మైలేజ్‌లో వీటిని ఢీకొట్టేది లేదు.. త్వరలో మారుతి సుజుకి నుంచి రాబోతున్న సిరీస్‌ హైబ్రిడ్‌ కార్లు ఇవే.!!

దేశంలో హైబ్రిడ్‌ కార్ల(Hybrid Cars) విభాగంలో మారుతి సుజుకి(Maruti Suzuki) ఇండియా లిమిటెడ్‌ ఒకటి. 2022 లో మారుతి సుజుకి దాని స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ సిస్టమ్‌ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. త్వరలో ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్‌ టెక్నాలజీతో ఈ సంస్థ నుంచి మరో 4 కొత్త కార్లు విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

మారుతి సుజుకి దాని హైబ్రిడ్ టెక్నాలజీలో బ్రాండ్ యొక్క ప్రసిద్ధ K15C 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇందులో శక్తివంతమైన 140V లిథియం-అయాన్ బ్యాటరీని ఉపయోగించారు. ఇది సాటిలేని పనితీరు మరియు ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని సంస్థ పేర్కొంది. ఈ క్రమంలో సుజుకి స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో వివరంగా చూపించే వీడియోను తమ సుజుకి గ్లోబల్ యూట్యూబ్‌ ఛానెల్‌లో సంస్థ షేర్ చేసింది.

Maruti-Suzuki-Series-Hybrid-Cars

సుజుకి స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌(Suzuki Strong Hybrid System)లో ఉపయోగిస్తున్న K15C పెట్రోల్ ఇంజిన్‌.. 115 PS పవర్ అవుట్‌పుట్ మరియు 138 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ ఎలక్ట్రిక్ మోటారు 33 PS మరియు 60 Nm అదనపు టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని సంస్థ వెల్లడించింది. ఇందులోని హైబ్రిడ్ సిస్టమ్‌.. ఎకో మోడ్‌తో సహా వివిధ పద్ధతుల్లో పనిచేస్తుంది.

సుజుకి హైబ్రిడ్‌ సిస్టమ్‌లోని ఎలక్ట్రిక్ మోటారు సాధారణ మోడ్, ఉద్గారాల నియంత్రణ, అధిక మైలేజ్‌ను అందించేందుకు టార్క్‌ను ఉత్పత్తి చేయడంతో ఇంజిన్‌కు దోహదపడుతుంది. 140V లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్, 12V లిథియం-అయాన్ బ్యాటరీ మరియు 12V లెడ్-యాసిడ్ బ్యాటరీతో కూడిన బ్యాటరీ సెటప్.. ఇందులోని పెట్రోల్ ఇంజిన్ మరియు ఎలక్ట్రిక్ మోటారుకు అనుసంధానించారు.

Maruti-Suzuki-Series-Hybrid-Cars

ఈ సమగ్ర బ్యాటరీ వ్యవస్థ ద్వారా మారుతి సుజుకి హైబ్రిడ్‌ కార్లలోని ఎలక్ట్రిక్ మోటారు(Maruti Suzuki Series Hybrid System)కు శక్తినివ్వడమే కాకుండా లైట్లు మరియు క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్‌ల వంటి ముఖ్యమైన వాహన భాగాలకు కూడా సపోర్ట్‌ చేస్తుంది. వాహనదారులకు మెరుగైన రైడింగ్‌ అనుభూతిని ఈ సిస్టమ్‌ అందిస్తుంది.

ఈ క్రమంలో హైబ్రిడ్‌ కార్ల ఉత్పత్తిపై మారుతి సుజుకి కృషి చేస్తోంది. ఈ సరికొత్త హైబ్రిడ్‌ సిస్టమ్‌ను సిరీస్‌ హైబ్రిడ్‌ సిస్టమ్‌గా కంపెనీ పేర్కొంది. ఈ పవర్‌ట్రెయిన్‌తో దేశంలో త్వరలో నాలుగు కొత్త కార్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఆ నాలుగు కార్లు జాబితా ఇలా ఉంది.

Maruti-Suzuki-Series-Hybrid-Cars

మారుతి స్విఫ్ట్‌(Swift): భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌ మారుతి సుజుకి స్విఫ్ట్‌. త్వరలో కొత్త తరం సుజుకి సిరీస్ హైబ్రిడ్ సిస్టమ్‌తో గణనీయమైన అప్‌గ్రేడ్‌తో విడుదల కానుంది. దీని ద్వారా కొత్త స్విఫ్ట్‌ మైలేజ్‌ కూడా పెరగనుంది. కొత్త సిరీస్‌ హైబ్రిడ్‌ సిస్టమ్‌ ద్వారా జోడించిన ఎలక్ట్రిక్ మోటారు సహాయంతో, స్విఫ్ట్ దాదాపు లీటర్‌కు 35 కి.మీ మైలేజ్‌ అందిస్తుందని సమాచారం.

మారుతి డిజైర్‌(Dzire): స్విఫ్ట్‌ హ్యాచ్‌బ్యాక్‌ ఆధారంగా రూపొందించిన మారుతి డిజైర్‌.. భారత కస్టమర్లకు ఇష్టమైన కాంపాక్ట్ సెడాన్‌లలో ఒకటి. సుజుకి కొత్త సిరీస్‌ హైబ్రిడ్‌ సిస్టమ్‌ ద్వారా అధిక మైలేజ్‌ ఇచ్చే విధంగా ఈ కారును సంస్థ రూపొందిస్తోంది. కొత్త తరం డిజైర్ భారీగా రీడిజైన్ చేయబడిన ఎక్స్‌టీరియర్‌ మరియు ఇంటీరియర్‌ను కలిగి ఉండటమే కాకుండా.. సింగిల్-పేన్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో సహా టన్నుల కొద్దీ కొత్త ఫీచర్లతో రానుంది.

Maruti-Suzuki-Series-Hybrid-Cars

మారుతి 7 సీట్‌ గ్రాండ్‌ విటారా(Grand Vitara): మారుతి సుజుకి నుంచి రాబోయే మరో ఎస్‌యూవీ 7 సీట్‌ గ్రాండ్‌ విటారా కూడా కొత్త సిరీస్‌ హైబ్రిడ్‌ సిస్టమ్‌తో రానుంది. బలమైన హైబ్రిడ్‌ సిస్టమ్‌తో ప్రస్తుతం మారుతి సుజుకి గ్రాండ్‌ విటారా మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ కారు ప్రస్తుతం 28 kmpl మైలేజీని అందిస్తోంది. త్వరలో 7 సీట్‌ కాన్ఫిగరేషన్‌తో ఈ కారు విడుదల కానుంది.

మారుతి ఫ్రాంక్స్‌(Maruti Suzuki Fronx): చివరగా మారుతి సుజుకి నుంచి కొత్త సిరీస్‌ హైబ్రిడ్‌ టెక్నాలజీతో రానున్న మరో మోడల్‌ ఫ్రాంక్స్‌ ఎస్‌యూవీ. లీటర్‌కు 35 కి.మీ మైలేజ్‌ని అందించే విధంగా దీనిని రూపొందింస్తున్నారు. అయితే ఇంటీరియర్‌, ఎక్స్‌టీరియర్‌ పరంగా భారీ మార్పులు చేయనప్పటికీ.. స్వల్ప మార్పులతో ఈ కారు అప్‌గ్రేడ్‌ కానుంది.

More from DriveSpark

Article Published On: Friday, February 16, 2024, 13:27 [IST]
English summary
Upcoming maruti suzuki series hybrid cars with hybrid technology check full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+