మొదలైన ఫ్రీ బుకింగ్స్.. కొత్త మినీ మోడల్స్ కోసం..

దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు ఆధునిక వాహనాలు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఈ నెలలో కూడా లాంచ్ కావడానికి కొన్ని కార్లు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ఐదవ తరం 'మినీ కూపర్ ఎస్' మరియు 'మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్' కూడా ఉన్నాయి. కంపెనీ రెండు కార్లను ఈ నెల (జులై 24) 24న అధికారికంగా మార్కెట్లో లాంచ్ చేయనుంది. అంతకంటే ముందు సంస్థ ఈ కార్ల కోసం ప్రీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ప్రీ బుకింగ్స్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, ధరలు ఎలా ఉన్నాయి మరియు డెలివరీలు ఎప్పుడు అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

జులై 24న లాంచ్ కానున్న మినీ కూపర్ ఎస్ మరియు మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ కోసం కస్టమర్లు కంపెనీ యొక్క అధీకృత డీలర్‌షిప్‌లలో లేదా అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. కంపెనీకి దేశ వ్యాప్తంగా తొమ్మిది డీలర్‌షిప్‌లు ఉన్నాయి. అవి బర్డ్ ఆటోమోటివ్ (ఢిల్లీ ఎన్సీఆర్) మరియు బవేరియా మోటార్స్ (పూణే) ఉన్నాయి. ఇందులో కస్టమర్లు రాబోయే మినీ కార్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు.

Mini Cooper S and Countryman EV Car Pre-Booking Open

పైన చెప్పిన డీలర్షిప్స్ మాత్రమే కాకుండా.. ఈవీఎం ఆటోక్రాఫ్ట్ (కొచ్చి), గాలప్స్ ఆటోహాస్ (అహ్మదాబాద్), ఇన్ఫినిటీ కార్స్ (ముంబై), కృష్ణ ఆటోమొబైల్స్ (చండీగఢ్), కేయుఎన్ ఎక్స్‌క్లూజివ్ (చెన్నై), కేయుఎన్ ఎక్స్‌క్లూజివ్ (హైదరాబాద్) మరియు కేయుఎన్ ఎక్స్‌క్లూజివ్ (బెంగళూరు) ఉన్నాయి. ఇందులో కూడా ముందస్తు బుకింగ్స్ చేసుకోవచ్చు. డీలర్షిప్ వద్ద మాత్రమే కాకుండా.. ఆన్‌లైన్‌లో కూడా బుకింగ్‌ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.

త్వరలో లాంచ్ కానున్న కొత్త మినీ కూపర్ ఎస్ మరియు మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ రెండూ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఆధునికంగా ఉంటాయి. డిజైన్ పరంగా కొంత అప్డేట్స్ పొందుతాయి. ఫీచర్లలో కూడా కొన్ని అప్డేట్స్ గమనించవచ్చు. పరిమాణం పరంగా కూడా ఇవి వాటి మునుపటి మోడల్స్ కంటే కూడా కొంత పెద్దవిగా ఉంటాయి. కాబట్టి వాహన వినియోగదారులు అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చు.

Mini Cooper S 5 Door

కొత్త మినీ కూపర్ ఎస్ మంచి డ్రైవింగ్ అనుభూతిని అందించే విధంగా రూపొందించబడింది. అదే విధంగా ఆల్ ఎలక్ట్రిక్ మినీ కంట్రీమ్యాన్ కూడా ఆధునిక టెక్నాలజీ కలిగి వాహనదారులకు అనుకూలంగా ఉంటుంది. పనితీరు పరంగా కూడా ఇవి రెండూ చాలా ఉత్తమంగా ఉంటాయని తెలుస్తోంది. కాబట్టి దేశీయ మార్కెట్లో మినీ కొత్త కార్లు తప్పకుండా వాహన ప్రేమికులను ఆకర్షిస్తుందని భావిస్తున్నాము.

కొత్త మినీ కూపర్ ఎస్ కొత్త గ్రిల్, రౌండ్ ఎల్ఈడీ హెడ్లాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్, యూనియన్ జాక్ థీమ్ టెయిల్ లైట్స్ వంటివి పొందుతుంది. ఇవన్నీ చూపరులను ఆకర్శించడంలో సహాయపడతాయి. ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో క్యాబిన్ మినిమలిస్ట్ డిజైన్ పొందుతుంది. క్యాబిన్ ప్రకాశవంతంగా ఉండటానికి యాంబియంట్ లైటింగ్ పొందుతుంది. ఇంకా టోగుల్ స్విచ్, పార్కింగ్ బ్రేక్, గేర్ సెలక్టర్ మొదలైనవి ఉన్నాయి.

Mini Countryman E

ఇక మినీ కూపర్ ఎలక్ట్రిక్ విషయానికి వస్తే.. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ కారు 201 Bhp పవర్ మరియు 250 Nm టార్క్ అందిస్తుంది. ఈ కారు ఒక ఫుల్ చార్జితో 400 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది. దీనికి తగిన విధంగా ఇందులో బ్యాటరీ ఉంటుంది. ఇది కేవలం 8.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, July 5, 2024, 11:00 [IST]
English summary
Upcoming mini cooper s and countryman ev car pre booking open
Read more on: #mini #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+