అదిరిపోయే 7-సీటర్ కార్లు వచ్చేస్తున్నాయ్.. 35 కి.మీ మైలేజీ, రెెండు ఫ్యామిలీలు హాయిగా వెళ్లవచ్చు!
భారతదేశంలో ఎంపీవీ సెగ్మెంట్ కార్లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు సైతం ఈ సెగ్మెంట్‌పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయి. పలు ఫేమస్ కంపెనీల నుంచి అతి త్వరలో అనేక కొత్త మోడళ్లు విడుదల కానున్నాయి. వీటిలో భారీ స్పేస్, ఎక్కువ కంఫర్ట్‌తో రెండు ఫ్యామిలీలు వెళ్లవచ్చు. మార్కెట్‌లో అడుగుపెట్టనున్న ఈ ఎంపీలలో కొన్ని పర్యావరణ అనుకూలమైన ఎలక్ట్రిక్, అలాగే సాంప్రదాయ ఐసీఈ వెర్షన్‌లో విడుదల కానున్నాయి. ఇవి మార్కెట్‌లో వస్తే డిమాండ్ భారీగా ఉండే అవకాశం ఉంటుంది. వాటికి సంబంధించిన వివరాలు ఈ కథనంలో..
ఈ విభాగంలో ముందు జాబితాలో న్యూ జనరేషన్ కియా కార్నివాల్ (Kia Carnival MPV) ఉంది. ఇది అక్టోబర్ 3 న ఆ కంపెనీకి చెందిన ఈవీ 9 తో పాటు లాంచ్ కానుంది. ఈ లిమోసిన్ ట్రిమ్‌ని సీబీయూ (Complete Built Unit)గా దిగుమతి చేసుకోనున్నారు. ఈ మోడల్ ప్రస్తుతం ఉన్న దానితో పోల్చితే అప్‌గ్రేడ్ ఫీచర్లతో వస్తుంది. ఇందులో మరిన్ని అప్ డేట్ ఫీచర్లు ఉన్నాయి.

12.3 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫర్మేషన్ సెంటర్, 12.3 అంగుళాల డిజిటల్ క్లస్టర్ వంటి అధునాతన టెక్నాలజీని ఈ కార్నివల్ కలిగి ఉండనుంది. గత కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన స్పై ఫోటోల ప్రకారం డిజైన్ ఇతర మార్పులతో కియా కెకార్నివల్ వస్తుంది. ఈ అప్‌డేటెడ్ మోడల్‌లో కనెక్టెడ్ లైట్ బార్‌తో కొత్త ఎల్ఈడీ ఫ్రంట్ లైట్లు, కొత్త ఇన్సర్ట్‌లతో రీడిజైన్ చేసిన గ్రిల్ ఉన్నాయి.
అంతే కాకుండా ఇది అప్‌డేటెడ్ అల్లాయ్ వీల్స్, రీడిజైన్ చేసిన బంపర్లతో వస్తుంది. దీని భాగంలో లేటెస్ట్ సోనెట్, సెల్టోస్ మోడళ్ల వలె ఉంటే టెయిల్ లైట్స్ ఉంటాయి. కారు లిస్టింగ్ అప్‌గ్రేడ్ చేయబడినప్పటికీ, ఇంజిన్‌లో మాత్రం ఎటువంటి మార్పులు లేకపోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అతి కొద్ది రోజుల్లోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

భారత మార్కెట్ కోసం దీనిని ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కియా అభివృద్ధి చేస్తోంది. కుటుంబంతో ప్రయాణించడానికి కారు కోసం చూస్తున్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని.. ఈ ఈవీని తీసుకురానుంది. 2025 చివరి నాటికి లేదా 2026 ప్రారంభంలో ఇది లాంచ్ కావచ్చు. అంతే కాకుండా దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 450-500 కిలోమీటర్ల రేంజ్‌ని అందించవచ్చు.
ఆ తర్వాత జాబితాలో BYD M6 ఎలక్ట్రిక్ ఎంపీవీ ఉంది. దీనిని ఇటీవల కైకింటో ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో షోలో ప్రదర్శించారు. ఈ కారు భారత మార్కెట్ కోసం సిద్ధంగా ఉంది. ఇది e6 కారు ఫేస్‌లిఫ్ట్ ఎడిషన్ అప్‌డేటెడ్ LED లైట్స్, ఇంటిగ్రేటెడ్ DRLలతో పాటు ఇతర డైజైన్ మార్పులు, ఇంటీరియర్ కూడా ప్రీమియం అప్డేట్లను పొందుతుంది. ఈ కారు వచ్చే నెలలో భారతదేశంలో లాంచ్ కానుంది.

ఆ తర్వాత జాబితాలో మారుతి సుజుకి కొత్త కారుని విడుదల చేయనుంది. ఇది నేరుగా రెనాల్ట్ ట్రైబర్‌కి గట్టి పోటీని ఇస్తుంది. తమ లైనప్‌లో ఎర్టిగా కంటే దిగువన ఈ కాంపాక్ట్ ఎంపీవీని మారుతి రూపొందించే పనిలో ఉంది. ఈ మోడల్ జపాన్‌లో విక్రయించే స్పేసియా మోడల్ మాదిరిగా రూపొందనుంది. ఈ కారు స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ ఇంజిన్‌తో రానుంది. ఇది లీటరుకు 35 కిలోమీటర్లకు పైగా మైలేజీని ఇవ్వనుంది.
అంతేకాకుండా మారుతి సుజుకి-టయోటా కలిసి ఎలక్ట్రిక్ ఎంపీవీని తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇంది ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రానుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల రేంజ్ వరకు ప్రయాణించవచ్చు. అయితే దీనిని రూపొందించే పనిలో రెండు సంస్థలు బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారు గురించి ఇప్పటి వరకు సమాచారం లేదు. ఈ కారుకు సంబంధించిన పూర్తి సమాచారం త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.
వచ్చే మూడేళ్లలో నిస్సాన్ తన లైనప్‌ని మరింత విస్తరించాలని యోచిస్తోంది. ఈ కాంబినేషన్లలో రెనాల్ట్ ట్రైబర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా కాంపాక్ట్ ఎంపీని అందించనుంది. కొత్త మోడల్ సరసమైన ధరలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత ట్రైబర్ మాదిరిగానే అదే ఇంజిన్‌తో డిజైన్ చేయవచ్చు. అయితే దీని వివరాలు అధికారికంగా ధృవీకరించబడలేదు.


Click it and Unblock the Notifications








