2025 లో గుర్తుంచుకోవాల్సిన కార్లు.. అందరికీ అందుబాటు ధరలో.. సరికొత్త వెర్షన్స్‌లో!

మారుతి సుజుకి సంస్థ 2025 లో పక్కా ప్రణాళికతో ముందుకు వస్తుంది. ఇప్పటికే భారతీయ మార్కెట్‌లో కింగ్‌ మేకర్‌గా ఉన్న మారుతి సుజుకి.. కొత్త కార్లను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ కార్లు 2025 లోనే మంచి అమ్మకాలను రాబట్టే అవకాశం ఉంది. ఈ కంపెనీ నుంచి ఎలక్ట్రిక్‌ కార్లు అందుబాటులో లేవు. తాజాగా సుజుకి ఇ-విటారా (eVitara) ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఇది కంపెనీ నుంచి రాబోయే తొలి ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ)గా ఉండనుంది. దీంతో పాటు గ్రాండ్ విటారా 7 సీటర్‌ వెర్షన్‌, 2025 ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్ కూడా త్వరలో రాబోతోంది.

ఫ్రాంక్స్‌ ఫేస్‌లిఫ్ట్‌, గ్రాండ్‌ విటారా 7 సీటర్‌ కార్లు 2025 జనవరిలో జరిగే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పోలో ఆవిష్కరించనున్నారు. ఇక సుజుకి ఇ-విటారా గుర్‌గ్రావ్‌ ఫ్యాక్టరీలో టెస్ట్‌డ్రైవ్‌ చేస్తున్నారు. ఈ ఎస్‌యూవీ నాలుగు మీటర్లకు పైగా ఉండే అవకాశం ఉంది. మంచి గ్రౌండ్ క్లియరెన్స్‌తో పాటు 18 అంగుళాల చక్రాలు ఉండగా.. గ్లోబల్ మోడల్‌లో 19 అంగుళాల ఇంచెస్‌ ఉన్నాయి. 2025లో ఈ కారు భారత్‌లో అడుగుపెట్టనుంది.

Suzuki e Vitara

ఇ-విటారా రెండు బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్స్‌తో వస్తుంది. 49 కిలోవాట్, 61 కిలోవాట్ల ప్యాక్‌తో రానుంది. చిన్న బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే ఈవీ కారు 172 bhp పవర్, 189 nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. పెద్ద బ్యాటరీ ప్యాక్‌ ఇది 181 bhp, 300 nm టార్క్‌ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఇది 4WD సిస్టమ్‌తో వస్తుంది. ఇది 500 కిలోమీటర్ల రేంజ్‌ని అందించే అవకాశం ఉంది.

మారుతి సుజుకి 7 సీటర్‌ గ్రాండ్ విటారాను (దేశీయ పేరు Y17 పేరుతో) అభివృద్ధి చేస్తోంది. ఇది పెట్రోల్, సీఎన్‌జీ, హైబ్రిడ్ ఎడిషన్‌లలో అందుబాటులో ఉండనుంది. ఈ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ అల్కజార్, టాటా సఫారీ, మహీంద్రా XUV700, ఎంజీ హెక్టర్ వంటి కార్లకు గట్టి పోటీని ఇస్తుంది. టయోటా నుంచి అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి మోడల్‌ కూడా ఇదే వెర్షన్‌లో వస్తుంది.

Maruti Grand Vitara 7 Seater

ఈ గ్రాండ్ విటారా 7 సీటర్ వెర్షన్‌ రూ .15 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది అత్యంత ఖరీదైన కారుని కావచ్చు కానీ స్టాండర్డ్ ఎడిషన్‌తో పాటు 6 సీట్ల ఎడిషన్‌తో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఇది కూడా జనవరి 2025 లో జరిగే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ ఎస్‌యూనీ చూడవచ్చు.

మరో కారు ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్ మారుతి సెల్ఫ్-మేడ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో రానుంది. ప్రస్తుతం మారుతి టయోటా హైబ్రిడ్ పవర్ట్రెయిన్‌ని ఉపయోగిస్తుంది. ఈ ఫేస్‌లిఫ్ట్‌ని స్విఫ్ట్ జెడ్ 12 ఇ పెట్రోల్ ఇంజిన్‌తో తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ ఫ్రాంక్స్‌ మాదిరిగానే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌కి కూడా మంచి డిమాండ్‌ లభించనుంది. ఈ మూడు కార్లు మారుతి నుంచి టాప్‌ మోడల్స్‌గా అందుబాటులోకి రానున్నాయి. వీటికి సంబంధించిన లీక్స్‌ని మారుతి ఇచ్చేసింది.

Maruti Suzuki Fronx Facelift

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, December 17, 2024, 10:56 [IST]
English summary
Upcoming maruti suzuki cars in 2025 e vitara to fronx facelift
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+