కెమెరాకు చిక్కిన సరికొత్త ఎలక్ట్రిక్ కారు.. ఫోటోలు చూశారా?

దేశీయ మార్కెట్లో కొంత సరసమైన ధరలో లభించే కారు ఏది అనగానే చాలామంది టక్కున రెనాల్ట్ యొక్క క్విడ్ అని చెబుతారు. అయితే ఈ కారు త్వరలో భారతదేశంలో ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల గ్లోబల్ మార్కెట్లో అడుగుపెట్టిన డాసియా స్ప్రింగ్ ఈవీ చెన్నైలో టెస్టింగ్ సమయంలో కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టెస్టింగ్ దశలో ఉన్న ఈ కారు కామోఫ్లాగేడ్ (మభ్యపెట్టబడిన) పొందినప్పటికీ.. లోగో మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.

కంపెనీ ఈ కారును 2025లో భారతీయ విఫణిలో లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం. రెనాల్ట్ యొక్క సరసమైన గ్లోబల్ బ్రాండ్ డాసియా యూరోపియన్ మార్కెట్లో స్ప్రిన్ ఎలక్రిక్ కారును పరిచయం చేసింది. ఇదే కారు కొత్త తరం క్విడ్ కారుగా ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. నిజానికి డాసియా స్ప్రింగ్ ఈవీ అనేది దేశీయ మార్కెట్లోని క్విడ్ ఆధారంగా రూపొందించబడిన మోడల్.

Dacia Spring EV

టెస్టింగ్ దశలో కనిపించిన ఈ కారులోని హెడ్‌ల్యాంప్‌లు బంపర్‌పై ఎల్‌ఈడీ డీఆర్ఎల్‌లతో అమర్చబడి ఉంటాయి. ఆకృతి మాత్రం క్విడ్ కారును తలపిస్తుంది. అయితే ఇందులో బ్లాక్ ప్లాస్టిక్ ఇన్సర్ట్‌తో చుట్టబడిన టెయిల్‌లైట్‌లను చూడవచ్చు. వీల్ ఆర్చెస్ చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్ ఉంది. ఛార్జింగ్ పోర్ట్ ముందు భాగంలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే డిజైన్ వివరాలు అధికారికంగా వెల్లడవుతాయి.

డాసియా స్ప్రింగ్ ఈవీ త్రీ స్పోక్ మల్టి ఫంక్షన్ స్టీరింగ్ వీల్ పొందుతుంది. ఇందులో 10 ఇంచెస్ ఫ్రీ స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 7 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే యూనిట్‌ కూడా ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్లో డాసియా స్ప్రింగ్ ఈవీ రెండు ఎలక్ట్రిక్ మోటార్ ఎంపికలతో లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు 30 కిలోవాట్ డీసీ ఛార్జర్ ద్వారా వేగంగా ఛార్జ్ చేసుకోగలదు.

Upcoming Renault Kwid EV Spied

డాసియా స్ప్రింగ్ ఈవీ 26.8 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక సింగిల్ చార్జితో ఏకంగా 220 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని రెండు ఎలక్ట్రిక్ మోటార్లు 46 పీఎస్ పవర్ మరియు 66 పీఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ కారు 15 యాంపియర్ ప్లగ్ పాయింట్ ద్వారా 11 గంటలలో ఫుల్ ఛార్జ్ చేసుకుంటుంది. 7 కేడబ్ల్యు వాల్ బాక్స్ ఛార్జర్ ద్వారా 4 గంటలలో 20 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకోగలదు.

రెనాల్ట్ యొక్క క్విడ్ కార్లు ఇప్పటికే దేశీయ మార్కెట్లో మంచి అమాంకాలతో అధిక ప్రజాదరణ పొందింది. అలాంటి కారు త్వరలోనే ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ అవుతుందనే వార్త తెలియడం వాహనప్రియులలో కొంత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. అయితే ఈ కారు ప్రస్తుతం టెస్టింగ్ దశలో మాత్రమే ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. ఇవన్నీ రాబోయే రోజుల్లో వెల్లడవుతాయి.

Upcoming Renault Kwid EV Spied

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ పెరుగుతోంది. ప్రజలు కూడా ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో వాహన తయారీ సంస్థలు కూడా తమ ఉత్పత్తులను ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే రెనాల్ట్ కంపెనీ కూడా ఎలక్ట్రిక్ రూపంలో క్విడ్ కారును లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇది దేశీయ విఫణిలో లాంచ్ అయిన తరువాత గొప్ప అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

Source: Team BHP

More from DriveSpark

Article Published On: Wednesday, August 7, 2024, 14:19 [IST]
English summary
Upcoming renault kwid ev spied testing in india details
Read more on: #renault #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+