టాటా, మహీంద్రా నుంచి కొత్త ఎలక్ట్రిక్ కార్లు.. పెట్రోల్, డీజీల్ కార్లకు టెన్షన్ లేకుండా గుడ్‌బై చెప్పండి!
దేశంలో ఎలక్ట్రిక్ కార్లు కొనేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీటి వినియోగంపై ఉన్న అపోహాలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. దీంతో సాంప్రదాయ పెట్రోల్, డీజీల్ వెహికిల్స్‌తో ఎలక్ట్రిక్ కార్లు అమ్మకాల్లో పోటీ పడుతున్నాయి. ఈ సెగ్మెంట్‌లో టాటా మోటార్స్ టాప్‌లో కొనసాగుతున్నాయి. అయితే గత కొన్ని నెలల క్రితం టాటా ఈవీ అమ్మకాలకు ఎంజీ మోటార్స్ చెక్ పెట్టింది. ఈ కంపెనీ నుంచి ఎవ్వరూ ఊహించిన విధంగా భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడవుతున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్‌లలో ఈ కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. వీటితో పాటు మహీంద్రా ఈవీ కార్ల అమ్మకాలు పర్వాలేదనిపిస్తున్నాయి.
సాంప్రదాయ కార్లతో పోల్చితే భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలు చేసే వారి సంఖ్య ఇప్పటికీ తక్కువగా ఉన్నప్పటికీ.. అమ్మకాల్లో స్థిరమైన పురోగతి కనిపిస్తోంది. అందుకే టాటా, మహీంద్రా వంటి ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు దేశంలో తమ కొత్త ఎలక్ట్రిక్ ఉత్పత్తులను తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. త్వరలో ఈ టాప్ కంపెనీల నుంచి రాబోయే ఎలక్ట్రిక్ కార్లపై ఓ లుక్కేయండి.

మహీంద్రా రెండు కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను రేపు (నవంబర్ 26) ఆవిష్కరించనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కొన్ని లీక్‌లను కంపెనీ వెళ్లడించింది. ఈ కారుకు సంబంధించిన మిగతా వివరాలను రేపు వెళ్లడించనున్నారు. ఈ కార్ల ధరలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. మాస్ మార్కెట్‌ని టార్గెట్ చేస్తూ మహీంద్రా ఈ కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తుంది.
టాటా హారియర్ ఈవీ: హారియర్ ఈవీ అతి త్వరలో అమ్మకానికి వచ్చే తదుపరి టాటా ఎలక్ట్రిక్ కారు. అందుకే హారియర్ ఈవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ హారియర్ ఈవీ ఎలక్ట్రిక్ కారును 2025 మార్చిలో లాంచ్ చేసే అవకాశం ఉంది. విడుదలకు ముందే జనవరిలో భారత్ మొబిలిటీ ఎక్స్ పోలో ఈ ఎలక్ట్రిక్ ఈవీని ప్రదర్శించనున్నారు. టాటా సఫారీని కూడా ఈవీ వెర్షన్‌లో తీసుకురానున్నారు.

మహీంద్రా బీఈ 6e: నవంబర్ 26న మహీంద్రా విడుదల చేయనున్న రెండు ఎలక్ట్రిక్ కార్లలో BE 6e ఒకటిగా ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.18 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ధరకు తగినట్లుగానే ఫీచర్లు రానున్నాయి. ఈ మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కారు BE 6e కారు లుక్, డిజైన్ పరంగా భిన్నంగా రానుంది.
మహీంద్రా ఎక్స్‌ఈవీ 9e: నవంబర్ 26న మహీంద్రా నుంచి రానున్న మరో ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం గమనార్హం. ఇది BE 6e కారు కంటే పరిమాణంలో పెద్దదిగా ఉండనుంది. ఈ ఎక్స్ఈవీ 9e ఓ విధంగా లగ్జరీ మహీంద్రా ఎలక్ట్రిక్ కారుగా అభివర్ణించవచ్చు. అయితే ఇందులోనూ BE 6eలో ఉపయోగించిన అదే మహీంద్రా INGLO ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది.

టాటా సియెర్రా ఈవీ: మహీంద్రా XEV 9e ఎలక్ట్రిక్ కారుకు పోటీగా టాటా మోటార్స్ సియెర్రా ఈవీని తీసుకువస్తుంది. అయితే ఇది 2025 మధ్యలో లేదా చివరి నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సియెర్రా ఈవీ పెద్ద ఎలక్ట్రిక్ కారు అయినప్పటికీ 5-సీటర్, 4-సీటర్ కాన్ఫిగరేషన్స్‌లో మాత్రమే తీసుకవచ్చే అవకాశం ఉంది. ఈ కార్ల రాకతో టాటా మార్కెట్‌లో మరింత గ్రిప్ పెంచుకోనుంది.
ఇక వీటితో పాటు ఎంజీ మోటార్స్ కూడా కొత్త కారుని లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీనిపై ఇంకా కంపెనీ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇక మాస్ మార్కెట్‌లో మంచి గ్రిప్ ఉన్న మారుతి సుజుకి, హ్యుందాయ్ నుంచి కూడా ఎలక్ట్రిక్ కార్లను తీసుకురానున్నాయి. ఈ కంపెనీల నుంచి 2025 మిడిల్‌లోనే ఓ ఎలక్ట్రిక్ కారు కొనుగోలుకి అందుబాటులో ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








