలక్ట్రిక్‌ SUVగా నిలువనుంది.

మహీంద్రా థార్‌.e: దేశంలో మహీంద్రా థార్‌కి ప్రత్యేక డిమాండ్‌ ఉంది. ఈ ఫేమస్‌ ఆఫ్‌-రోడర్‌ త్వరలోనే ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లో రానుంది. దీనిని Thar.e గా పిలువనున్నారు. బ్రాండ్ నుంచి విడుదల కాబోయే SUVల వలె ఇది కూడా INGLO ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే ఆఫ్-రోడ్ సామర్థ్యాలకు మద్దతుగా ఇది ప్రత్యేకంగా మార్పులు చేయనున్నారు. దీని వీల్‌బేస్ 2,775 mm మరియు 2,975 mm మధ్య ఉండనుంది.

Mahindra-Thar-EV

ఈ ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ ఐదు-డోర్ల ఆప్షన్‌లో అందుబాటులోకి రానుంది. ఈ SUV కాన్సెప్ట్ ఫ్రంట్ మోటార్‌లో 109 bhp మరియు 135 Nm మరియు ఆల్‌వీల్‌ డ్రైవ్‌లో శక్తివంతమైన డ్యూయల్-మోటార్ సెటప్‌తో 286 bhp మరియు 535 Nm టార్క్‌ని విడుదల చేయనుంది. రెండు బ్యాటరీ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉండనుంది. 60kWh బ్యాటరీ ప్యాక్ 325 కిమీ పరిధిని 80 kWh ప్యాక్ 435-450 కిమీ పరిధిని అందిస్తుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, June 15, 2024, 17:07 [IST]
English summary
Upcoming mahindra electric suvs expected range and specifications details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+