రెండు ఫ్యామిలీలకు సరిపడా పూర్తి కంఫర్ట్ కార్లు.. వచ్చే ఏడాదిలో హాలీడే ట్రిప్స్‌ను ఎంజాయ్ చేయండి..
ప్రపంచవ్యాప్తంగా పని ఒత్తిడి బాగా పెరిగిపోయింది. దీంతో కొందరు వీలు చూసుకుని ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా విహారయాత్రలకు వెళ్తుంటారు. ఈ ధోరణి ఇటీవల కాలంలో ఎక్కువ అయింది. అంతా కలిసి ఒకే కారులో వెళ్తుంటే ఆ మజాయే వేరుగా ఉంటుంది. ఆటపాటలతో అందరు కలిసి ప్రయాణిస్తుంటే ఎంజాయ్‌మెంట్ వేరే లెవల్. ఇలా ఎక్కువ మంది కలిసి ప్రయాణించడానికి అనువుగా ఫ్యామిలీ ఎంపీవీ(MPV)లు ప్రస్తుతం మార్కెట్లోకి చాలా వస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు చాలా కొత్త కార్లు రాగా మరి కొద్ది రోజుల్లోనే 2024 ముగియనుంది. ఈ కొద్ది సమయంలో తక్కువ ఎంపీవీలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే వచ్చే ఏడాది 2025 మరిన్ని ఎంపీవీలు మార్కెట్లోకి సందడి చేయడానికి రాబోతున్నాయి. ఇవి చాలా వరకు 7 లేదా 8 మంది ప్రయాణించడానికి అనువుగా ఉండే విధంగా ఉండనున్నాయి.
వచ్చే ఏడాది రాబోయే ఫ్యామిలీ ఎంపీవీలలో ఎంజీ మోటార్స్ మిఫా 9 (Mifa 9), కియా కేరెన్స్(KIA CARENS)ప్రధానంగా చాలా మంది దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. ఎంజీ మిఫాను 2025 సంవత్సరంలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో మొదటగా ప్రదర్శించనున్నట్లు గతంలోనే కంపెనీ ప్రకటించింది. ఈ ఈవెంట్ తరువాత కారు మార్చి 9 నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

మిఫా 9 ధర రూ.65 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఈ ఎంపీవీ 7-సీటర్, 8-సీటర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది 2.0 లీటర్ పెట్రోల్, డీజిల్, మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంటుంది. పూర్తి ఎలక్ట్రిక్ ఆప్షన్‌లో కూడా లభించే అవకాశం ఉంది. సింగిల్ ఛార్జింగ్‌తో ఇది 430 కి.మీ వరకు ప్రయాణిస్తుందని సమాచారం. ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్‌గా ఉంటూనే దీనిలో డజన్ల కొద్ది అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
ముందు పొడవాటి LED హెడ్‌లైట్, సైడ్ ప్రొఫైల్ విండోస్, డోర్ సిల్స్ చుట్టూ క్రోమ్ యాక్సెంట్‌లు, డ్యూయల్ సన్‌రూఫ్‌లు, మసాజ్, హీటింగ్ ఫంక్షన్‌లతో కూడిన పవర్డ్ సీట్లు, రియర్ సైడ్ రిక్లైనింగ్ సీట్లు, రియర్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌లు వంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. మిఫా 9 ప్రధానంగా మార్కెట్లో కియా కార్నివాల్, టయోటా వెల్‌ఫైర్ వాటికి గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.

2025లో ఫ్యామిలీ వినియోగదారుల కోసం రాబోతున్న కియా కేరెన్స్ ఫేస్‌లిఫ్ట్ కూడా అందరి దృష్టిని ఆకర్షించేలా ఉంది. దీని ఉత్పత్తిని 2025 మే నెలలో ప్రారంభిస్తారు. ఇది మూడు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.5L పెట్రోల్, 1.5L టర్బోచార్జ్డ్ పెట్రోల్, 1.5L డీజిల్ పవర్ ట్రైయిన్స్‌లలో కొనుగోలుకు ఉంటుంది. దీనిలో మాన్యువల్, ఆటోమెటిక్ గేర్ బాక్స్‌ను ఇంజిన్‌కు జత చేశారు.
ఈ కారుతో పాటు కియా కె-రన్ లైనప్‌లో పూర్తి ఎలక్ట్రిక్ వేరియంట్‌ను సైతం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఇది కూడా కుటుంబ వినియోగదారులకు ఉపయోగపడుతుంది. మరో కంపెనీ హ్యుందాయ్‌కు చెందిన క్రెటా ఈవీలో ఉన్న విధంగా 45kwh బ్యాటరీని కియా తన కారులో అందించే అవకాశం ఉంది. రేంజ్ పరంగా సింగిల్ ఛార్జింగ్‌తో దాదాపు 450 కి.మీ వరకు ప్రయాణిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

వీటితో పాటు మరిన్ని ఎంపీవీలు కూడా 2025 ఏడాదిలో రాబోతున్నాయి. రెండు కుటుంబాలు ప్రయాణించడానికి ఇవన్నీ కూడా బెస్ట్ ఆప్షన్‌గా ఉంటాయి. ఈ విభాగంలో కస్టమర్ల నుంచి వస్తున్న డిమాండ్ రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువ దూరం, అధిక లగేజీతో వెళ్లడానికి ఈ ఎంపీవీలు వినియోగదారులకు అనువుగా ఉండటంతో పాటు వీటి ధరలు కూడా మధ్యస్థంగానే ఉండనున్నాయి.


Click it and Unblock the Notifications








